Monday, January 31, 2005
బాల్యం
గతం, ముఖ్యంగా బాల్యం మళ్లీ వస్తే ఎంత బావుండు ! అని చాలామంది , నాతో సహా అనుకొంటారు. ఎందుకని? బాల్యంలో మనకి కష్టాలు తెలియవు . బాల్యం తరువాత బడి కి పోతాం. అక్కడ మనపని చదువుకోడం.అదొక్కటే మనం చేసేది .మిగతా కష్టాలు అన్ని పెద్దలకి వదిలేస్తాం.చదువు ,ఆటలు , స్నేహితులు , భవిష్యత్తు గురించి భయం అనేది లేకుండా గడిపేస్తాం..పెరుగుతున్నా కొద్ది మనకి సమస్యలు(?) ..రేపు ఎలా ఉంటుందో తెలియదు.మనకి తెలియకుండానే మనలో background process run అవుతూ ఉంటుందేమో..ఏమవుతుందో అని .దానికి తోడు మనమీద మన పెద్దవాళ్ల ఆశలు . మనకి ఏది ఇష్టమో , మనం ఏం చేయాలో అన్నిటికి వాళ్ల ఇష్టాయిష్టాలు తోడవుతాయి. ప్రతి పనికి ఆలోచన . ఏది మంచో ఏది కాదో అన్న ఆలోచన. తప్పు చేస్తామేమో అన్న భయం.. అన్నిటికన్న ముఖ్యంగా రేపు ఏమవుతుందో అని తెలియని సందేహాలు ..గతంలో కూడా సమస్య లు వచ్చి ఉంటాయి ..కాని వాటిని మనం తెలివిగా సాధించి ఉంటాం..తెలిసిన సమస్య కి తెలిసిన పరిష్కారం ఉంటుంది..మరి తెలియని ,రాబోయే సమస్యకి? ఈ ప్రశ్న ఎప్పుడూ మనకి తెలియకుండా మనలో ఉంటుందేమో..అందుకే ఎప్పుడూ గడిచిన కాలం మనకి ఇష్టం అయి ఉంటుందేమో?
పై విషయానికి సంబంధం లేనిది... ఎక్కడో ఇవాళ చదివా ..ఎవరిదో ఒక బ్లాగు design ఎవరో copy చేసారని పెద్ద రగడ. చేస్తే వచ్చిన నష్టం? తనకి రావాల్సిన పేరు పక్క వాడు కొట్టేసాడనా? అసలు ఏది original అని? అన్నిటికి మూలం ఎక్కడో వేరే చోట ఉంటుంది కదా? ఆ మూలాన్ని copy చేయంది ఎవరు? ఏమో ..మనుషులు పెరిగినంతగా మన ఆలోచనా పరిధి పెరగడం లేదా?
Posted by chava at 8:56 AM 0 comments
Tuesday, January 25, 2005
Monday, January 24, 2005
సత్యమేవ జయతే?
