టూకీగా ...
భగవంతుని శత్రువు పై రాళ్లు విసిరినందుకు శిక్ష - చావు
భగవంతుని శత్రువు పై రాళ్లు విసిరినందుకు శిక్ష - చావు
Posted by chava at 12:44 PM 1 comments
ఫోన్ టాప్ చేసారు అని ఒకరి తరువాత ఒకరు మెగాఫోన్లో అరుస్తున్నారు ..ఇంతకీ వారు మాట్లాడుకొనే విషయాలు ఏమయి ఉంటాయి? ఎవరి దగ్గర ఎంత లంచం తీసుకొన్నారో తప్ప?ఆ విషయాలు తెలిస్తే మాత్రం పోయేదేముంది? వీడియో లు సాక్ష్యం గా చూపిస్తుంటేనే అవన్నీ నిజం కాదని సిగ్గూ ఎగ్గూ లేకుండా బుకాయిస్తుంటిరి కద ...
Posted by chava at 6:57 PM 1 comments
సైన్సు కాంగ్రెస్సుకు , నేషనల్ కాంగ్రెస్సు కు పెద్ద తేడా కనపడకుండా ఉంది ..రెండు చోట్లా నాయకులదే రాజ్యం ...కలాం చెప్పిందే చెప్పి( నేను చదివిందే చదివి) విసుగు తెప్పిస్తున్నాడు ..అయ్యా కలాం ..జరంత ఆ శాస్త్ర వేత్తల బాధ కూడా పట్టించుకోరాదె ..రాజకీయాల జోక్యం ఉండనట్లైతే సాధించేది చాలా ఉంది అని మొత్తుకొంటున్నారు ..ముందు అది జరిగే పని చూసి అప్పుడు మిగతావి చూద్దాం ..ఎంతసేపు పిల్లలకి ముద్దు ముద్దు గా సమాధానాలు చెప్పి సంతోష పెట్టడమేనా?
Posted by chava at 5:00 PM 0 comments
"చెన్నై లో తొక్కిసలాట లో 43 మంది చనిపోయారు " --- పాపం అనిపిస్తుంది
"భవాని అనే ఉపాధ్యాయురాలిని చంపిన సురేష్ ని గ్రామస్తులు రాళ్లతో కొట్టి చంపారు" -- కొంచెం బాధ కొంచెం త్రుప్తి
"జై చిరంజీవి సినిమా కి టికెట్ దొరకలేదని ఆత్మహత్యా ప్రయత్నం...చావు బతుకుల మధ్య యువకుడు " నవ్వొస్తుంది
మూడూ చావులే ...కానీ ఒకో సందర్భంలో ఒకోలా అనిపిస్తుంది ...
నిజాయితీగా పని చేస్తున్న నా అన్న లాంటి వాళ్లని చంపినప్పుడు మీకేమి అనిపిస్తుంది ? అని ధూబే తమ్ముడు అడిగితే కలాం " ఓటమి ని మనం అధిగమించాలి ..మనని ఓటమి కాదు" అంటే సర్రున కోపం వస్తుంది ...
Posted by chava at 8:48 PM 0 comments
"హలో ..ఎవరండీ మాట్లాడేదీ?"
"హలో ..నాపేరు దానయ్య అండీ...అనూ గారాండీ?"
"అవునండీ ..దానయ్య గారూ చెప్పండి ..మీ సమస్య ఏంటి?"
" మా అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడండి ..చాలా సన్నగా ఉంటాడండి ..వాడు లావు అవ్వడానికి మీ రత్నం వాడితే ఏమన్నా ఫలితం ఉంటుందా అండీ?"
" మీ అబ్బాయి జాతకం, వేలి ముద్రలు 250 రూపాయలు పంపండి ..మా ఆస్థాన జ్యోతిష్కులు పరిశీలించి ఏ రత్నం సరిపోతుందో చెప్తారు ..ఆ రత్నం ధరిస్తే మీవాడు లావు అవటంతో పాటు ఇతర సమస్యలు కూడా తీర్తాయి ..ఆరు నెలల్లో ఫలితాలు కనపడక పోతే మీ సొమ్ము వాపస్ ఇస్తాము ..మీరు గనుక ఆ రత్నం మా దగ్గరే కొంటే 250 కన్సెషన్ ఇస్తామండీ "
ప్రస్తుత తెలుగు చానెల్ లో ఓ ప్రోగ్రామ్ ...
తలా ఓ 250 చొప్పున ప్రభుత్వమే అందరికీ ఓ రత్నం ఇప్పిస్తే సమస్యలే లేని సమాజం అవుతుంది కాబట్టి ఆ పని చేస్తే పోలా..ముందుగా మన నాయకులకి ఇప్పిస్తే మరీ మంచిది ...
