Thursday, January 20, 2005

ప్రపంచంలో ఉన్నది ప్రేమా? భయమా? ప్రేమించాలి అని అనుకొనేవాడికి ప్రేమించబడాలి అనే కోరిక ఉంటుందా? ఉండదా? ఉంటుంది చాలా శాతం...ఆ కోరిక లేని వాడికి ప్రేమని పొందలేదు అనే బాధ ఉండదు . అలాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కడ చదివినా relationhip failure అని ఒకటే బాధ జనాలలో.. కారణం ? ఎంతసేపు అవతలి వాడిదే తప్పు అని ఒకటే సొద. అసలు ఈ conditional ప్రేమ concept ఏందో? నీకు నచ్చినట్టు ఎదుటి వాడు ఉండాలను కోవడం ప్రేమ ఎలా అవుతుంది? స్వార్ధం అవుతుంది. అంటే ప్రేమ, స్వార్ధం రెండూ ఒకటేనా? ఈ స్వార్ధం ఉందే ఇది ఆనందం తో కూడా కలిసి ఉండటం చాల చిత్రంగా ఉంటుంది.. దేవుడా నా ఈ ఆనందాన్ని ఇలానే ఉంచు అని కోరుకోడం స్వార్ధం తో కూడుకొన్నదే కదా? ఇంకో రకమయిన బాధ నేను ఫలానా పని చేయలేక పోయానే అని ... ఒక పని చేయాలి అని అనుకొన్నావా చేసేయి ... చేయాలని ఉన్నా చేయలేవని తెలిస్తే ఇక ఆ విషయం మర్చిపో .. అలా కాకుండా అయ్యో నేను చేయాలి , చేయలేదు , చేయలేక పోతున్నా అని ఊరికే ఎందుకు సొద? and this one is for pinkos aka whiners ..dont always blame govt for not helping u ... learn something from guys like Ramachandra Rao .. if possible let u r followers practice it ...

1 comment:

oremuna said...

లవ్ లో ఏమన్నా ప్రోబ్లమా? లేక ఇంటిలో ప్రోబ్లమా?

నాక్కూడా అర్దము కాదు, జనాలు ఎందుకు గవర్నమెంటు, గవర్నమెంటు అంటారో ప్రతిదానికి, మొన్నీమధ్య ఒక తెలుగు ఘోష్టి కి వెల్లినాను॥ వేమూరి గారు మాట్లాడినారు, బాగుంది, తరువాత నెమ్మదిగా తెలుగు బాషకి గవర్నమెంటు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని మొదలుపెట్టినారు, మొత్తము తెలుగులోనే జరగాలి ॥॥॥॥।హా ఇంకా చాలా జరిగినది, గవర్నమెంటు ఏమి చెయ్యగలదు? ఒక జీవో పాస్ చేసినంత మాత్రాన అమలైపోతుందా?

అదే ప్రజలు తెలుగులో అయితే తప్ప మేము వకాల్తాలు తీసుకోము, రిజిష్ట్రషన్లు చేయించము, పన్నులు కట్టము అంటే జరగక చస్తుందా?

సో గవర్నమెంటుదేమీ లేదు మంచి చేసే విషయములో :-)

అంతా మన చేతిలోనే , మన తెలుగు బ్లాగులు చూడండి ఎంత చక్కగా రాసుకుంటున్నామో గవర్నమెంటు ఏమీ చెయ్యకుండానే

సోది