Sunday, July 29, 2007

"పోరాడితే పోయేది?" - ప్రాణాలు

ప్రతీ వాడూ బషీర్ బాగ్ , నందిగ్రాం గురించి అడిగేవాడే .. అంతేతప్ప ప్రస్తుతం ప్రాణం పోయిన వారి గురించి ఆలోచించేదెవడు ? ఉద్యమం లో ప్రాణం ఎప్పుడూ పేద వాడిదే ఎందుకు పోతుంది? ముందుండి నడిపించేవాడు నాయకుడు అయి ఉంటే ముందు నాయకుడు కదా పోవాల్సింది ? మరో సారి ౠజువు చేసారు .. ఉద్యమం తప్ప లక్ష్యం ముఖ్యం కాదు అని .. ఇంతకీ సాధించింది ఏంటి? బషీర్ బాగ్ కాల్పులకి కరెంటు చార్జీలు తగ్గాయా? నందిగ్రాం కాల్పులకి టాటాల కర్మాగారం రాకుండా పోయిందా? పోయేదీ , పోతున్నదీ పేదవాడి ప్రాణం ... "పోరాడితే పోయేది సంకెళ్లు" కాదు ...ప్రాణాలు .. అవికూడా .. అమాయక ప్రజలవి ..

11 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

లెస్స పలికారు.

Kolluri Soma Sankar said...

మీతో ఏకీభవిస్తున్నాను
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com

Anonymous said...

ఇక్కడ వ్యాఖ్యలు వ్రాసిన వారికి గౌరవంతో...

పోరాడితేనే కదండీ మనకి స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీ, నెహ్రూలు పోకుండానే స్వాతంత్ర్యం వచ్చింది కదా. బోస్ లాంటి వాళ్ళు ప్రాణాలర్పించారు. స్వాతంత్ర్యసమరంలో చనిపోయినవాళ్ళలో పెద్ద పెద్ద నాయకుల కంటే సామాన్య ప్రజల సంఖ్య చాలా చాలా ఎక్కువ. పేదవాళ్ళు చనిపోవడాన్ని ఖండించండి. దయచేసి పోరాడటాన్ని తప్పుపట్టకండి.

శ్రవణ్

chava said...

గాంధీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి , ఎర్ర చొక్కాల పోరాటానికి తేడా లేదు అంటారా? ఎంత మంది కమ్యూనిస్టు నాయకులని , ప్రస్తుత శాసన సభలో ఉన్న వారిని,గాంధీతో పోలుస్తారు? గాంధీ రాళ్లు వేయమని , బస్సులు తగలబెట్టమని రెచ్చగొట్టడం నాకయితే తెలియదు .. ఒక్కసారి ప్రస్తుత నాయకుల ప్రసంగాలు విని పోల్చాలో లేదో మీరే నిర్ణయించుకోండి ..

Anonymous said...

చావా గారూ,

ఈ కాలం నాయకులు చాలా తెలివైన వారు. ఎక్కడా ఎప్పుడు ఉండాలో, ఉండకూడదో వారికి బాగా తెలుసు.

ఇక బషీర్ బాగ్ కాల్పులకు కరెంటు చార్జీలు తగ్గాయా అన్నారు చూడండి ఆ అభిప్రాయం మాత్రం తప్పండీ.

ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ స్క్రీన్ ప్లే తో చంద్ర బాబు నేతృత్వం లో ఆంధ్ర దేశం లో ప్రైవేటీకరణ పేరిట మొదలైన దోపిడీ "అభివృద్ధి" కి బషీర్ బాగ్ సంఘటనతో చాలా పెద్ద బ్రేక్ పడింది.

ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా బొలీవియా లో జరిగిన ప్రజా ఉద్యమం తరువాత అంత మహత్తరమైనది కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన

బషీర్ బాగ్ సంఘటన పరిణామాలు చాలా ఉన్నాయి. అప్పటి నుండే రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపుదల నిలిచిపోయింది (మీరిది గమనించారా ?)

అంతే కాదు ప్రభుత్వ రంగ సంస్థలైన TRANSCO, GENCO, ఆర్టీసీ, సింగరేణి ప్రైవేటీకరణ తాత్కాలికంగానయినా వాయిదా పడడానికి కామ్రేడ్ల పోరాటమే కారణం.

ఇప్పటి భూ పోరాటం కూడా చాలా ఉదాత్తమైన లక్ష్యం తో మొదలు పెట్టిందే. ఆ ఉద్యమం ఫలాలు తెలుగు దేశం అందుకోవాలని ప్రయత్నించడమే అసహ్యంగా ఉంది.