ఒకోసారి మనకి తెలుసు ఖచ్చితంగా అనుకొన్నవి తప్పులు అయి ఉండవచ్చు . పరిటాల గురించి నాకు చాల తక్కువ అభిప్రాయం ఉండేది .కాని గత ఎన్నికల ముందు పరిటాల ముఖాముఖి చూసా.అందులో అతను చెప్పినవి విన్నప్పుడు , అతనున్న పరిస్థితిలో ఎవరైనా అలానే స్పందిస్తారు అనిపించింది. కాకపోతే చాలా మంది ఆ స్పందనని తన మనసులో దాచుకొంటారు . అతను మనసులో అనుకొన్నది చేతల్లో చేసాడు. అది తప్పు అని అతనికీ తెలుసు .తప్పు అని తెలిసీ చేయక తప్పలేదు అని చెప్పాడు. చేసేది తప్పు అని తెలిసినా ఒప్పుకొనే ధైర్యం ఎందరికి ఉంటుంది? అది పరిటాల లో ఉంది . ఆ కారణం చేత మెచ్చు కోవచ్చు అతనిని అనిపించింది . అయితే మాత్రం చంపుతాడా ఎదుటి వాడిని అంటారు . మొన్న ధనుంజయ్ కి ఉరిశిక్ష విషయం లో అతనిని ఉరి తీయాల్సిందే అని గొంతు చించుకొని అరిచిన వాళ్ళే పరిటాల అదే తప్పు చేసిన వాడిన వాడికి , అదే శిక్ష వేసినప్పుడు , తప్పు అని అరవడం ఎంతవరకు సమంజసం? అయినా ఏది సత్యం అనేది ఎవడు చెప్పాడు? నేను చెప్పేది నీకు నచ్చితే , నీకు ఉపయోగకరం అయితే , అది సత్యం అని నీ నమ్మకం. నచ్చలేదూ అది నీవు నమ్మలేదూ ... నీ వరకు అది అసత్యం...కాబట్టి సత్యాసత్యాలని పక్కన పెట్టు కాసేపు ... ఇవాళ పరిటాల అంతం అయాడు అనగానే కొందరు ... అమ్మయ్యా పీడా పోయింది అంటున్నారు ... కాని పరిటాలని మించిన వాడు ఇంకొకడు ఖచ్చితంగా వస్తాడు. చరిత్ర తవ్వడం మనకి పుట్టుకతో వచ్చించే కదా .. అనుమానం ఉంటే తవ్వి చూసుకో ...అతని అంతం కొందరికి ఇవాళ సంతోషం కావొచ్చు .. కాని అది కొందరికి జీవితాంతం బాధ , ఇంకొందరికి పగ .. అసలు పరిటాల తయారీ కి కారణాలు పరిశీలించి , అవి తిరిగి ఇంకా కొందరు పరిటాలలని తయారు చేయకుండా జాగ్రత్త పడితే అది సంతోషించాల్సిన విషయం. అది జరగాలంటే మరో పోరాటం అవసరమేమో అనిపిస్తుంది. ఎంచేతంటే ....
అరుణ్ గావ్లీ పోటీ చేసిన నియోజక వర్గం లో ఒక సాధారుణ పౌరుడిని కదిలిస్తే అతని స్పందన " అరుణ్ ఇలా MLA పదవి కి పోటీ చేయడం నాకేమీ నచ్చలేదు ..అతని స్థాయికి అతను డిల్లీ లో పార్లమెంటు లో ఉండాల్సిన వ్యక్తి " . అయిదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఒక రౌడీ గా పేరుమోసిన వ్యక్తి మీద , ప్రభుత్వం , అధికారుల మీద కన్న నమ్మకం ఎక్కువ ఉంది ఈ రోజు ప్రజలకి ."చాల్ ప్రజలు అతన్నిరోజూ అనేక సమస్యలతో కలుస్తారు .అతను తన మనుషులతో చెప్పి ఇక్కడి వారి సమస్యలు తీరుస్తాడు. అమ్మాయిల పెళ్లి కి పైసలు సహాయం చేస్తాడు . ఉచిత ఆంబులెన్సు సదుపాయం కల్పించాడు. నీళ్ల సరఫరా ఏర్పాటు చేసాడు . ఏ నాయకుడు చేసాడు మాకు ఈ మాత్రం సహాయం?" సాధారణ ప్రజలు మాత్రమే కాదు .." చనిపోయిన పోలీసు కుటుంబానికి క్రమం తప్పకుండా డబ్బు పంపే మొదటి వ్యక్తి అరుణ్ . మా క్వార్టరు రిపేరు ఉంటే , మా అధికారులు కాయితాలు అటు ఇటూ తిప్పుతూ కాలం గడుపుతారు.అరుణ్ ఆ కాయితాల పని అయ్యేలోపు రిపేరు చేయిచ్చేస్తాడు " - ఇది ఒక పోలీస్ అధికారి చెప్పిన విషయం..