Posted by chava at 4:12 PM 2 comments
రాత్రి పెద్ద సమస్య వచ్చి పడింది ...ఓ పక్క జే మరో పక్క డేవ్ ...ఇద్దరూ ఇద్దరే ..చానెల్ మారుస్తూ కష్టపడి చూస్తున్నా ...ఇంతలో దుబ్యా బుష్ PBS లో కనపడ్డాడు ...వాళ్లిద్దరితో పోటీ పడతాడని తెలుసు...PBS తో సమస్య ఏమంటే అది ad free channel ...ఒకేసారి మూడు చూసే అవకాశం లేదు ..చివరికి బుష్ నే చూడాల్సి వచ్చింది ...చూసినందుకు నిద్రపోయే ముందు తెగ నవ్వించాడు... అందుకు దుబ్యా కి థాంక్స్ .
Posted by chava at 9:17 AM 0 comments
అప్పటికీ ఇప్పటికీ మారకుండా ఉన్నది ?
clinic plus shampoo ధర - 1.50
Posted by chava at 2:18 PM 3 comments
తాగినోడు నిజమే చెప్తాడు ..సైఫ్ అలీ ఖాన్ చిత్తుగా తాగి పిల్లాడిని గుద్దేసి పోలీసు స్టేషన్ కి వెళ్ళి చెప్పి మరీఇంటికెళ్లాడు ... మత్తు దిగాక మాత్రం న్యాయ వ్యవస్థ సరిగా అర్ధం కాక వెళ్లకుండా ఉండి పోయాడు ...
Posted by chava at 6:54 PM 0 comments
విచిత్రం ఏమంటే మైక్రోసాఫ్టు నుండి ఈ బ్లాగు చదివిన వాళ్లు గూగుల్ రీడర్ వాడటం :P
Posted by chava at 6:46 PM 2 comments
తెలంగాణా రాష్ట్రం రావాలంటే యాగాలు చేయాలి ...
రాజకీయ విలువలు ఉన్నాయో లేదో తెలుసుకోడానికి DNA పరిక్షలు చేయించాలి ...
ఇవీ నేటి నేతల పరిశోధనా ఫలితాలు ...
Posted by chava at 6:51 PM 0 comments
"నువ్వు దేవుణ్ని నమ్ముతావా?"
"నమ్ముతాను ..."
"దేవుడు అంతటా అన్ని వేళలా ఉంటాడు అనే విషయాన్ని నమ్ముతావా? "
"నమ్ముతాను ..."
"దేవుడికి భవిష్యత్తు లో జరగబోయేది తెలుస్తుంది అనే విషయాన్ని? "
"నమ్ముతాను ..."
"మనిషి తనంతట తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలడా?"
"అవును .."
"మరి భగవంతుడు భవిష్యత్తు మొత్తం ముందే నిర్ణయిస్తే ఇంక మనిషి తాను ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏముంది?"
"మనిషికి ఆలోచనా శక్తిని ఇచ్చాడు ..ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అతని విచక్షణకే వదిలేసాడు .."
"అంటే భగవంతుడికి మనిషి తీసుకోబోయే నిర్ణయాల మీద అధికారం లేదు ..భవిష్యత్తు కూడా తెలియదు ?"...
Posted by chava at 6:49 PM 0 comments
మంజుల్ షా ను మంజులా షా గా మార్చారు ఆంధ్రజ్యోతి వారు
Posted by chava at 8:04 PM 0 comments
గత పదిహేను రోజుల్లో ఎప్పటినుండో ఊహించిన రెండు విషయాలు జరిగాయి ---
ఒకటి లాలూ ఓటమి ...
రెండు నాయుడు గారు తెలుగు విధ్యార్ధి సంఘాన్ని పునః ప్రారంభించడం ..
Posted by chava at 8:51 PM 0 comments
మొద్దు శీను ని పట్టుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కానేకాదు - అన్నారు హోం ..నూరు శాతం ఏకీభవిస్తున్నా ...అసలు శీను ని పట్టుకోక పోవడం వైఫల్యం అన్న మాటని ఖండిస్తున్నా ...శీను తన పేరు తో డ్రయివింగ్ లైసెన్సు తీసుకొని ఉంటే పోలీసులు తేలిగ్గా పట్టేసుకొని ఉందురు ..కానీ వేరెవరి పేరు మీదో తీసుకొన్నాడు ...అది రవాణా శాఖ వైఫల్యమే గానీ పోలీసులది కానేకాదు ... 3 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ...పోలీసు కేసులు ఉన్న వారికి ఖాతాలు తెరవనివ్వడం బ్యాంకు వారి తప్పు ..అదీగాక పోలీసులని అది తప్పుదోవ పట్టిస్తుంది ...ఎంచేతంటే పోలీసులు బ్యాంకులు అన్నీ సక్రమంగా ఉంటేనే ఖాతాదారులుగా చేర్చుకొంటాయి అనుకొంటారు ...కనుక అది బ్యాంకుల వైఫల్యం ... చెప్పుకొంటూ పోతే ఇలా చాలామంది వైఫల్యాలు ఉన్నాయి .. అందరి తప్పులని పోలీసుల మీద తోయడం ఏంటీ అర్దంలేకుండా?
