ఒక సమస్య సాధించడానికి ఎన్ని ఆలోచనలు చేయాలి? అదీ నాయకులుగా ఉన్నప్పుడు? ఒక వ్యక్తి కి సంబంధించిన విషయం అయితే పర్యవసానం పరిమితం గా ఉండొచ్చు ...కాని సమస్య రాష్ట్రం మొత్తానిది అయినప్పుడు , కొందరి నిర్ణయాలు అందరికీ ఇబ్బంది. హడావిడిగా చర్చలు అని మొదలెడితివి ...ఎవడేం మాట్లాడుతున్నాడో పక్కనోడి కి అర్ధం కాకుండా అందరూ మాట్లాడితిరి.అసలు సమస్య పక్కన పెట్టి ఆయుధాలు వదలాలని ఒకరు, వదలం అని ఒకరు బిగదీసుకొంటిరి.సందట్లో సడెమియా లా అన్నలు బలం పెంచుకొంటిరి. అధికారంలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగిన సుకుమారుడు దిగగానే వాళ్ళు మరీ అంత చెడ్డవాళ్ళు కాదు అని ప్రశంసాపత్రం అడకకుండానే ఇస్తిడి . ఇప్పుడు గద్దెనెక్కిన స్వరణ్జీతుడేమో వచ్చీ రాగానే గుండు పేల్చుకొంటూ వచ్చె ...అసలు ఏం చేయాలో , ఎలా చేయాలో ఎవరికీ తెలిసినట్టు లేదు . మీకే కాదు ... మీ ప్రత్యర్ధి కి కూడా... బస్సులేం అన్యాయం చేసాయో ...కోపం వచ్చిన ప్రతొక్కడు అవి తగలేస్తాడు. మాలో చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన మేధావులు ఉన్నారు అని గొప్పలైతే చెప్పారు అన్నలు . ఆ పెద్దలిచ్చిన సలహాయేనా ఈ తగలేయడాలు? బందులు? తిప్పి కొడితే 900 మంది లేరట .. నిజంగా అంత కష్టమైన పనా వాళ్లని అడ్డు తొలగించికోవడం? అయ్యి ఉండదు ... వేరే చాలా కారణాలు ఉండి ఉండాలి ..అవేమిటో అర్ధం అయీ కాకుండా ఉన్నాయి మరి ...ఈ గొడవ ఆగక ముందే మానవ హక్కుల వాళ్ళు తయారవుతారు .అరుపులు కేకలతో ... పోలీసులు , అమాయక జనం పోయినప్పుడు ఎక్కడ దాక్కుంటారో వీళ్లు? వోటు విలువ తెలుసుకొనే వరకు ఇంతే ....
Wednesday, January 19, 2005
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చర్చలు మొదలు పెట్టినప్పుడు నక్షలైట్లు కూడా ఒక పార్టీ పెట్టుకోని జన జీవన స్రవంతి లో కలిసి కొట్టుకుంటారు అనుకున్నాము
కాకపోతే ఆయుధాలతో తిరగనివ్వడమే అసలు మన రెడ్డిగారు చేసిన తప్పు, గట్టిగా పట్టుబడితే చచ్చినట్లు ఒప్పుకునేవారు కదా
పట్టుబడ్డ ఆయుధాలు చూసినారా? లాప్టాపులూ, అధునాతన ఆయుధాలు, కనుక మన స్వర్ణజిత్తుగారి తప్పేమీ లేదు గుండు పేలుస్తూ వచ్చినాడు, ఇంకా పేల్చాలి అని ఆశిస్తున్నాను
బస్సులు నిజంగా సీరియస్ ఇస్యూ, మన ఆర్టీసి వాళ్ళు అర్జంటుగా గట్టి చర్యలు తీసుకోవాలి:
చర్య ఒకటి: అర్జంటుగా ఎన్ని బస్సులు, ఎంత డబ్బులు తగలబడ్డాయో లెక్కేసి నక్షలటు సర్ చార్జీ అని విధించాలి, డీజిలు ధరలు పెరిగినప్పుడు విధించగా లేనిది ఇప్పుడు విధించలేమా?
చర్య రెండు: అర్జమ్టుగా ఆర్టీసి వాళ్ళు బస్సుకి ఒక్కరోజు చొప్పున బందు నిర్వహించి, ఆ నష్టాన్ని కూడా సర్ చార్జీ గా విధించాలి
మేదావులా? నా బొంద! అంతా గబ్బు నాయాళ్ళు, మేతావులు, డబ్బావులు కొడుకులు చదివేదేమో అమెరికాల్లొ వీళ్ళేమో గడ్డాలు పెంచుకోని పాటలు
౯౦౦ మందే కాని తిప్పికొట్టాడమే కొంచెం కష్టం
నాకు మనసులో ఏ మూలనో ఒక అనుమానం, మన కాంగ్రేసు గెలవడానికి అన్నలేమన్నా సహాయంచేసినారా అని?
ఎవరి బాదలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి
Post a Comment