రవి వైజాసత్య said...

అవును ఉద్యమం చాలా గొప్పది బస్సులు తగులబెట్టి, పబ్లిక్ ఆస్థిని ధ్యంసం చేసి చంద్రబాబుకు, రాజశేఖరునికి బిల్లు పంపిస్తుంది. ఆ బిల్లును తమ సొంత అకౌంటులోనుండి కట్టలేక నడ్డివిరిగిందనుకోండి వాళ్లకి. ప్రతిసారి ధరలు తగ్గించాలి అనగానే అకస్మాత్తు సదరు వస్తువులు దేవుడు పైనుండి వర్షంలా కురిపిస్తాడు కాబట్టి వాటి ధరలు తగ్గుతాయి. ప్రభుత్వ బొక్కసంలో డబ్బు ఇలా జంతర్ మంతర్ అనగానే రెట్టింపవుతుంది. ఎందుకంటే డబ్బును అచ్చువేసేది ప్రభుత్వమే కదా!! (వాటే లాజిక్ వాటే లాజిక్)
(ఈ విమర్ష కామ్రేడ్స్ లాజిక్ మీదనే కానీ.. దిల్ గారి మీద కాదని గ్రహించాలి)

chava said...

కరెంటు చార్జీలు పెరగలేదు అప్పటి నుండి అన్నారు ...బానే ఉంది .. చేసిన ఉద్యమం పెరిగిన చార్జీలు తగ్గించమని ..అది జరిగిందా?
మీరు చెప్పిన మిగతా సంస్థల గురించి మాట్లాడే అవగాహన నాకు లేదు .. సింగరేణి గురించి మాత్రం మాట్లడ గలను ..అక్కడ పని చేసిన అనుభవం తో .. సింగరేణి లాభాల బాట పట్టడం దానిని ప్రయివేటీకరించక పోడానికి సంబంధం లేదు అంటారా? సింగరేణి లాభాల బాట పట్టడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కూడా కామ్రేడ్ల కౄషి కారణమా? సదరు కామ్రేడు నాయకులు మిగతా నాయకులతో ఏ మాత్రం తీసిపోరు లేని సమస్యని రాజకీయ పరం చేయడానికి ...సింగరేణి లో లాభాల ముందుకి , లాభాలు వచ్చిన సంవత్సరాలలో సమ్మెలని లెక్కించండి ... సమాధానం దొరకొచ్చు ..

Anonymous said...

రవి గారు
1) ఆందోళనలల్లో ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయడాన్ని ఎవరూ సమర్ధించరు. కానీ ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చకుండా కొద్ది మందికి మేలు చేకుర్చే పధకాల్ని మన ప్రభుత్వాలు ఆవిష్కరిస్తుంటే సగటు మనిషికి కడుపు మండి పోదా? కళ్ల ముందే ఇంత అన్యాయమైన రాజ్యం సాగుతుంటే ప్రజా ఉద్యమాలపై సెటైర్లు వేస్తే ఎలా? ఉద్యమాల్లో పాల్గొనే వారు తినే లాఠీ దెబ్బలు, ప్రాణాలు తీసే బులెట్ గాయాలను మరిచారా?

చావా గారు
2) ఉద్యమం చేయగానే దాని ఫలితాలు వెంటనే రావు. ఒక్కోసారి మొత్తంగా కూడా రావు 1857. లో ప్రధమ భారత స్వతంత్ర పోరాటం విఫలం అయ్యిందని మనవాళ్లు చేతులు ముడుచుకు కూర్చుంటే మనకు స్వతంత్రం (?) వచ్చేదా?

సింగరేణి లాభాలు కేవలం పెరిగిన బొగ్గు ధరలు, డిమాండ్ ల వల్లా, కొద్ది మంది అధికారుల, వేలాది మంది కార్మికుల రెక్కల కష్టం వల్లా. టాప్ మేనేజ్ మెంట్ సరిగా పనిచేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ లాభాల్లోనే ఉన్న విషయం మీరు కొంచెం పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ సంస్థలు ఉన్న మార్కెట్ అటువంటిది. అవి బంగారు గుడ్లు పెట్టే బాతులవంటివి. అందుకే ప్రపంచ బ్యాంక్ వాటి వెంట అంతలా పడుతున్నది. Look at the big picture. Don't get influenced by some false propaganda

కామ్రేడ్లు సింగరేణి లో సాధించేమిటో ఏ సింగరేణి కార్మికుడి ని అడిగినా చెబుతారు. ఇవ్వాళ సింగరేణి కార్మికులకు ఇస్తున్న సౌకర్యాలు అన్నీ కామ్రేడ్లు చేసిన పోరాటాల ఫలితమే. సమ్మెలని అంత తేలిగ్గా తీసెయ్యకండి. కార్మికులు చేసిన సమ్మెల వల్లనే దాదాపు బానిసల్లాంటి జీవితం నుండి కార్మికులు ఇవ్వాళ తలెత్తుకు తిరగ్గలుగుతున్నారు. అయితే వామపక్షాల నాయకుల్లో అవినీతిపరులు అస్సలు లేరని దీనర్ధం కాదు.