Posted by chava at 2:41 PM 2 comments
కుష్బూ మరీ అంత భయం భక్తీ లేకుండా మాట్లాడకుండా ఉండాల్సింది ..ఓ అనసూయ ఓ సావిత్రి ఓ ఇంకో లెక్కలేనన్ని పతివ్రతలలో ఒకరు పుట్టిన గడ్డపై పుట్టి అలా మాట్లాడటం ఏంటి చండాలంగా కాకపోతే? అంతగా కావాలంటే తనకి చేతనైంనంతలో "చూపించాలి " గానీ ఇలా వేదిక లెక్కి మాటాడితే కుదరదు ..చూపించితే అందరూ చీకట్లో చొంగ కారుస్తూ చూస్తారు డబ్బులిచ్చి మరీ..గుడి కట్టించి మరీ దణ్ణాలు పెడతారు ..అదే ఒక మంత్రి వర్యులు , వయస్సులో పెద్దాయన , పిల్లలకి కండోమ్స్ పంచాలి అంటే , నవ్వి ఊరుకొన్నారు ..ఎంచేతంటే ఈ పుణ్య పవిత్ర భూమి లో కొన్ని విషయాలు మగవారు మాత్రం మాట్లాడటానికి వీలుంది ..పతివ్రతలు అయినా కాకపోయినా ఆడవారు మాట్లాడటానికి వీలు లేదు ...మన లెవిలు ఏంటో తెలుసుకొని పనిలోకి దిగమన్నారు అందుకే ..ఆ అన్నది ఎవరు అని అడక్కమ్మా మళ్లీ ..అదిగో తెలివి మీరి ప్రశ్నలు అడుగుతుంది అది తప్పు అంటారు ..పిచ్చిమాలోకం లా ఎన్ని సినిమాలలో పెళ్లి కాకుండా తల్లి కాలేదు నువ్వు నీ సహ నటులు ...అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చూసి విజయవంతం చేసారు కదా ..అదే విషయం చెప్తే తప్పేముంది అనుకొని ఉంటావు నువ్వు ..సినిమాలోలా లేడీ రౌడీ లా ఇక్కడ కూడా చెలామణి అవుతుంది అనుకొంటే అది పొరపాటు ..ఎంచేతంటే పతివ్రతలు పుట్టిన దేశం కాబట్టి ..దానికి తోడు ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఎందుకు పాటించాలో తెలియక పోయినా పాటించాలి కాబట్టి ..ఇప్పటికైన బుద్దిగా మసలుకో ...
Posted by chava at 3:18 PM 3 comments
"కొల్లాయి కట్టితేనేమి , కోమటై పుట్టితేనేమీ"
"భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ , ఒక దళిత కుటుంబానికి చెందిన వాడయినప్పటికి ..."
" భారత రాష్ట్రపతి పదవి నలంకరించిన మొదటి దళితుడు కె ఆర్ నారాయణన్ "
ఇలా ఇంకా ఎన్నాళ్లు కులాలని ప్రస్తావిస్తూ రాస్తూ పోతారు?
Posted by chava at 12:09 AM 0 comments
ఒకావిడ స్వర్ణోత్సవాలలో ఒక్క స్త్రీని కూడా ప్రస్తావించలేదు అని విరుచుకు పడింది ..ఒకాయనేమో 50 సంవత్సరాలలో బలహీన వర్గాల నుండి ఒక్కరిని కూడా ముఖ్యమంత్రిని కానీయలేదు అని వాపోయాడు ...మరొకరేమో మైనారిటీలని ఇంకా ఎంతకాలం అణగదొక్కుతారు అని ఘర్జించాడు ...చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి ...అందరూ మాది పెద్ద సమస్య అంటే మాది పెద్ద సమస్య అని గగ్గోలు పెడుతున్నారు ..మరి సమస్య లేకుండా ఉంది ఎవరు? అధికారంలో ఉన్నవాడికీ ,లేని వాడికి కూడా సమస్యల మయం రోజంతా ..ఎందుకు ఎవడో వచ్చి మాకేదో చేయాలి అని ఎదురు చూడటం ..యాభై ఏళ్లలో ఇది కూడా తెలుసుకోలేక పోయారా?
