Wednesday, November 30, 2005

టూకీగా ....

గత పదిహేను రోజుల్లో ఎప్పటినుండో ఊహించిన రెండు విషయాలు జరిగాయి ---
ఒకటి లాలూ ఓటమి ...
రెండు నాయుడు గారు తెలుగు విధ్యార్ధి సంఘాన్ని పునః ప్రారంభించడం ..

Friday, November 18, 2005

టూకీగా ...

మొద్దు శీను ని పట్టుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కానేకాదు - అన్నారు హోం ..నూరు శాతం ఏకీభవిస్తున్నా ...అసలు శీను ని పట్టుకోక పోవడం వైఫల్యం అన్న మాటని ఖండిస్తున్నా ...శీను తన పేరు తో డ్రయివింగ్ లైసెన్సు తీసుకొని ఉంటే పోలీసులు తేలిగ్గా పట్టేసుకొని ఉందురు ..కానీ వేరెవరి పేరు మీదో తీసుకొన్నాడు ...అది రవాణా శాఖ వైఫల్యమే గానీ పోలీసులది కానేకాదు ... 3 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ...పోలీసు కేసులు ఉన్న వారికి ఖాతాలు తెరవనివ్వడం బ్యాంకు వారి తప్పు ..అదీగాక పోలీసులని అది తప్పుదోవ పట్టిస్తుంది ...ఎంచేతంటే పోలీసులు బ్యాంకులు అన్నీ సక్రమంగా ఉంటేనే ఖాతాదారులుగా చేర్చుకొంటాయి అనుకొంటారు ...కనుక అది బ్యాంకుల వైఫల్యం ... చెప్పుకొంటూ పోతే ఇలా చాలామంది వైఫల్యాలు ఉన్నాయి .. అందరి తప్పులని పోలీసుల మీద తోయడం ఏంటీ అర్దంలేకుండా?

Tuesday, November 15, 2005

టూకీగా ...

కుష్బూ మరీ అంత భయం భక్తీ లేకుండా మాట్లాడకుండా ఉండాల్సింది ..ఓ అనసూయ ఓ సావిత్రి ఓ ఇంకో లెక్కలేనన్ని పతివ్రతలలో ఒకరు పుట్టిన గడ్డపై పుట్టి అలా మాట్లాడటం ఏంటి చండాలంగా కాకపోతే? అంతగా కావాలంటే తనకి చేతనైంనంతలో "చూపించాలి " గానీ ఇలా వేదిక లెక్కి మాటాడితే కుదరదు ..చూపించితే అందరూ చీకట్లో చొంగ కారుస్తూ చూస్తారు డబ్బులిచ్చి మరీ..గుడి కట్టించి మరీ దణ్ణాలు పెడతారు ..అదే ఒక మంత్రి వర్యులు , వయస్సులో పెద్దాయన , పిల్లలకి కండోమ్స్ పంచాలి అంటే , నవ్వి ఊరుకొన్నారు ..ఎంచేతంటే ఈ పుణ్య పవిత్ర భూమి లో కొన్ని విషయాలు మగవారు మాత్రం మాట్లాడటానికి వీలుంది ..పతివ్రతలు అయినా కాకపోయినా ఆడవారు మాట్లాడటానికి వీలు లేదు ...మన లెవిలు ఏంటో తెలుసుకొని పనిలోకి దిగమన్నారు అందుకే ..ఆ అన్నది ఎవరు అని అడక్కమ్మా మళ్లీ ..అదిగో తెలివి మీరి ప్రశ్నలు అడుగుతుంది అది తప్పు అంటారు ..పిచ్చిమాలోకం లా ఎన్ని సినిమాలలో పెళ్లి కాకుండా తల్లి కాలేదు నువ్వు నీ సహ నటులు ...అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చూసి విజయవంతం చేసారు కదా ..అదే విషయం చెప్తే తప్పేముంది అనుకొని ఉంటావు నువ్వు ..సినిమాలోలా లేడీ రౌడీ లా ఇక్కడ కూడా చెలామణి అవుతుంది అనుకొంటే అది పొరపాటు ..ఎంచేతంటే పతివ్రతలు పుట్టిన దేశం కాబట్టి ..దానికి తోడు ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఎందుకు పాటించాలో తెలియక పోయినా పాటించాలి కాబట్టి ..ఇప్పటికైన బుద్దిగా మసలుకో ...

Sunday, November 13, 2005

టూకీగా ..

"కొల్లాయి కట్టితేనేమి , కోమటై పుట్టితేనేమీ"
"భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ , ఒక దళిత కుటుంబానికి చెందిన వాడయినప్పటికి ..."
" భారత రాష్ట్రపతి పదవి నలంకరించిన మొదటి దళితుడు కె ఆర్ నారాయణన్ "
ఇలా ఇంకా ఎన్నాళ్లు కులాలని ప్రస్తావిస్తూ రాస్తూ పోతారు?

Monday, November 07, 2005

టూకీగా ..

ఒకావిడ స్వర్ణోత్సవాలలో ఒక్క స్త్రీని కూడా ప్రస్తావించలేదు అని విరుచుకు పడింది ..ఒకాయనేమో 50 సంవత్సరాలలో బలహీన వర్గాల నుండి ఒక్కరిని కూడా ముఖ్యమంత్రిని కానీయలేదు అని వాపోయాడు ...మరొకరేమో మైనారిటీలని ఇంకా ఎంతకాలం అణగదొక్కుతారు అని ఘర్జించాడు ...చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి ...అందరూ మాది పెద్ద సమస్య అంటే మాది పెద్ద సమస్య అని గగ్గోలు పెడుతున్నారు ..మరి సమస్య లేకుండా ఉంది ఎవరు? అధికారంలో ఉన్నవాడికీ ,లేని వాడికి కూడా సమస్యల మయం రోజంతా ..ఎందుకు ఎవడో వచ్చి మాకేదో చేయాలి అని ఎదురు చూడటం ..యాభై ఏళ్లలో ఇది కూడా తెలుసుకోలేక పోయారా?

Sunday, November 06, 2005

టూకీగా ...

కొన్నాళ్ల క్రితం సింగుగారు మాడం గారిని కలిసారు అని చదివే వాళ్లం ...ఈ మధ్య ఇరాక్ ఆయిలు కుంభకోణం పుణ్యమా అని మాడం గారు సింగు గారిని కలుస్తున్నారని చదువుతున్నాం ...సెహభాస్ సింగు గారూ...

Thursday, November 03, 2005

టూకీగా ...

నట్వర్ సింఘ్ కాంగ్రెస్సు మీద అలిగి ( తనని "గట్టిగా" సమర్ధించలేదని ) రాజీనామా చేయడం , "మొగుడు కొట్టినందుకు కాదు ..ఆడపడచు నవ్వినందుకు" అన్నట్లుంది ...