మిగతా వారితో పోలిస్తే on any given day they are better అనేదే నా అభిప్రాయం.

chava said...
This comment has been removed by the author.
chava said...

మూలానికి వెళ్తే సింగరేణి లో ప్రైవేటీకరణ ఆగిందనడమే తప్పు.అది తప్పో కాదో కనుక్కోండి. లాభాల్లో సదరు ప్రైవేటీ కరణ వాటా లెక్క చూసుకోండి :D
ఒక్కసారి కాదు చాలా సార్లు మాకొద్దీ సమ్మెలు,పోరాటాలు అని సగటు కార్మికుడు అనలేదు అనమనండి చూద్దాం? ఎందుకు అలా అనవల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
"వేలాది కార్మికుల రెక్కల కష్టం మీద" అనేది ఒక్కటే సరి అయింది ..కొందరు సమర్ధులయిన అధికారుల వలన కూడా కొంత వరకు సరి .. కాని నాయకుల పాత్ర ఏమీ లేదు అనేది నేను అంటున్నది ..వేలాది కార్మికులు అప్పుడూ కష్టం చేసారు .. ఇప్పుడూ కష్టం చేస్తున్నారు ..ఏ పనీ చేయకుండా నెల నెలా జీతాలు తీసుకొంటున్న 99 శాతం కార్మిక నాయకులు పడుతున్న కష్టం ఏంటి అనేది నా ప్రశ్న . అట్టడుగున పని చేస్తున్న కార్మికుడికి తన పని, దానికి కావల్సిన పనిముట్లు, పని జరగడానికి సరి అయిన పరిస్థితులు ఉన్నాయో లేవో, లేక పోతే వాటిని సమ్మె చేయకుండా ఎలా సంపాయించుకోవాలో తెలుసు. దానికి ఏ నాయకుడి సహాయం , ఉద్యమం అవసరం లేదు. ఏదో ఒక ఉద్యమం లేక పోతే తమకి ఉనికే లేదు అని చేసే రోజువారీ ఉద్యమాలు ప్రతి గనిలో ఎన్నో లెక్క చూడండి ..

తాజాగా సింగరేణి కార్మికులకి బోనస్ ఇచ్చారు . అది రాబోయే కార్మిక సంఘం ఎన్నికలని దౄష్టి లో పెట్టుకొని ఇచ్చాం అని మంత్రి గారు పత్రికా ముఖం గా తెలియజేసారు .తప్పో , ఒప్పో ఒప్పుకొన్నాడు ..సంతోషం ..మరి అదే విషయాన్ని గని ముందు కార్మిక నాయకులు ఏం చెప్తున్నారో ఒక్క సారి వినండి .ఒకప్పుడు పత్రికలు , టీవీ లు లేనప్పుడు వీరు చెప్పేవన్నీ నమ్మాల్సి వచ్చేది. ఇది తాజా ఉదాహరణ ..

రవి వైజాసత్య said...

పైన ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాలలో, ధరలు తగ్గించండి అని ప్రభుత్వాన్ని అడగటంలో పెద్ద లాజిక్ లేకపోయినా క్రామేడ్లు ప్రజల ఆస్థిని ధ్వంసం చేయకుండా, ప్రజలని చంపకుండా, దోపిడీలు చెయ్యకుండా, వ్యక్తుల మీద కాకుండా సమస్యల మీద ఎటువంటి ఉద్యమం లేవనెత్తినా కనీసం వాళ్ల నిజాయితీనైనా మెచ్చుకోవచ్చు (ప్రజలను చంపుతూ, ప్రజల ఆస్థినే ధ్వంసం చేస్తున్నపుడు ఇంకా ప్రజల కోసం చేస్తున్నారని ఏ విధంగా నమ్మమంటారు?) ఇంక రాజకీయులకు, కామ్రేడ్స్ కి తేడా ఏముంది. మాది ఎరుపంటారా?