Posted by chava at 4:51 PM 0 comments
కొన్నాళ్ల క్రితం సింగుగారు మాడం గారిని కలిసారు అని చదివే వాళ్లం ...ఈ మధ్య ఇరాక్ ఆయిలు కుంభకోణం పుణ్యమా అని మాడం గారు సింగు గారిని కలుస్తున్నారని చదువుతున్నాం ...సెహభాస్ సింగు గారూ...
Posted by chava at 6:32 PM 0 comments
నట్వర్ సింఘ్ కాంగ్రెస్సు మీద అలిగి ( తనని "గట్టిగా" సమర్ధించలేదని ) రాజీనామా చేయడం , "మొగుడు కొట్టినందుకు కాదు ..ఆడపడచు నవ్వినందుకు" అన్నట్లుంది ...
Posted by chava at 7:59 AM 0 comments
ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఏ విధమైన ప్రభుత్వ పదవి లేని మాడం సోనియా నిర్ణయంపై ఆధారపడి ఉంది అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు ...ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి ఉందా? నాకు తెలియక అడుగుతున్నా ...
Posted by chava at 5:02 PM 1 comments
రైలు ప్రమాదం జరిగితే లాలూ రాలేదు అనేది పత్రికలలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసే బదులు ...ఆ ఖర్చు తో అక్కడ జనాల కి కావలసినవి పంపొచ్చేమో? అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లు లాలూ వచ్చాడా? సోనియా వచ్చిందా ? అని ఆలోచించే స్థితి లో కాని , వారి రాక వల్ల వారికి ఒరిగేది కానీ శూన్యం ..రాస్తున్న ఒకో పత్రిక తలో పది కార్లు , మందులు , దుస్తులు ఏదో ఒకటి పంపితే ..వాటి కోసం జనం అక్కడ ఎదురు చూస్తుంది ...డిల్లీ లో కూడా అదే పరిస్థితి ..మాడం సోనియా అక్కడికి పరిగెత్తి కెళ్లి సాధించింది ఏంటో నాకర్ధం కాలేదు ..ఆవిడ భద్రతకి ఆవిడ రాకకి హడావిడి ..పైగా అవి అక్కడి సహాయ కార్యక్రమాలకి అడ్డం...
Posted by chava at 4:44 PM 3 comments
"గత ప్రభుత్వం నంది అవార్డులని రాజకీయ మయం చేసింది " అవార్డుల సభలో దాసరి వారు అనడం - అమ్మని తిడతావా లమ్డీకొడకా అన్నట్టుంది ...
Posted by chava at 10:51 AM 1 comments
ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు ఎప్పుడో ఎక్కడో అప్పుడప్పుడు వింటున్నట్టు ఉంది ..చిన్నప్పుడు రామ రాజ్యం అన్నారు ..కొన్నాళ్లు స్వర్ణాంధ్ర అన్నారు ...మధ్యలో అప్పుడప్పుడు అన్నల రాజ్యం అనే అరుపు వినిపించేది ...తుపాకీ , మందుపాతరల చప్పుళ్ల మధ్యలో ...మొన్నామధ్య ఇందిరమ్మ రాజ్యం అన్నారు ..ఇప్పుడేమో కొత్తగా ఆదర్శాంధ్ర అంటున్నారు ...నాయక ప్రతినాయక పాత్రలు, నాటకం పేరు మార్చుకొంటూ చూపించేది మాత్రం అదే నాటకం ..అదీ సంగతి...
Posted by chava at 5:17 PM 0 comments
my boss today when we ask him about a design issue - " Its like a psychiatrist asking the patient , going through his profile, "so you say you are abmivalent , is that so?"" ...poor patient ..
Posted by chava at 6:04 PM 0 comments
తనకి శుభాకాంక్షలు చెప్పే వాళ్లలో తనే మొదటివాడయి ఉండాలనుకొనేవాడొకప్పుడు ... రాత్రి పడుకోబోయే ముందు ,చెప్పాలన్న విషయంగుర్తుకొస్తే చాలనుకొంటున్నాడిప్పుడు ...
Posted by chava at 10:22 PM 6 comments
నిన్న సాయంత్రం నుండి అదే ఆలోచన ...కుదురుతుందా .. నా వల్ల అవుతుందా ఆ పని అని ...మొదలెడితే ఏ పని అయినా అవుతుందని వాడు అంటూ ఉంటాడు .. కానీ అవ్వదేమో అని నాలో నేను ...మొదలెట్టిన పని పూర్తి కాకుండా ఆపడం కన్నా చేయలేమన్నప్పుడు మొదలెట్టకపోడమే మంచిది కదా అన్నది నా వాదన...రాత్రి పడుకొన్నాక కూడా అదే ఆలోచన ......ఆ పనేదో చేస్తేగానీ నిద్ర పట్టేలా లేదు అనుకొని లేచి రాసేసా ...సరిగ్గా యాభైఅయిదు పదాలు
Posted by chava at 6:57 PM 0 comments
అమ్మ అయ్య ఆఫీసు నుండి తెచ్చిన పెన్నులు , పెన్సిళ్లు కొడుకు కత్రినా బాధితులకి విరాళమిచ్చాడు ...
