Wednesday, December 21, 2005

టూకీగా...

"చెన్నై లో తొక్కిసలాట లో 43 మంది చనిపోయారు " --- పాపం అనిపిస్తుంది
"భవాని అనే ఉపాధ్యాయురాలిని చంపిన సురేష్ ని గ్రామస్తులు రాళ్లతో కొట్టి చంపారు" -- కొంచెం బాధ కొంచెం త్రుప్తి
"జై చిరంజీవి సినిమా కి టికెట్ దొరకలేదని ఆత్మహత్యా ప్రయత్నం...చావు బతుకుల మధ్య యువకుడు " నవ్వొస్తుంది
మూడూ చావులే ...కానీ ఒకో సందర్భంలో ఒకోలా అనిపిస్తుంది ...
నిజాయితీగా పని చేస్తున్న నా అన్న లాంటి వాళ్లని చంపినప్పుడు మీకేమి అనిపిస్తుంది ? అని ధూబే తమ్ముడు అడిగితే కలాం " ఓటమి ని మనం అధిగమించాలి ..మనని ఓటమి కాదు" అంటే సర్రున కోపం వస్తుంది ...

Sunday, December 18, 2005

టూకీగా ...

"హలో ..ఎవరండీ మాట్లాడేదీ?"
"హలో ..నాపేరు దానయ్య అండీ...అనూ గారాండీ?"
"అవునండీ ..దానయ్య గారూ చెప్పండి ..మీ సమస్య ఏంటి?"
" మా అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడండి ..చాలా సన్నగా ఉంటాడండి ..వాడు లావు అవ్వడానికి మీ రత్నం వాడితే ఏమన్నా ఫలితం ఉంటుందా అండీ?"
" మీ అబ్బాయి జాతకం, వేలి ముద్రలు 250 రూపాయలు పంపండి ..మా ఆస్థాన జ్యోతిష్కులు పరిశీలించి ఏ రత్నం సరిపోతుందో చెప్తారు ..ఆ రత్నం ధరిస్తే మీవాడు లావు అవటంతో పాటు ఇతర సమస్యలు కూడా తీర్తాయి ..ఆరు నెలల్లో ఫలితాలు కనపడక పోతే మీ సొమ్ము వాపస్ ఇస్తాము ..మీరు గనుక ఆ రత్నం మా దగ్గరే కొంటే 250 కన్సెషన్ ఇస్తామండీ "
ప్రస్తుత తెలుగు చానెల్ లో ఓ ప్రోగ్రామ్ ...
తలా ఓ 250 చొప్పున ప్రభుత్వమే అందరికీ ఓ రత్నం ఇప్పిస్తే సమస్యలే లేని సమాజం అవుతుంది కాబట్టి ఆ పని చేస్తే పోలా..ముందుగా మన నాయకులకి ఇప్పిస్తే మరీ మంచిది ...

Saturday, December 17, 2005

టూకీగా ..

రాత్రి పెద్ద సమస్య వచ్చి పడింది ...ఓ పక్క జే మరో పక్క డేవ్ ...ఇద్దరూ ఇద్దరే ..చానెల్ మారుస్తూ కష్టపడి చూస్తున్నా ...ఇంతలో దుబ్యా బుష్ PBS లో కనపడ్డాడు ...వాళ్లిద్దరితో పోటీ పడతాడని తెలుసు...PBS తో సమస్య ఏమంటే అది ad free channel ...ఒకేసారి మూడు చూసే అవకాశం లేదు ..చివరికి బుష్ నే చూడాల్సి వచ్చింది ...చూసినందుకు నిద్రపోయే ముందు తెగ నవ్వించాడు... అందుకు దుబ్యా కి థాంక్స్ .

Friday, December 16, 2005

టూకీగా ..

అప్పటికీ ఇప్పటికీ మారకుండా ఉన్నది ?
clinic plus shampoo ధర - 1.50

Wednesday, December 14, 2005

టూకీగా ...

తాగినోడు నిజమే చెప్తాడు ..సైఫ్ అలీ ఖాన్ చిత్తుగా తాగి పిల్లాడిని గుద్దేసి పోలీసు స్టేషన్ కి వెళ్ళి చెప్పి మరీఇంటికెళ్లాడు ... మత్తు దిగాక మాత్రం న్యాయ వ్యవస్థ సరిగా అర్ధం కాక వెళ్లకుండా ఉండి పోయాడు ...

టూకీగా ...

విచిత్రం ఏమంటే మైక్రోసాఫ్టు నుండి ఈ బ్లాగు చదివిన వాళ్లు గూగుల్ రీడర్ వాడటం :P

Sunday, December 11, 2005

టూకీగా ...

తెలంగాణా రాష్ట్రం రావాలంటే యాగాలు చేయాలి ...
రాజకీయ విలువలు ఉన్నాయో లేదో తెలుసుకోడానికి DNA పరిక్షలు చేయించాలి ...
ఇవీ నేటి నేతల పరిశోధనా ఫలితాలు ...

Tuesday, December 06, 2005

టూకీగా ...

"నువ్వు దేవుణ్ని నమ్ముతావా?"
"నమ్ముతాను ..."
"దేవుడు అంతటా అన్ని వేళలా ఉంటాడు అనే విషయాన్ని నమ్ముతావా? "
"నమ్ముతాను ..."
"దేవుడికి భవిష్యత్తు లో జరగబోయేది తెలుస్తుంది అనే విషయాన్ని? "
"నమ్ముతాను ..."
"మనిషి తనంతట తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలడా?"
"అవును .."
"మరి భగవంతుడు భవిష్యత్తు మొత్తం ముందే నిర్ణయిస్తే ఇంక మనిషి తాను ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏముంది?"
"మనిషికి ఆలోచనా శక్తిని ఇచ్చాడు ..ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అతని విచక్షణకే వదిలేసాడు .."
"అంటే భగవంతుడికి మనిషి తీసుకోబోయే నిర్ణయాల మీద అధికారం లేదు ..భవిష్యత్తు కూడా తెలియదు ?"...

Thursday, December 01, 2005

టూకీగా ...

మంజుల్ షా ను మంజులా షా గా మార్చారు ఆంధ్రజ్యోతి వారు