Wednesday, July 11, 2007

అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు

2020 .. అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు ..2007 తానా సభల్లో చెప్పుకొన్నట్టు ..ఆ తెలుగువాడు మరొవరో కాదు .. C.B నాయ్డు .. అవును రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే CBN .. vision 2020 కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసిన CBN ...చేయడానికి పనేమీ లేక చిరాగ్గా ఉంది ...కరెంటు కష్టాలు లేవు..పోనీ జన్మ భూమి లాంటి ప్రజాదరణ పొందే పధకం మొదలెడదామా అంటే చెరువుల్లో పూడికే లేదు ...నీళ్లు పుష్కలంగా ఉన్నాయి .. రోడ్లేఇద్దామా అంటే ఆ అవసరమే లేదులా ఉంది .. పనికి ఆహార పధకం అవసరమే లేదు .. పోని సరదాగా రెడ్డి గారిని కవ్విద్దాం అంటే ఆయన ఇంకా ఆంధ్రా లోనే ఉండి ప్రోజెక్టుల మీద ప్రోజెక్టులు మొదలెడుతూ ( పూర్తి చేస్తారేమో అని జనం ఎదురు చూస్తూనే ఉన్నారనుకోండి ) బిజీ గా ఉన్నాడు .. ఏదో ఒకటి చేయాలి ..లేకపోతే రోజుకి పద్దెనిమిది గంటల వ్రతం చెడిపోయేలా ఉంది .. కానీ ఏం చేయాలో అర్ధం కావడం లేదు ...
ఏం చేస్తాడో ?

7 comments:

Anonymous said...

chala baaga chepparu.

Tana sabhallo CBN matalu: "clinton gaani india vaste prime minster ayipothadanta",

deenni baati chandrababu telivi telisipothundhi..

chava said...

నేను అది కూడా రాద్దామనుకొన్నా ..CBN కి తోచక అప్పటికి భారత ప్రధానిగా ఉన్న Bill తో ఫోన్ లో మాట్లాడే అంకం .. కాని నాకు అంత తీరిక లేక అప్పటితో ఆపేసా

leo said...

నేను ఐతే ఆలోచించకుండా క్లింటన్ కి ఓటు వేస్తా. ప్రధాని పదవికి తగ్గ హోదా వున్న రాజకీయ నాయకులు మనకి ఎవరు వున్నారు? సోనియా పాలన కన్నా క్లింటన్ బెట్టర్ ఎమో?

spandana said...

బాబు ఆమాటన్నది సరదాగా. అయినా సోనియాను ప్రధాని పదవికి ఎన్నుకోంగా లేంది క్లింటన్‌కి సాధ్యం కాదా అనుకుంటే?
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

తాడేపల్లి సుబ్రహ్మణ్యం గారు కూడా comment చేస్తే బాగుంటుంది.

---taadepalli fan

Naga said...

ఏ పీఠం మెక్కినా తెలుగువాడు ఏం లాభం జరిగింది?

Anonymous said...

మీ బ్లోగ్ చాలా బావుంది ఈ ఒక్క పోస్ట్ కాకుండా అన్ని చాలా చక్కగా వ్రాశారు. నేను ఈ మధ్య నే www.quillpad.in/telugu గురించి తెలుసుకున్నాను. తెలుగు లో వ్రాయడం మొదలు పెట్టాను.