Posted by chava at 5:35 PM 1 comments
"చిన్న గా మాట్లాడు " అని పెద్దగా అరుస్తూ చెప్పాడు తాత మనవడికి ....
Posted by chava at 9:49 PM 1 comments

విచిత్రం ఏంటంటే --- "ఆయుధాలు" అనే పదం కోసం యాహూ లో వెతికితే నా బ్లాగోతం కి దారి చూపించడం :)...ఇప్పుడు ఈ వంకతో నన్ను కూడా అరెస్టు చేయమంటారేమో ప్రియతమ ముఖ్యమంత్రి గారు , గృహ మంత్రి గారు ...
Posted by chava at 7:00 PM 0 comments
అమ్మ శవయాత్రకి పదివేలు దాచిన మూడో కొడుకు , వౄద్ధాశ్రమానికి అయిదువేలు విరాళమిచ్చాడు ...
Posted by chava at 8:46 AM 0 comments
అనగా అనగా ఒక దుర్గారాణి ..రాణి కి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ..తొమ్మిది మందీ తాము తినగలిగీ ఇంకో ఇద్దరికి పెట్టగలిగే స్థితి లోనే ఉన్నారు ...తల్లికి తప్ప ......రాజుగారు ఖర్చు చేయగా మిగిలిన పొలం అమ్మితే ఇరవై వేలు వచ్చాయి ...ఇరవై వేలు వడ్డీకి ఇచ్చి ఆ వచ్చే డబ్బుతో జీవించమన్నారు ..ఆ వడ్డీకి కూడా నేనే ఇస్తా నాకు తెలిసిన వాళ్లకి అని డబ్బు తీసుకొన్నాడు మూడో కొడుకు ..వడ్డీ మాత్రం పదివేలకే ఇస్తున్నాడు ..బిడ్దా వడ్డీ ఎక్కడ అని అడిగితే ...నీ ఖర్మ ఖాండలకి అవసరం అవుతాయని పదివేలు దాచా అన్నాడు ...
Posted by chava at 2:08 PM 1 comments
రాత్రి 1.30 కి ఫోన్ మోగింది .అదిరిపడి లేచి ఫోన్ ఎత్తా .
"హలో నేను నాగేశ్వరరావు ని " మరోసారి గుండె అదిరింది ..నాకు వెంటనే గుర్తొచ్చిన నాగేశ్వరరావు మా అక్క మామగారు .ఈయన ఈ సమయంలో ఎందుకు చేసి లేపుతున్నాడబ్బా అనుకొంటుండుగానే"నేను రా నాగేశ్వరరావు ని మణుగూరు నుండి " అన్నాడు ..మణుగూరు నాగేశ్వరరావు అంటే నా మాజీ మానేజరు గుర్తొచ్చాడు ..కానీ ఆయనకి నన్ను అరే ఒరే అనేంత చనువు లేదు ..అప్పుడు వెలిగింది ..వీడు" నామ్ "అని ..ఆ కాలేజి పుణ్యమా అని మేము ఇంటి పేర్లతోనే అందరికి బాగా గుర్తుంటాం ..ఇలా అర్ధరాత్రిళ్లు ఇబ్బంది కలిగినా ఒకోసారి అది తన్నులు తినకుండా కాపాడేది ..ఓసారి ఓ రౌడీ గ్యాంగు లో ఒకడు నాతో చిన్నప్పుడు చదివిన పరిచయంతో సుధీర్ అనేవాడు ఎలా ఉంటాడు , ఏ టైమ్ లో వస్తాడు అని కూపీ లాగడానికి అడిగాడు ..నేను "అన్నా మిమ్మల్ని ఎవడో బోల్తా కొట్టించాడు ..అసలు సుధీర్ అనేవాడు మా కాలేజి మొత్తంలోనే లేడు" అని నమ్మకంగా చెప్పా..వాడికి నామీదున్న అపార నమ్మకంతో నమ్మేసాడు ..విషయం ఏంటంటే నాకూ సుధీర్ పేరు సుధీర్ అని గుర్తు లేదు ఆ సమయానికి ..వాడి పేరు "కట్ల " మా కాలేజి కి సంబంధించినంత వరకూ ..సరే ప్రస్తుతంలోకి వస్తే ...ఈ నామ్ అని పిలవబడే నామవరపు నాగేశ్వరరావూ నేను కలిసి నాలుగేళ్లు చదివి ,ఒక ఏడాది పని చేసాం ..