Thursday, June 30, 2005

టూకీగా 2...

రాష్ట్ర జనభాలో సరిగా తినడానికి తిండి లేని జనం - సుమారు ఒక కోటీ పన్నెండు లక్షల మంది ..
తెలుగుదనాన్ని లోకానికి చాటడానికి(పేద వాడి గుడిసె ని పోలిన వేదిక పై నుండి) నాలుగు రోజులకి ఖర్చు దాదాపు పన్నెండు కోట్లు ...

టూకీగా...

"ఈ రెండు నెలలు అమ్మా నాన్నలతో వీలయినంత ఎక్కువ సమయం గడుపు "
"ఏం ? అలా అంటున్నావ్?"
"మళ్లీ ఎప్పుడు వెనక్కి వెడతావో..వెళ్లినా హడావిడిగా ఉంటుంది.."
"నేను సరిగ్గా 8 ఏళ్లలో వెనక్కి వచ్చేస్తా ఎట్టి పరిస్థితుల్లో"
మనసులో ..."ఆ మాట విమానం ఎక్కిన రెండో గంట నుండి ప్రతి గంటకోసారి అనుకోబట్టి ఇప్పటికి ఆరేళ్లు అయింది "

Thursday, June 23, 2005

కాపీ

సాగ్నిక్ రాసిన కొత్త post చదివాక నాకు మా కాలేజ్ లో సిద్ధడు ( సిదానంద్) చేసిన పని గుర్తొచ్చింది .. మొదటి రెండు సంవత్సరాలు కలిపి ౩ పేపర్లు డ్రాయింగ్ ఉండేది .. చదువయిపోయాక ఆ డ్రాయింగ్ అవసరం ఉద్యోగంలో రాదని చదివే మాకూ, చెప్పే పంతులు కీ తెలుసు..అయినా తప్పక చెప్పేవారు ..తప్పక మేము నేర్చుకొనేవాళ్లం ...అందులో సిద్ధడు రేపు పరీక్ష అనగా ఇవాళ రాత్రికి ఆ ప్రొఫెసర్ నే రేపు రాబోయే ప్రశ్నలకి సమాధానాలు అడిగే రకం ..పరీక్ష మొదలయింది ...సిద్ధడికి ..సుడి అంటారే అది ఎక్కువ ..వాడి ముందు వాళ్ల క్లాసు topper కూచొనేవాడు ..వాడి దాంట్లో రాసింది , గీసింది యధాతదంగా ఎక్కించి గట్టెక్కేవాడు ప్రతిసారీ ..ఆ సారి కూడా అదేపనిలో ఉన్నాడు ..పరీక్ష అయిపోయింది ...అయిపోయాక సిద్ధడికి ఒక అనుమానం వచ్చింది .." మామా ..మనం ఎప్పుడూ షీట్ కి అడ్డంగా ఇంటూ(X) గీతలు కొట్టిన గుర్తులేదు ..నువ్వేంది మరి పరీక్ష లో అలా కొట్టావ్? " అని అడిగాడు ...విషయం ఏంటో అర్ధం అయ్యి అందరం పడీ పడీ నవ్వుకొన్నాం...ఆ ముందు వాడు ఆ బొమ్మ తప్పు గీసి కొట్టేసాడు ..వెనక ఉన్న మనవాడు అది కూడా బొమ్మలో భాగం అనుకొని ఎక్కించేసాడు :D

update:
సిద్ధడు ప్రస్తుతం ఓ పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఎడిషనల్ మానేజర్ గా పని చేస్తున్నాడు

Saturday, June 18, 2005

నాటకం

ఇచ్చిన గడువు ముగుస్తోంది ..గుండెళ్లో రైల్లు పరిగెత్తుతున్నాయ్ ఒక్కోడికి అన్నాడు కాకా ఇందాక ..అబ్బో మన నాయకులకి భయం అనేది ఒకటి ఉందే ఇంకా అనిపించింది ..రాములమ్మ కొత్త పార్టీ ..ఎమ్మెస్ కి కొత్త పదవి ...కొత్త ఆ పదంలోనే తప్ప మరెందులో కనపడటం లేదు ...కొత్త అంటే శేషన్ పెట్టబోయే కొత్త రాజకీయ బడిలా ఉండాలి .... నేను చదివే రోజుల్లో ఎందుకు పెట్టలేదా అని చింతిస్తున్నా..అప్పుడే అలాంటి బడి ఉండి ఉంటే ఈ పాటికి ఏ రాబోయే రాయలసీమ రాష్ట్రానికో ముఖ్యమంత్రి ని అయి ఉందును గందా ...
ఉచిత విద్యుత్ విధానం మీద ఉతికి ఆరేసాక, నీళ్ల ప్రాజెక్టుల మీద ఎండగట్టారు కొన్నాళ్లు..రాజకీయ హత్యలని విపరీతంగా ఖండించాక ఉపఎన్నికతో ఆ విషయాన్ని పాతేసారు..దేవుడి భూములపై రాద్దంతం శాఖా మార్పుతో కొండెక్కించ్చారు ..ప్రస్తుతం మున్సిపోల్స్ కై జనం పల్స్ పట్టడానికి కొత్త నాటకం స్క్రిప్టు తయారీలో అందరూ పూర్తి సమయం నిమగ్నమై ఉన్నారు ...తెర తీసాక మొదలవుతుంది..కానీ తెరవెనుక జరిగే తతంగం అసలు నాటకాన్ని తలదన్నేలా ఉంది ..డిల్లీ అయితే ఏం, హైదరాబాద్ గల్లీ అయితేనేం...రాములమ్మ రామన్న గూడెం అయితేనేం ...

Friday, June 10, 2005

నిజం

ఒకోసారి మనం మనకి తెలిసింది , మనకి సరి అనిపించింది మాత్రమే నిజం అనుకొంటాము ..ఒకోసారి ఏంటి ఎప్పుడూ ..అప్పుడెప్పుడో ఫారూఖీ , గ్రాఫిక్స్ లో చెప్పినట్టు మనకి కనపడేదే నిజం అని ..వెంటనే నేను అడిగిన ప్రశ్న ఆ నిజమనేది మాత్రం మనకెలా తెలుస్తుంది అని ..ఇంతకీ చెప్పొచ్చేదేమంటే ఎవడేమి అనుకొంటే మనకేంటి అన్నట్లు ఉండమని :D పక్క వాడికి ఇబ్బంది కలగనంత వరకు ..వాడికి ఆ ఇబ్బంది మనవలన కలగక పోయినా మనవలనే అని వాడు అనుకొంటే మనకొచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ఏమీ లేదు ...అంచేత ...

Sunday, June 05, 2005

పరిణామ క్రమం

ఒకప్పుడు సినిమాలో నాయక -కీ లు గోరు ముద్దలు తినిపించుకొనేవారు ..కొన్నాళ్లకి ఒకే కొబ్బరి బోడం లో straw వేసుకొని తాగే వారు ..ఇంకొన్నాళ్లకి కూల్ డ్రింకు పంచుకొనేవారు ..ఇప్పుడు ఒకటే సిగిరెట్టు పంచుకొంటున్నారు :D

Thursday, June 02, 2005

అట్టూ స్టేషన్

అలాస్కా లో అట్టూ స్టేషన్ అనే ఊర్లో జనాభా 13 :( పదముగ్గురిలో ఒకరు డాక్టరు , ఒకరు పోస్ట్ మాన్ , ఒకరు కిరాణా కొట్టు వాడు అయి ఉండాలి . మిగిలిన పది మంది ఎవరు అయి ఉండొచ్చు?