ఆలోచనలు?
అప్పుడప్పుడు అనిపిస్తుంది .. ఏంటి ఈ ఆలోచనలు అని.. చిన్న పిల్లలని చూసినప్పుడు మరీ... వాళ్ళకీ మనలానే ( అంటే మనమ్ ఏంటి గొప్ప?) ఆలోచనలు ఉంటాయా? మనలానే అన్ని ఆలోచించగలరా? పక్కవాడు మనని చూసి నవ్వడం లేదేంటి ...పలకరించలేదేంటి... వాడేంటి అలాటి బట్టలు కట్టుకొన్నాడు.. వగైరా వగైరా ఆలోచనలు వాళ్ళకి కూడా వస్తాయా? ఏమో మరి ..రోజు ఇంటికి పోయేసరికి ఇంటి ముందు ఎప్పుడూ పిల్లలు ఆడుతూ ఉంటారు...ఒక్కరు కూడా నన్ను పట్టించుకొన్నట్లు అనిపిన్చలేదు ఒక్కసారి కూడా.. మొన్నెప్పుడో వాళ్ళల్లో ఆ పిల్లికళ్ళ పిల్లాడు అడిగాడు.. "hey u know my name? "అని.. సూపర్ మ్యాన్ ట వాడి పేరు.. చెప్పేసి తుర్రుమన్నడు :)
No comments:
Post a Comment