పని అంటే మళ్లీ కొన్ని గుర్తొస్తాయి .. వీడి కి ఖంగారు ఎక్కువ ..మొదటి రోజు నేను , నామ్ , కెపి ముగ్గురం జాయినింగ్ రిపోర్టు ఇవ్వడానికి వెళ్ళాం..కెపి ఎవరో తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతున్నాడు ...అక్కడకి రావడానికి ముందే మాకు ఒక విషయం తెలుసు ..అక్కడ మాలో ఒకరిని షిఫ్ట్ ల్లో వేస్తారు అని ..ఉద్యోగం వచ్చీ రాగానే షిఫ్ట్ లలో పని చేయడం అంటే పెద్ద చిరాకు ..ముగ్గురికీ మనసులో పక్క వాడిని వేస్తే బావుండు అని ఉంది ..కానీ బయట పడటం లేదు అంతే ...కెపి వస్తే ముగ్గురం కలిసి వెళదాం అని మానేజరు, పైన చెప్పిన ఇంకో నాగేశ్వరరావ్, గది ముందు ఆగాం..అటు తిరిగి మళ్ళీ ఇటు తిరిగే సరికి నామ్ మాయమయ్యాడు ..ఎక్కడ పోయాడబ్బా అని చుట్టూ చూస్తున్నా ..పది నిముషాల్లో కెపి మాటలాపి వచ్చాడు .."వీడేడి రా " అన్నాడు .."ఏమో రా బొగ్గులో కలిసి పోయాడంటావా " అని నవ్వుకొన్నాం ..ఇంకో పదినిముషాలు చూసి సరే మనం పోదాం పద అని తలుపు తీయబోతుంటే , లోపల నుండి బిక్క మొఖంతో నామ్ వచ్చాడు బయటికి ...ఏమయింది అని అడగబోయి మానేజరు మా వైపే చూస్తుండటం తో లోపలకి వెళ్లిపోయాం ..మా ఇద్దరిని రేపటి నుండి జనరల్ షిఫ్ట్ లో రమ్మని ఆ రోజుకి వెళ్లిపోమన్నాడు మానేజర్ ..విషయం అర్ధమయ్యి నవ్వుకోలేక చచ్చాం ..నామ్ మాకన్నా ముందు వెళ్ళి మానేజరు ని మంచి చేసుకొని జనరల్ షిఫ్ట్ లో వేయించు కొందాం అని మాకు చెప్పకుండా మాయమయ్యాడు ..తీరా లోపలకి వెళ్లే సరికి నైట్ షిఫ్ట్ లో మనిషి తక్కువగా ఉన్నారు అని వేడి వేడి గా చర్చ జరుగుతుందట ..ఇకనేం సమస్యకి నామ్ ని పరిష్కారం చేసారు ..ఆ రోజంతా పాపం నామ్ ని ఏడిపిస్తూనే ఉన్నాం .. నైట్ షిఫ్ట్ ఇంచార్జ్ అయినందుకు పార్టీ కూడా పుచ్చుకొన్నాం ..మేము ఇవ్వాల్సింది పార్టీ :) ...తెల్లారి మేము జనరల్ షిఫ్ట్ లో పనేమీ చేయకుండా కాలం గడిపితే నామ్ నిద్ర పోడానికి కష్టపడ్డాడు ..మందు కొట్టి మరీ ...రెండో రోజు ఆఫీసు కి వెళ్లేసరికి హడావిడి గా ఉంది ..రాత్రి ఒక ప్రమాదం లో ఒకరు చనిపోయారు... పని బందు ..ఎవరినీ కదిలించేలా లేదు . విషయం నామ్ కి సరిగ్గా తెలుస్తుంది కదా అని వాడి కోసం వెదికితే ఎక్కడాలేడు ..ఆరా తీస్తే హీరో రాత్రి వచ్చిన గంటా రెండు గంటలకే నిద్రకి ఆగలేక రూమ్ కి వెళ్లిపోయాడంట ..పోయి వాడి రూమ్ తలుపులు బాది లేపాం ..కెపి చాలా సీరియస్ గా నిన్ను జియం రమ్మంటున్నాడు అని చెప్పాడు .."దేనికి ?" ఖంగారు గా అడిగాడు .."రాత్రి ఆక్సిడెంట్ అయింది ..ఒకరు చనిపోయారు ..షిఫ్ట్ ఇంచార్జ్ నువ్వే కదా అక్కడ ఎగిరి పడుతున్నాడు "అని చెప్పాడు .."అయినా ఒక వారం రోజులు సిన్సియర్ గా పని చేయొచ్చు కదా" అని చిరాకు మొహంతో అడిగేసరికి నామ్ కి ఇంకా ఖంగారు ఎక్కువ అయింది ..