Saturday, February 25, 2006

టూకీగా

రోజుకి పద్దెమినిది గంటలు పనిచేసే అలవాటున్న బాబు కి పనిలేకుండా ఉండటం చాలా కష్టం గా ఉన్నట్లుంది ...రాష్ట్రం లో సమస్యలన్నీ 9 ఏళ్లలో తీర్చేసారు ...ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలు తీర్చడానికి కంకణం కట్టుకొన్నట్టున్నారు...మొన్నా మధ్య ఉత్తర భారతం లో సమస్యలు తిరిగి సమస్యలు అర్ధం చేసుకొచ్చారనుకొంటా ..అస్సాం వాళ్ల గొడవలు తీరుస్తాం రమ్మని పిలిచారు ...తరువాత కాశ్మీర్ సమస్య తీరుస్తారు ...ఆ రకంగా అంతర్జాతీయ సమస్యలు చక్కబెట్టిన ఘనత కూడా దక్కొచ్చు ..మరోసారి ఇండియా టుడే వగైరా పత్రికల ముఖ పత్రాలెక్కుతారు ..వీలుంటే ఈ సారి అమెరికా తదితర దేశ పత్రికల లో బొమ్మలు వేసినా వేయొచ్చు ...చివరికి మిగిలేవి కాంగ్రెసు వారి గొడవలు ..అవి తీర్చడానికి ఎమ్మెస్ లాంటి పెద్దలు బాబుని పిలిచినా పిలవొచ్చు ...ప్రస్తుతానికి అది టూకీగా ...