Sunday, January 29, 2006

టూకీగా ...

ఏ శాఖా లేని మంత్రివర్యులు ఏం చేస్తారు రోజూ?

Friday, January 27, 2006

టూకీగా ...

గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలాం అలవాటు ప్రకారం చాలా చెప్పారు ...రాజకీయాలు రెండు రకాలు ...మొదటి రకం రాజకీయం ఎన్నిక కావడానికి ..రెండవ రకం ఎన్నికయ్యాక ప్రజా సేవకి అని ...కానీ ఆయన చెప్పనిది ఇంకో రకం ఉంది ...ఎన్నికయ్యాక పదవి కాపాడుకోడానికి చేసే రాజకీయాలు ...ఉన్నవన్నీ ఇవే రాజకీయాలు అధ్యక్షా ...కేంద్రం లో కాంగ్రెస్సు ప్రతిరోజు ఎర్రజెండా వాళ్లు మద్దతు వెనక్కి తీసేసుకోకుండా చూసుకోడమే సరిపోతుంటే ఇక పెజా సేవ రాజకీయాలు ఎలా వెలగ బెడతారు? ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇదే పరిస్థితి ..కథలు కబుర్లు చెప్పడానికి బానే ఉంటాయి ..చేయించ గలిగేవి చెప్తే మంచిది ...

Wednesday, January 25, 2006

టూకీగా ...

కాంగ్రెస్సు అంతా ఒక వైపు ...రాహుల్ ఒక్కడే ఒకవైపు ...చిన్నవాడైనా సరిగా చెప్పాడు ...భేష్ ...తప్పకుండా ప్రధాని అవుతాడు ...కాని రాహుల్ బాబు కి అర్ధం కానిది ...నీ బాబు కు అర్ధం అయింది ...కార్యకర్తలని పట్టించుకోడం అంటే వాళ్లని రెచ్చగొట్టడం ...రాహుల్ మాట్లాడుతున్నంత సేపు అరుపులు కేకలు ...చెప్పింది వేదికకి కింద దూరంగా ఉన్న వాళ్లకోసం ..విని తలలూపుతుంది వేదిక పైన ఉన్న వారు ..చూద్దాం ఏ మాత్రం మారుస్తాడో ...

Thursday, January 12, 2006

టూకీగా ...

భగవంతుని శత్రువు పై రాళ్లు విసిరినందుకు శిక్ష - చావు

Thursday, January 05, 2006

టూకీగా

ఫోన్ టాప్ చేసారు అని ఒకరి తరువాత ఒకరు మెగాఫోన్లో అరుస్తున్నారు ..ఇంతకీ వారు మాట్లాడుకొనే విషయాలు ఏమయి ఉంటాయి? ఎవరి దగ్గర ఎంత లంచం తీసుకొన్నారో తప్ప?ఆ విషయాలు తెలిస్తే మాత్రం పోయేదేముంది? వీడియో లు సాక్ష్యం గా చూపిస్తుంటేనే అవన్నీ నిజం కాదని సిగ్గూ ఎగ్గూ లేకుండా బుకాయిస్తుంటిరి కద ...

టూకీగా ...

సైన్సు కాంగ్రెస్సుకు , నేషనల్ కాంగ్రెస్సు కు పెద్ద తేడా కనపడకుండా ఉంది ..రెండు చోట్లా నాయకులదే రాజ్యం ...కలాం చెప్పిందే చెప్పి( నేను చదివిందే చదివి) విసుగు తెప్పిస్తున్నాడు ..అయ్యా కలాం ..జరంత ఆ శాస్త్ర వేత్తల బాధ కూడా పట్టించుకోరాదె ..రాజకీయాల జోక్యం ఉండనట్లైతే సాధించేది చాలా ఉంది అని మొత్తుకొంటున్నారు ..ముందు అది జరిగే పని చూసి అప్పుడు మిగతావి చూద్దాం ..ఎంతసేపు పిల్లలకి ముద్దు ముద్దు గా సమాధానాలు చెప్పి సంతోష పెట్టడమేనా?