భయంలో బుర్ర పని చేయదు అనేది నిజం ..నిజానికి మేము ఇంకా ట్రైనీలమే కాబట్టి మాకేం సంబంధం ఉండదు ..కానీ వాడు నామ్ ,పైగా భయం లో ఉన్నాడు ..గబ గబా లేచి తయారయ్యి "సరే రా ఆఫీస్ కి వెళ్తా " అని వెళ్లాడు ..వాడిని వెళ్ళనిచ్చి మేము ఆఫీస్ కి ఫోన్ చేసి అక్కడ రాజు కి చెప్పాం ...వీడు ఖంగారు లో పెద్దాయన్ని కలిసి ఏం చెప్తాడో ..ముందే ఆపేయమని ...మేము పని లేదని పత్తాల ఆటలో పడ్డాం ..దాదాపు రెండు గంటల తరువాత రాజు కూడా వచ్చాడు .."నామ్ ఏమంటున్నాడన్నా?" అని నవ్వుతూ అడిగాం "ఏడిరా భాయ్ ? వస్తడన్నరు ..రాలేకద?" అన్నాడు .."కొంపతీసి పెద్దాయన దగ్గర పోయాడా?" అన్నాం "ఎహె లేదురా భాయ్ ..అసల్ వాడాపక్కకే రాకుంటే?" అన్నాడు .. మరి వీడు ఎక్కడకి పోయుంటాడు? టిఫిన్ చేయడానికి ఏమన్నా పోయాడేమో అని మేము ఆటలో పడ్డాం ..ఆ సాయత్రం మూడు సమయంలో కెపి రూమ్ లో బాతాఖానీ వేస్తుంటే కెపి ఫోన్ మోగింది .."నేనే కెపి ని ...సామురాయా? మా ఇద్దరివీ ఇక్కడే ఉన్నాయే.. నా నంబరా? " అంటూ మాట్లాడుతూ నా వైపు అయోమయంగా చూస్తున్నాడు ..అయిదు నిముషాల్లో ఫోన్ పెట్టేసాడు ..ఎవరు రా అంటే పోలీసు లు అన్నాడు ..అర్ధం కానట్టు మొహం పెట్టా .."ఖమ్మం రోడ్దులో సుజుకి సమురాయ్ కి ఆక్సిడెంటు అయిందట ..బండి నడిపే అతను స్ప్రుహలో లేడట ..అతని జేబులో నా ఫోన్ నంబరు ,పేరు ఊరు ఉన్నాయట "అన్నాడు ..మీ చుట్టమేమో అన్నా ..లేదు మామా మా చుట్టాల్లో ఎవరికీ సమురాయ్ లేదు అన్నాడు ..పోనీ ఫ్రెండ్స్ ? అన్నా ..ఫ్రెండ్స్ లో నీకు ఉంది కానీ నువ్వు నా ఎదురుగానే ఉన్నా..సగంలో ఆపేసాడు.. మిగతా సగం ఇద్దరి నోట్లో నుండి ఒకేసారి వచ్చింది "నామ్" ..వాడు కూడా పోయిన నెలలోనే కొన్నాడు ..పైగా పొద్దున నుండి వాడు మాయం ...హడావిడి గా బండి తీసాం ..కానీ అరకిలోమీటరు వెళ్ళాక అనుమానం వచ్చింది .ఓ సారి నామ్ రూం కి వెళ్లి చూద్దాం అని అటు తిప్పాం ..అక్కడ వాచ్ మాన్ ని అడిగితే "ఆ సారు ఇవాళ మొత్తం కనపడలేదు సార్" అన్నాడు ..వీడు ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు అని నామ్ రోజూ వెళ్ళే కొట్లు అన్నిటి దగ్గరా అడిగి చూసాం ..ఎవరికన్నా కనపడ్డాడేమో అని ...ఎవరూ చూడలేదు అన్నారు ...ఇలా కాదని బయలు దేరాం ..ఊరు దాటుటూ ఉండగా నామ్ వాళ్ల ఊరివాడు అటునుండి వస్తూ కనపడ్డాడు ..విషయం చెప్పి గానే "నాకు మధ్యాహ్నం పాలవంచ దగ్గర ఎదురయ్యాడు ..కానీ నేనూ ఆగలేదు తనూ ఆగలేదు "..అని చెప్పాడు ...అనుమానం కొద్ది కొద్దిగా బలపడుతూ ఉంది ..నామ్ వాళ్ల ఇంటికి ఫోన్ చేద్దాం అంటే వాళ్లకి ఫోన్ లేదు ..అప్పుడు ఆయన అన్నాడు ..వాళ్ల ఇంటి దగ్గర మెడికల్ షాపు ఉంది ..వాళ్లకి చేసి పిలిపిద్దాం అని ..