Monday, January 31, 2005

బాల్యం

గతం, ముఖ్యంగా బాల్యం మళ్లీ వస్తే ఎంత బావుండు ! అని చాలామంది , నాతో సహా అనుకొంటారు. ఎందుకని? బాల్యంలో మనకి కష్టాలు తెలియవు . బాల్యం తరువాత బడి కి పోతాం. అక్కడ మనపని చదువుకోడం.అదొక్కటే మనం చేసేది .మిగతా కష్టాలు అన్ని పెద్దలకి వదిలేస్తాం.చదువు ,ఆటలు , స్నేహితులు , భవిష్యత్తు గురించి భయం అనేది లేకుండా గడిపేస్తాం..పెరుగుతున్నా కొద్ది మనకి సమస్యలు(?) ..రేపు ఎలా ఉంటుందో తెలియదు.మనకి తెలియకుండానే మనలో background process run అవుతూ ఉంటుందేమో..ఏమవుతుందో అని .దానికి తోడు మనమీద మన పెద్దవాళ్ల ఆశలు . మనకి ఏది ఇష్టమో , మనం ఏం చేయాలో అన్నిటికి వాళ్ల ఇష్టాయిష్టాలు తోడవుతాయి. ప్రతి పనికి ఆలోచన . ఏది మంచో ఏది కాదో అన్న ఆలోచన. తప్పు చేస్తామేమో అన్న భయం.. అన్నిటికన్న ముఖ్యంగా రేపు ఏమవుతుందో అని తెలియని సందేహాలు ..గతంలో కూడా సమస్య లు వచ్చి ఉంటాయి ..కాని వాటిని మనం తెలివిగా సాధించి ఉంటాం..తెలిసిన సమస్య కి తెలిసిన పరిష్కారం ఉంటుంది..మరి తెలియని ,రాబోయే సమస్యకి? ఈ ప్రశ్న ఎప్పుడూ మనకి తెలియకుండా మనలో ఉంటుందేమో..అందుకే ఎప్పుడూ గడిచిన కాలం మనకి ఇష్టం అయి ఉంటుందేమో?

పై విషయానికి సంబంధం లేనిది... ఎక్కడో ఇవాళ చదివా ..ఎవరిదో ఒక బ్లాగు design ఎవరో copy చేసారని పెద్ద రగడ. చేస్తే వచ్చిన నష్టం? తనకి రావాల్సిన పేరు పక్క వాడు కొట్టేసాడనా? అసలు ఏది original అని? అన్నిటికి మూలం ఎక్కడో వేరే చోట ఉంటుంది కదా? ఆ మూలాన్ని copy చేయంది ఎవరు? ఏమో ..మనుషులు పెరిగినంతగా మన ఆలోచనా పరిధి పెరగడం లేదా?

No comments: