Sunday, October 30, 2005

...

రైలు ప్రమాదం జరిగితే లాలూ రాలేదు అనేది పత్రికలలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసే బదులు ...ఆ ఖర్చు తో అక్కడ జనాల కి కావలసినవి పంపొచ్చేమో? అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లు లాలూ వచ్చాడా? సోనియా వచ్చిందా ? అని ఆలోచించే స్థితి లో కాని , వారి రాక వల్ల వారికి ఒరిగేది కానీ శూన్యం ..రాస్తున్న ఒకో పత్రిక తలో పది కార్లు , మందులు , దుస్తులు ఏదో ఒకటి పంపితే ..వాటి కోసం జనం అక్కడ ఎదురు చూస్తుంది ...డిల్లీ లో కూడా అదే పరిస్థితి ..మాడం సోనియా అక్కడికి పరిగెత్తి కెళ్లి సాధించింది ఏంటో నాకర్ధం కాలేదు ..ఆవిడ భద్రతకి ఆవిడ రాకకి హడావిడి ..పైగా అవి అక్కడి సహాయ కార్యక్రమాలకి అడ్డం...

3 comments:

Anonymous said...

akkada gurrru adi kaadu lendi... bihar politics lo munigi poyi.. railway shaakanu nirlakshyam chesadu ani. mana karma kaali ee sankeerna prabutvaalu inkenni rojulu moyyalo.

Inka mee opinion tho ekeebavinchalenu. mana desam lo oka nammakam erpadindi enti ante.. CM.. PM.. Minister vachi paramarsithe panulu munduku saagutaayi.. edo vuddarinchestaru ani kaadu.. konni saarlu dunnapothu meeda vaana padina chandam gaa vunde ee administration react kaavali ante vaallu vastene panulu jarugutaayi. :)

chava said...

ఖండిస్తున్నా :) ఎంచేతంటే సహాయ కార్యక్రమాలలో పాల్గొనే వాళ్లు ఎప్పుడూ ఎవరి చేతో చెప్పించుకోవడానికి ఎదురు చూడరు...కావాలంటే వార్తలు చదవండి ...డాక్టర్లు కానీ, సైన్యం కానీ, స్వచ్చంధ సంస్థలు కానీ ,లేదా ఈ ప్రమాదం సమయంలో స్పందించిన ఆ ఊరి జనం కానీ ...మన దేశం లో ప్రమాదం జరిగింది అనగానే ముందుగా అప్రమత్తం అయేది ఆ జిల్లా కలెక్టరు ...నాకు తెలిసి మన కలెక్టర్లు తోలు మందం గాళ్లు కాదు ...వాళ్లు పూనుకొంటే చాలు పనులు అవడానికి ..నిజానికి అక్కడ పనులు చేయించేది కూడా వాళ్లే ..ఈ నాయకులు వచ్చి ఫొటోలకి పోజులివ్వడం తప్పితే చేసేది చేయగలిగింది కూడా ఏమీ లేదు ..

Anonymous said...

Meeru cheppindi correcte oka vidham gaa. Nene inka vere brama lo vunnanu emo. :)