అయ్యా అదీ సంగతి . తప్పు పరిటాలదా? పరిటాల లాంటి అవసరం కల్పిస్తున్న చుట్టూ ఉన్న మనలాంటి సమాజానిదా?
Posted by chava at 10:04 PM 2 comments
Thursday, January 20, 2005
ప్రపంచంలో ఉన్నది ప్రేమా? భయమా? ప్రేమించాలి అని అనుకొనేవాడికి ప్రేమించబడాలి అనే కోరిక ఉంటుందా? ఉండదా? ఉంటుంది చాలా శాతం...ఆ కోరిక లేని వాడికి ప్రేమని పొందలేదు అనే బాధ ఉండదు . అలాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కడ చదివినా relationhip failure అని ఒకటే బాధ జనాలలో.. కారణం ? ఎంతసేపు అవతలి వాడిదే తప్పు అని ఒకటే సొద. అసలు ఈ conditional ప్రేమ concept ఏందో? నీకు నచ్చినట్టు ఎదుటి వాడు ఉండాలను కోవడం ప్రేమ ఎలా అవుతుంది? స్వార్ధం అవుతుంది. అంటే ప్రేమ, స్వార్ధం రెండూ ఒకటేనా? ఈ స్వార్ధం ఉందే ఇది ఆనందం తో కూడా కలిసి ఉండటం చాల చిత్రంగా ఉంటుంది.. దేవుడా నా ఈ ఆనందాన్ని ఇలానే ఉంచు అని కోరుకోడం స్వార్ధం తో కూడుకొన్నదే కదా? ఇంకో రకమయిన బాధ నేను ఫలానా పని చేయలేక పోయానే అని ... ఒక పని చేయాలి అని అనుకొన్నావా చేసేయి ... చేయాలని ఉన్నా చేయలేవని తెలిస్తే ఇక ఆ విషయం మర్చిపో .. అలా కాకుండా అయ్యో నేను చేయాలి , చేయలేదు , చేయలేక పోతున్నా అని ఊరికే ఎందుకు సొద? and this one is for pinkos aka whiners ..dont always blame govt for not helping u ... learn something from guys like Ramachandra Rao .. if possible let u r followers practice it ...
Posted by chava at 9:45 PM 1 comments
Wednesday, January 19, 2005
ఒక సమస్య సాధించడానికి ఎన్ని ఆలోచనలు చేయాలి? అదీ నాయకులుగా ఉన్నప్పుడు? ఒక వ్యక్తి కి సంబంధించిన విషయం అయితే పర్యవసానం పరిమితం గా ఉండొచ్చు ...కాని సమస్య రాష్ట్రం మొత్తానిది అయినప్పుడు , కొందరి నిర్ణయాలు అందరికీ ఇబ్బంది. హడావిడిగా చర్చలు అని మొదలెడితివి ...ఎవడేం మాట్లాడుతున్నాడో పక్కనోడి కి అర్ధం కాకుండా అందరూ మాట్లాడితిరి.అసలు సమస్య పక్కన పెట్టి ఆయుధాలు వదలాలని ఒకరు, వదలం అని ఒకరు బిగదీసుకొంటిరి.సందట్లో సడెమియా లా అన్నలు బలం పెంచుకొంటిరి. అధికారంలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగిన సుకుమారుడు దిగగానే వాళ్ళు మరీ అంత చెడ్డవాళ్ళు కాదు అని ప్రశంసాపత్రం అడకకుండానే ఇస్తిడి . ఇప్పుడు గద్దెనెక్కిన స్వరణ్జీతుడేమో వచ్చీ రాగానే గుండు పేల్చుకొంటూ వచ్చె ...అసలు ఏం చేయాలో , ఎలా చేయాలో ఎవరికీ తెలిసినట్టు లేదు . మీకే కాదు ... మీ ప్రత్యర్ధి కి కూడా... బస్సులేం అన్యాయం చేసాయో ...కోపం వచ్చిన ప్రతొక్కడు అవి తగలేస్తాడు. మాలో చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన మేధావులు ఉన్నారు అని గొప్పలైతే చెప్పారు అన్నలు . ఆ పెద్దలిచ్చిన సలహాయేనా ఈ తగలేయడాలు? బందులు? తిప్పి కొడితే 900 మంది లేరట .. నిజంగా అంత కష్టమైన పనా వాళ్లని అడ్డు తొలగించికోవడం? అయ్యి ఉండదు ... వేరే చాలా కారణాలు ఉండి ఉండాలి ..అవేమిటో అర్ధం అయీ కాకుండా ఉన్నాయి మరి ...ఈ గొడవ ఆగక ముందే మానవ హక్కుల వాళ్ళు తయారవుతారు .అరుపులు కేకలతో ... పోలీసులు , అమాయక జనం పోయినప్పుడు ఎక్కడ దాక్కుంటారో వీళ్లు? వోటు విలువ తెలుసుకొనే వరకు ఇంతే ....
