Thursday, June 23, 2005

కాపీ

సాగ్నిక్ రాసిన కొత్త post చదివాక నాకు మా కాలేజ్ లో సిద్ధడు ( సిదానంద్) చేసిన పని గుర్తొచ్చింది .. మొదటి రెండు సంవత్సరాలు కలిపి ౩ పేపర్లు డ్రాయింగ్ ఉండేది .. చదువయిపోయాక ఆ డ్రాయింగ్ అవసరం ఉద్యోగంలో రాదని చదివే మాకూ, చెప్పే పంతులు కీ తెలుసు..అయినా తప్పక చెప్పేవారు ..తప్పక మేము నేర్చుకొనేవాళ్లం ...అందులో సిద్ధడు రేపు పరీక్ష అనగా ఇవాళ రాత్రికి ఆ ప్రొఫెసర్ నే రేపు రాబోయే ప్రశ్నలకి సమాధానాలు అడిగే రకం ..పరీక్ష మొదలయింది ...సిద్ధడికి ..సుడి అంటారే అది ఎక్కువ ..వాడి ముందు వాళ్ల క్లాసు topper కూచొనేవాడు ..వాడి దాంట్లో రాసింది , గీసింది యధాతదంగా ఎక్కించి గట్టెక్కేవాడు ప్రతిసారీ ..ఆ సారి కూడా అదేపనిలో ఉన్నాడు ..పరీక్ష అయిపోయింది ...అయిపోయాక సిద్ధడికి ఒక అనుమానం వచ్చింది .." మామా ..మనం ఎప్పుడూ షీట్ కి అడ్డంగా ఇంటూ(X) గీతలు కొట్టిన గుర్తులేదు ..నువ్వేంది మరి పరీక్ష లో అలా కొట్టావ్? " అని అడిగాడు ...విషయం ఏంటో అర్ధం అయ్యి అందరం పడీ పడీ నవ్వుకొన్నాం...ఆ ముందు వాడు ఆ బొమ్మ తప్పు గీసి కొట్టేసాడు ..వెనక ఉన్న మనవాడు అది కూడా బొమ్మలో భాగం అనుకొని ఎక్కించేసాడు :D

update:
సిద్ధడు ప్రస్తుతం ఓ పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఎడిషనల్ మానేజర్ గా పని చేస్తున్నాడు

No comments: