Monday, January 24, 2005

సత్యమేవ జయతే?

ఒకోసారి మనకి తెలుసు ఖచ్చితంగా అనుకొన్నవి తప్పులు అయి ఉండవచ్చు . పరిటాల గురించి నాకు చాల తక్కువ అభిప్రాయం ఉండేది .కాని గత ఎన్నికల ముందు పరిటాల ముఖాముఖి చూసా.అందులో అతను చెప్పినవి విన్నప్పుడు , అతనున్న పరిస్థితిలో ఎవరైనా అలానే స్పందిస్తారు అనిపించింది. కాకపోతే చాలా మంది ఆ స్పందనని తన మనసులో దాచుకొంటారు . అతను మనసులో అనుకొన్నది చేతల్లో చేసాడు. అది తప్పు అని అతనికీ తెలుసు .తప్పు అని తెలిసీ చేయక తప్పలేదు అని చెప్పాడు. చేసేది తప్పు అని తెలిసినా ఒప్పుకొనే ధైర్యం ఎందరికి ఉంటుంది? అది పరిటాల లో ఉంది . ఆ కారణం చేత మెచ్చు కోవచ్చు అతనిని అనిపించింది . అయితే మాత్రం చంపుతాడా ఎదుటి వాడిని అంటారు . మొన్న ధనుంజయ్ కి ఉరిశిక్ష విషయం లో అతనిని ఉరి తీయాల్సిందే అని గొంతు చించుకొని అరిచిన వాళ్ళే పరిటాల అదే తప్పు చేసిన వాడిన వాడికి , అదే శిక్ష వేసినప్పుడు , తప్పు అని అరవడం ఎంతవరకు సమంజసం? అయినా ఏది సత్యం అనేది ఎవడు చెప్పాడు? నేను చెప్పేది నీకు నచ్చితే , నీకు ఉపయోగకరం అయితే , అది సత్యం అని నీ నమ్మకం. నచ్చలేదూ అది నీవు నమ్మలేదూ ... నీ వరకు అది అసత్యం...కాబట్టి సత్యాసత్యాలని పక్కన పెట్టు కాసేపు ... ఇవాళ పరిటాల అంతం అయాడు అనగానే కొందరు ... అమ్మయ్యా పీడా పోయింది అంటున్నారు ... కాని పరిటాలని మించిన వాడు ఇంకొకడు ఖచ్చితంగా వస్తాడు. చరిత్ర తవ్వడం మనకి పుట్టుకతో వచ్చించే కదా .. అనుమానం ఉంటే తవ్వి చూసుకో ...అతని అంతం కొందరికి ఇవాళ సంతోషం కావొచ్చు .. కాని అది కొందరికి జీవితాంతం బాధ , ఇంకొందరికి పగ .. అసలు పరిటాల తయారీ కి కారణాలు పరిశీలించి , అవి తిరిగి ఇంకా కొందరు పరిటాలలని తయారు చేయకుండా జాగ్రత్త పడితే అది సంతోషించాల్సిన విషయం. అది జరగాలంటే మరో పోరాటం అవసరమేమో అనిపిస్తుంది. ఎంచేతంటే ....

అరుణ్ గావ్లీ పోటీ చేసిన నియోజక వర్గం లో ఒక సాధారుణ పౌరుడిని కదిలిస్తే అతని స్పందన " అరుణ్ ఇలా MLA పదవి కి పోటీ చేయడం నాకేమీ నచ్చలేదు ..అతని స్థాయికి అతను డిల్లీ లో పార్లమెంటు లో ఉండాల్సిన వ్యక్తి " . అయిదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఒక రౌడీ గా పేరుమోసిన వ్యక్తి మీద , ప్రభుత్వం , అధికారుల మీద కన్న నమ్మకం ఎక్కువ ఉంది ఈ రోజు ప్రజలకి ."చాల్ ప్రజలు అతన్నిరోజూ అనేక సమస్యలతో కలుస్తారు .అతను తన మనుషులతో చెప్పి ఇక్కడి వారి సమస్యలు తీరుస్తాడు. అమ్మాయిల పెళ్లి కి పైసలు సహాయం చేస్తాడు . ఉచిత ఆంబులెన్సు సదుపాయం కల్పించాడు. నీళ్ల సరఫరా ఏర్పాటు చేసాడు . ఏ నాయకుడు చేసాడు మాకు ఈ మాత్రం సహాయం?" సాధారణ ప్రజలు మాత్రమే కాదు .." చనిపోయిన పోలీసు కుటుంబానికి క్రమం తప్పకుండా డబ్బు పంపే మొదటి వ్యక్తి అరుణ్ . మా క్వార్టరు రిపేరు ఉంటే , మా అధికారులు కాయితాలు అటు ఇటూ తిప్పుతూ కాలం గడుపుతారు.అరుణ్ ఆ కాయితాల పని అయ్యేలోపు రిపేరు చేయిచ్చేస్తాడు " - ఇది ఒక పోలీస్ అధికారి చెప్పిన విషయం..

అయ్యా అదీ సంగతి . తప్పు పరిటాలదా? పరిటాల లాంటి అవసరం కల్పిస్తున్న చుట్టూ ఉన్న మనలాంటి సమాజానిదా?

2 comments:

oremuna said...

నేను బాధ పడుతున్నాను
అవునూ మీరు పరిటాల గారిని ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు?

chava said...

నేను స్వయంగా కలుసుకోలేదు . విన్నా అతను చెప్పేది ...