Posted by chava at 6:35 PM 1 comments
Monday, January 17, 2005
చర్చలకీ మేం తయార్ :D
విషయాన్ని టివి కథల లాగా సాగదీయకుండా త్వరగానే ముగించారు . సంతోషం ...ఇంతకీ మొదటి సారి చర్చల్లో ఏం అంశాలు చర్చించారు? నాకు గుర్తులేదు మరి ... అసలంటూ విషయం ఏమన్నా ఉంటే కదా గుర్తుండటానికి ... అయినా అన్నలూ .. మీ కోపం అవినీతి అధికారుల మీదో , నాయకుల మీదో చూపించితే అందరికీ మంచిది . IPS ల మీదో, కానిస్టేబుళ్ళ మీదో చూపితే ఏమొస్తుంది? అన్ని నొప్పులకీ ఒకటే మందు - జిందా తిలిస్మాత్ లాగ - అన్నిటినీ చివరకు -ISI తో ముడి పెట్టడం... ISI అంటే ప్రతి పక్షం వాడు నోరెత్తడు కదా మరి ... పెజాస్వామ్యం లో పెజల గొడవ ఎవడికి పట్టింది? నాయకులకీ కాదు .. అన్నలకీ కాదు ... మరెవరికి? ముక్కోటి దేవతలకి :D
Posted by chava at 10:30 PM 2 comments
Saturday, January 15, 2005
Thursday, January 13, 2005
మంచితనం??
నేను మంచిగా ఉండాలి.... అందరూ నన్ను మంచి వాడు అనుకోవాలి ... ఫలానా పని చేస్తే నన్ను చెడ్డవాడిగా చూస్తారు ...ఈ ఆలోచన రాకుండా ఉండేది ఎవరికి? ఎందుకు మంచిగా ఉండాలి అన్న ఆలోచన రావాలి? మనలా ఉంటే మనకేం గుర్తింపు రాదనా? అన్ని సుగుణాలే ఉండాలి "నా" లో అనే కోరిక ఎక్కడ నుండి పుడుతుంది? ఎందుకు పుట్టాలి? దానికి కారణం మన చుట్టూ ఉన్న వాళ్ళా? చిన్నప్పటి నుండి ఇలాగే ఉండు , లేక పోతే చెడ్డవాడు అంటారు అని ఎవరో పదే పదే చెప్పడమా? పక్క వాడికి నొప్పి కలిగించకుండా మన పనేదో మనం చూసుకొంటే అది మంచిగా ఉండటం అవుతుందా? పక్క వాడి బాధ లో మనం పాలు పంచుకొంటే ఇంకాస్త మంచి వాళ్ళం అవుతామా? మనం మంచి అనిపించుకోడానికి ఎన్ని సార్లు కొన్ని మంచి పనులు చేయలేదు? చేసే ఉంటాం .
