Sunday, May 15, 2005

గాంధీ

అందరికీ ఒకేసారి గాంధీ గుర్తొచ్చాడు ...కాకపోతే గాంధీ చెప్పిన విషయాలు గుర్తు రావాల్సిన సమయంలో మాత్రం రావు ...ఒకరిని ఒకరు తిట్టుకోడానికి గాంధి సాక్ష్యం కావాల్సి వచ్చింది ...ఒకరేమో నిజం చెప్పించు అని , మరొకరేమో హింస ఆపించు అని మాటలు రాని చేతలుడిగిన గాంధి బొమ్మకి మొరపెట్టుకొన్నారు ..అది కూడా పక్కనోడు మారాలని ..తప్పితే మనం మారుదాం గాంధి చెప్పిన బాట లోకి అని అనుకోలేదు ..కనీసం వారికి బాగా అలవాటయిన జనాన్ని నమ్మించడం అనే కళ లో కనీసం ఆ దిశ లో ప్రయత్నం కూడా చేయలేదు ..
అయినా జనానికి బుద్ది లేదు ...దేనికి పడితే దానికి ఎగేసుకొని బయలు దేరడం దేనికో? నామినేషన్ కి , విజయోత్సవ సభలకి అంతలేసి మంది పోకపోతే వచ్చిన నష్టం ఏమిటో? నామినేషన్ వేసిన వాడు ఓట్లు అడుక్కొంటూ రేపెలాగూ మన ఇంటికి వస్తాడు కదా ..అప్పుడు రద్దీ లేకుండా తీరిగ్గా చూసుకోవచ్చు కదా? విజయోత్సవ సభ ఎలాగూ పేపర్లలో , TV లలో చూసి తరించొచ్చు కదా? ఏం జనమో ఏమో ...

1 comment:

oremuna said...

అవసరం బాబూ అవసరం! రేపేమన్నా అవసరం వస్తే ఈ రాజుఅకీయనాయకులు ఆదుకుంటారు అని వెళ్తారు (బహుశా)

లేదా అభిమానం, సానుభూతి (నేను ఉన్నా వెళ్ళేవాడినేమో)

ఈ పోలీసులైనా ఇంకొంచెం ప్రణాళికాబద్దంగా వ్యవహరించ వచ్చు కదా!