Sunday, December 18, 2005

టూకీగా ...

"హలో ..ఎవరండీ మాట్లాడేదీ?"
"హలో ..నాపేరు దానయ్య అండీ...అనూ గారాండీ?"
"అవునండీ ..దానయ్య గారూ చెప్పండి ..మీ సమస్య ఏంటి?"
" మా అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడండి ..చాలా సన్నగా ఉంటాడండి ..వాడు లావు అవ్వడానికి మీ రత్నం వాడితే ఏమన్నా ఫలితం ఉంటుందా అండీ?"
" మీ అబ్బాయి జాతకం, వేలి ముద్రలు 250 రూపాయలు పంపండి ..మా ఆస్థాన జ్యోతిష్కులు పరిశీలించి ఏ రత్నం సరిపోతుందో చెప్తారు ..ఆ రత్నం ధరిస్తే మీవాడు లావు అవటంతో పాటు ఇతర సమస్యలు కూడా తీర్తాయి ..ఆరు నెలల్లో ఫలితాలు కనపడక పోతే మీ సొమ్ము వాపస్ ఇస్తాము ..మీరు గనుక ఆ రత్నం మా దగ్గరే కొంటే 250 కన్సెషన్ ఇస్తామండీ "
ప్రస్తుత తెలుగు చానెల్ లో ఓ ప్రోగ్రామ్ ...
తలా ఓ 250 చొప్పున ప్రభుత్వమే అందరికీ ఓ రత్నం ఇప్పిస్తే సమస్యలే లేని సమాజం అవుతుంది కాబట్టి ఆ పని చేస్తే పోలా..ముందుగా మన నాయకులకి ఇప్పిస్తే మరీ మంచిది ...

2 comments:

oremuna said...

మీరు మన నాయకులను సరిగ్గా చూసినట్లు లేరు

ముఖ్యంగా వారి వేళ్ళను

chava said...

నేను అవన్నీ పెజల సమస్యలు అడగడానికి తీసుకొన్న నజరానా అనుకొన్నా అబ్బాయ్ :D