ఇంతకీ ఇప్పుడు నేను ఇదంతా మంచోడు అనిపించుకోడానికే రాస్తున్నానా? ఏమో...అవునేమో హి హి హి :D
Posted by chava at 8:32 PM 2 comments
Wednesday, January 12, 2005
" We get caught. How? Not by what we give, but by what we expect. We get misery in return for our love; not from the fact that we love, but from the fact that we want love in return. There is no misery where there is no want. Desire, want, is the father of all misery. Desires are bound by the laws of success and failure. Desires must bring misery. "
" We are all the time, from our childhood, trying to lay the blame upon something outside ourselves. We are always standing up to set right other people, and not ourselves. If we are miserable, we say, "Oh, the world is a devil's world." We curse others and say, "What infatuated fools!" But why should we be in such a world, if we really are so good? If this is a devil's world, we must be devils also; why else should we be here? "Oh, the people of the world are so selfish!" True enough; but why should we be found in that company, if we be better? Just think of that. "
-- Vivekananda
Vivek used to be my handle online :) now lets see how many of u know me by that name :D
Posted by chava at 9:59 PM 2 comments
Tuesday, January 11, 2005
ఎందుకు మనుషులంతా ఒకేలా ఆలోచించరు? పోని అందరు ఆలోచించడం మానేయరు? ప్రప్ంచం లో ఇన్ని బాధలు..ఆలోచిస్తే (???) అన్నిటికి ఒకటే కారణం...ఒకరి ఆలోచనలకి మరొకరి ఆలోచనలకి తేడా..నేను చెప్పే బాధ శారీరకం కాదు. నేను ఆ పని చేయలేకపోయానే అని ఒకరి బాధ. చేయగలను అనుకొంటే చేసేయాలి .చేయలేము అని తెలిసినప్పుడు ఇక ఆలోచించడం మానేయాలి . ఇంకొందరికి నచ్చిన వాళ్ళు మాట అన్నారనో,వదిలేసారనో బాధ .మాట అన్నవాడు ఆ మాట ఎందుకు అన్నాడో..వాడున్న పరిస్థితి లో అలా అనడం ఒప్పేమో.
ముందు "నా" "నన్ను" "నాది" (అప్పుడప్పుడు english అయితే సులభం అనిపిస్తుంది:)) అవి పోతే ఇవన్ని చాలా వరకు పోతాయేమో. కానీ ఇక్కడో చిక్కు ఉంది :D .అవి పోవాలంటే ఎవరిలో ఎక్కడ పోవాలి ? "నా" లో :) మరి నా అనేది పోతే ఇక అవి ఎక్కడ పోవాలి? పోని ఎక్కడైతే పోవాలనుకొంటున్నావో , అది తెలియాలంటే , "నా " అనేది ఉండాలి ..మరి పోయేదెట్టా? ఎప్పటికి? :D ఇట్టా ఉంటుంది అడ్డ దిడ్డంగా అర్ధం అయీ కాకుండా :)
Posted by chava at 1:52 PM 3 comments
Monday, January 10, 2005
furl లో account open చేసా .. ఎప్పుడో చేయాల్సింది ...పనికొచ్చే పని చేయరా అని తాత చెప్పింది ఎప్పుడు విన్నాం గనుక :) పెద్ద స్వామిని వదిలిరి ..చిన్న స్వామిని పడితిరి ...ఇదేదో కత్తి పోయె పిల్ల వచ్చె డాం డాం డాం లా భలెగుంది :) .. డాక్టరు గారు పల్లెల్ని పట్టణాలు చేయడం అయిపోయి , పట్టణాలని నగరాల వైపు పరుగులు తీయించే పనిలో పడ్డారు .. చర్చలు సంతకెళ్ళాయి....త్వరలోనే శుభం కార్డు పడేలా ఉంది కథకి .
ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ !
