Sunday, May 22, 2005

తిండి -సంపాదన

పాఠక్ నిన్న అంటున్నాడు " అన్నా , మనం మొదట తిండి కోసం అని పైసలు సంపాయించడం మొదలెడతాం ..పైసలు ఎక్కువ సంపాయిస్తున్న కొద్దీ తిండి తినడం తగ్గిపోతుంది ..దాని గురించి పట్టించుకొనే సమయం కూడా ఉండదు ఒకోసారి " అని ..ఎంత నిజం :) వాడిది రోజుకి 24 గంటలూ పని చేయాల్సిన ఉద్యోగం మరి ..ఇంకో నిజం ..బరువు తగ్గడానికి తక్కువ కాలేరీలు ,తక్కువ కార్బోహైడ్రేట్ లు ఉండే వస్తువుల ధర ఎక్కువ :D

Sunday, May 15, 2005

గాంధీ

అందరికీ ఒకేసారి గాంధీ గుర్తొచ్చాడు ...కాకపోతే గాంధీ చెప్పిన విషయాలు గుర్తు రావాల్సిన సమయంలో మాత్రం రావు ...ఒకరిని ఒకరు తిట్టుకోడానికి గాంధి సాక్ష్యం కావాల్సి వచ్చింది ...ఒకరేమో నిజం చెప్పించు అని , మరొకరేమో హింస ఆపించు అని మాటలు రాని చేతలుడిగిన గాంధి బొమ్మకి మొరపెట్టుకొన్నారు ..అది కూడా పక్కనోడు మారాలని ..తప్పితే మనం మారుదాం గాంధి చెప్పిన బాట లోకి అని అనుకోలేదు ..కనీసం వారికి బాగా అలవాటయిన జనాన్ని నమ్మించడం అనే కళ లో కనీసం ఆ దిశ లో ప్రయత్నం కూడా చేయలేదు ..
అయినా జనానికి బుద్ది లేదు ...దేనికి పడితే దానికి ఎగేసుకొని బయలు దేరడం దేనికో? నామినేషన్ కి , విజయోత్సవ సభలకి అంతలేసి మంది పోకపోతే వచ్చిన నష్టం ఏమిటో? నామినేషన్ వేసిన వాడు ఓట్లు అడుక్కొంటూ రేపెలాగూ మన ఇంటికి వస్తాడు కదా ..అప్పుడు రద్దీ లేకుండా తీరిగ్గా చూసుకోవచ్చు కదా? విజయోత్సవ సభ ఎలాగూ పేపర్లలో , TV లలో చూసి తరించొచ్చు కదా? ఏం జనమో ఏమో ...

Sunday, May 01, 2005

పరీక్షా ఫలితాలు

ఇది పరీక్షా ఫలితాల సమయం...నేను పేపర్ లో ఆత్మహత్యల వార్తల కోసం వెతుకుతున్నా :( ...అనుకొన్నట్టుగానే ఇవాళ కనపడింది ...ఆరుగురు ప్రయత్నించారని :( ఆ తరువాత పైన రాంకులు వచ్చిన వాళ్ల వివరాలు , మార్కులు చూసా ..కళ్లు చెదిరే అద్భుత ప్రతిభ ? ఎలా వస్తున్నాయి నూటికి నూరు ? అది కూడా ఇంగ్లీషు , తెలుగు ( పేరుకు సంస్కృతం అయినా రాసేది తెలుగేగా) లలో? మా అప్పుడు మాకు పాఠాలు చెప్పింది కూడా అదే పంతుళ్లు కదా? అవే పాఠాలు కదా? మాకు అర్ధం కానివి ఇప్పటి పిల్లలకి అర్ధం అవుతున్నాయా? లేక పరీక్ష ఎలా రాయాలో మాకన్నా బాగా తెలుసుకొన్నారా?