అయ్యా అది సంగతి :)
Posted by chava at 9:38 PM 3 comments
Sunday, January 09, 2005
saakshi
"ఏది యెటులున్నను బ్రదుకవలయునను పామరత్వము తక్క మీకేమియు లేదు.బ్రదుకవలయును.బ్రదుకవలయును. ఎల్లకాలము బ్రదుకవలయును. ఎవరు చచ్చినను సరే నీవు మాత్రము బ్రదుకవలయును. ఎంతసేపు - నీ సుఖమే - నీ మేలు - నీ లాభము, కాని నీకు వేరొక్క చింతయే లేదు. నీవు చత్తువని యెరుఁగుదువు. కానీ యా మాట మఱచిపోవుదువు. వార్దకదేవత నీ వెన్నుపామువిరుఁగఁగొట్టి - నిన్నుఁదిర్యగ్గమనుని చేసినను,మృ తి సమీపించుచున్నది కదాయను మాటనైన మన్సునఁజేరనీయక - కర్ర చేతఁబుచ్చుకొని - యెంగిలి మెదుకులు దినుచున్న పిల్లిని గొట్టఁబోవుదువు. వార్దక దేవత నీ యెదుటఁబది మూఁతిమీఁదన్ని పండ్లు రాలఁగొట్టినను మరణ సన్నద్దుఁడవైయున్డక, యవసానమున మాటనైన నంతరగమునఁజేరనీయక, మఱులఁబండ్లు కట్టించుకొని - యిదివఱకు బ్రతికిన సిగ్గుమాలిన - పనికి మాలిన - మొండి మోటబ్రదకు - తిరిగి బ్రదుక దలఁచుకొందువు"
హి హి హి :)
Posted by chava at 1:12 AM 2 comments
Friday, January 07, 2005
మళ్లీ పని ...మధ్యలో మీటింగ్ . and that was refreshing :) had good laughs .. బయటికి వచ్చే సరికి మంచు దూది లా పడుతుంది ...మంచు రాత్రి పూట పడుతుంటే పగలు లా ఉంటుంది ..వచ్చి వేడి గా చాయ్ తాగి ...కాసేపు వార్తలు చదివి ...తినేసి ముసుగెట్టేసాం:)
Posted by chava at 10:16 PM 0 comments
Thursday, January 06, 2005
పని పని పని.... రోజంతా పని ....మళ్లి బయట snow. దేశంలో అది లేకపోవడం మంచిదయింది .ఇళ్లు లేని వాళ్లు ఏమయేవాళ్లు? ఏమో ...
Posted by chava at 9:48 PM 0 comments
Wednesday, January 05, 2005
పొద్దున్నే నెత్తిన పిడుగు :) వారంలో fix చేస్తే చేయి లేక పోతే వెనక్కి తీసుకో అని ...గురువు గారు అటూ ఇటూ పరుగులు తీసి ,చివరికో పనికి మాలిన design నా నెత్తిన రుద్ది , నీ ఇష్టం వచ్చినట్టు చేయి , అది పని చేయాలి అని చెప్పి పోయాడు .మనం కూడా చెప్పాల్సింది చెప్పి , చిలక్కి చెప్పినట్టు :), వినడని తెలిసి కూడా, తేడావస్తే నాదే బాధ్యత అని గురువు గారి మాట తీసుకొని పని దాదాపుగా పూర్తి చేసా. రేపొద్దున K కి అర్ధం గాక జుత్తు పీక్కుంటాడేమో :(
గూండా కాసేపు చూసి , చూసిన దాంట్లో సగం పైగా ముందే ఊహించి , ఇంకా ఊహించి కోదండరామున్ని చిన్నబుచ్చలేక ఆపేసా. నిన్నటి raincoat కి మూలం "The Gift of Magi" అని తీరిగ్గా ఇవాళ గుర్తొచ్చింది . లాభం లేదు... మళ్లోపాలి ఎన్రీ కతలు సదవాల్సిందే ..ఈ ఈకెండు గ్రంతాలయానికెళ్లాల్సిందే...
Posted by chava at 10:39 PM 4 comments
Tuesday, January 04, 2005
గొర్రెకి వచ్చిన లోటేంటంట ???? :P
గొర్రెలా బతికితే సరిపోయే :) ఇప్పుడు మాత్రం బతుకుతుంది గొర్రెలా కాక ఎలా?? ప్రతి విషయంలో ఎవడో ఏదో చెప్తాడు . ఆ పలానా పని ఆ పద్దతిలో మాత్రమే చేయాలి అని . మనిషి అయినందుకు ఆలోచించాలి అనే విషయం తో సహా :) . ఆ లెక్కన చూస్తే గొర్రె చాలా నయం అనిపిస్తుంది. ఎంచేతంటే అది ఆ విషయంలో కూడా ఎవరి మాటా విననక్కర్లేదు కాబట్టి. వస్తా వస్తా అంటున్న V నిన్న దిగాడు. కాసేపు కష్టపడి ఏదో వాగించాడు :) చివరికి తేల్చింది అంతా ఉత్త మాటలేనని .కాసేపు bestbuy వాడి కష్టాలు చూసి , నవ్వుకొని , తిట్టుకొని , అటు ఇటు తిరిగి వాడికి కావలిసింది తెచ్చుకొని మళ్లీ దారి పట్టాడు,ఈ సారి నేను అటు వస్తానని నాదగ్గర మాట తీసుకొని. నిన్న ఆడిటింగ్ పనిలో అలసట .రోజు మధ్యాహ్నం ఆడెట్టిన గడ్డి తిని , ఆ పని చేస్తే gym కే పోనక్కర్లేదు అన్నాడు E :) .
Posted by chava at 8:44 PM 4 comments
Saturday, January 01, 2005
రాను రాను నాకు మనుషులతో మాట్లాడాలంటే కష్టం గా ఉంటుంది. ఎదుటి వాడు ఏం మాట్లాడినా ఆసక్తి లేకుండా పోతుంది. ముఖ్యం గా తెలిసిన విషయం అయితే . అవతలి వాడు వాడికి తెలుసు అన్నది మనతో చెప్పాలి అనుకోవడం స్పష్టం గా అర్ధమయితే ఇంకా చిరాకు . ప్రపంచం లో ఇద్దరి మధ్య సంభాషణ ఒకరి నొకరు ఒక విషయం లో ఒప్పించడానికి జరిగే వాదన . ఇది నిజమేమో చాలా సందర్భాలలో...
గొప్ప తెలుగు మనిషి ఎవరో ఓటు వేయాలట :) నాకు చాలామంది గొప్ప వాళ్లు తెలుసు . వాళ్లు నా వరకు నాకు గొప్ప . కాని ఆ గొప్పదనం మీ అందరికి గొప్ప కాక పోవచ్చు । అంతమాత్రానికి వాళ్ళు గొప్ప కాకుండా పోతారా? ఏంటో ఇట్టాంటి ఆలోచనలకి మూలం ఏంటో? పైన చెప్పిన "పక్క వాడికి " తెలియ జెప్పడం అయి ఉండాలి . ప్రతి విషయం లో వాదన. వాదించి గెలిచాం అన్న త్రుప్తి? ఇదేనా అందరు చెప్పే "నా" ? ఏమో అయినా అందరూ చెప్పేదాని గురించి ఆలోచన అనవసరం అనుకొన్నా కదా? :) ఇప్పటి వరకు ఎవడూ ఏమీ చెప్పలేదు. ఇక ముందు కూడా ఎవడు చెప్పడు. ఎంచేతంటే చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి:)
Posted by chava at 10:51 PM 1 comments
మరొక రోజు... కొత్త సంవత్సరం లోకి తెచ్చిన రోజు. పోయినేడాది "నాకేమీ తేడా లేదు.. ఏమీ చేయలేదు ఎప్పటిలా అదే time కి పడుకొన్నా అంటే ", ఎవరితో చెప్పకు... నవ్వుతారు అన్నాడొకడు... నవ్వడానికి ఏమ్ంది అందులో అని ఈసారి ౧౨ వరకు మేలుకొని చూసా... ఏమో నాకేమి తేడా లేదు.. ఆన్ంద్ సినెమా మళ్లోసారి చూసాం . ఈ సారి E తో కలిసి . ఇంక నిద్ర వస్తుంది. రేపు మిగతాది।
Posted by chava at 1:21 AM 1 comments