చేసి వాళ్ల తమ్ముడిని పిలిపించాం ..మీ అన్న ఇంటికి వచ్చాడా అని అడిగితే వాడు మా అన్న ఇప్పుడు ఇంటికి ఎందుకు వస్తాడు అని ఎదురు ప్రశ్న వేసి మా అనుమానాన్ని మరికాస్త పెంచాడు ...కిం కర్తవ్యం అని ఆలోచిస్తుంటే రాజు అటువేపు వచ్చాడు ..విషయం ఇది అని చెప్తే ..సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కనుక్కొందాం , ఎస్సై మనకి తెలుసు అని తీసుకెళ్లాడు ..అక్కడ నుండి జిల్లాలో దాదాపు అన్ని పోలీసు స్టేషన్ లకి సమాచారం ఇచ్చారు ..ఇవాళ ఏ పోలీసు స్టేషన్ పరిధిలో అయినా సుజుకి సమురాయ్ ఆక్సిడెంట్ కేసు నమోదు అయిందా అని ..రెండు గంటల్లో అన్ని పోలీసు స్టేషన్ ల నుండి జవాబు వచ్చింది ..ఎక్కడా అలాటి కేసు రాలేదని ....కొంతలో కొంత నయం ..కానీ మనసులో పీకుతూనే ఉంది.. ఈ పోలీసులని ఎవడు నమ్మొచ్చాడు అని ..మా కళ్ళ ముందే వాళ్లు చేయగలిగింది చేస్తుంటే చూస్తూ కూడా..విషయం మెల్లగా ఊరంతా పాకింది ..పేపరోడు వివరాలు చెప్పమని ..మా ఆఫీసు లో కండొలెన్సు లకి సన్నాహాలు ...రాత్రంతా టీలు ...ఆలోచనలు ..గుర్తుకి తెచ్చుకోడాలు ..ఎప్పటికో తెల్లారు ఝామున నిద్ర పోయాం రాక పోయినా ..పొద్దున్నే ఫోన్ మోగింది ..కెపి ఎత్తి ఒక్క నిముషం ఆగి బూతులు తిడుతున్నాడు అవతల మనిషి ని ..తిట్ల ప్రవాహం ఆపి ఫోన్ పెట్టేసాడు .."వాడు వాళ్ల మామ కూతురితో మస్తు గా ఎంజాయ్ చేసిండంట రాత్రంతా ..ఇంటికి పోలే ..కాబోయే మామ ఇంటికి పోయాడట " కోపంగా చెప్పాడు మళ్లీ ముసుగు తంతూ ...
అద్గదీ ఆ నామ్ ఇప్పుడు ఫోన్ చేసాడు ..అంత దూరం నుండి ..."ఏంట్రా విషయం?" "ఏంలే సెల్ కొన్నా ..మొన్న రాజు కలిస్తే నీ నంబరు తీసుకొన్నా ..ఊరికే చేసా" కెపి ఆరోజు తిట్టిన దానికన్నా ఎక్కువ తిట్టేవాడిని ..కాని నిద్ర ముంచుకొస్తూ ఉంది ..రేపు చేస్తా పెట్టేయి అని పెట్టేయించి పడుకొన్నా ...
Posted by chava at 9:43 PM 2 comments
కొత్త టాలీవుడ్ ఫార్ములా :
మూడు హాలీవుడ్ సినిమాలు = ఒక తెలుగు సినిమా
Posted by chava at 8:34 AM 1 comments
కిరణ్ నన్ను tag చేసాడు ...ఆ ముక్క పక్కా తెలుగులో ఎలా రాయాలో తెలియలేదు ..దాదాపు 4 రకాలుగా మొదలెట్టి చివరికి ఇంగ్లీషు లో రాసా... విషయంలోకి వస్తే ...ప్రస్తుతం నా దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్య --చలం మొత్తం పుస్తకాలు ..దాదాపు ఓ 50 ఉంటాయి ..అవి తప్ప మిగతావి ఏమీ లేవు ..ప్రస్తుతం చదువుతున్న పుస్తకం ఇక్కడ ప్రస్తావించ వచ్చో లేదో తెలియదు ..ఎంచేతంటే అది technical book .. దానికన్నా ముందు చదివినది "Winning" by Jack Welch ... నచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి ..ఒక్కో రకానికి ఒక్కోటి చొప్పున చెప్పినా చాలా అవుతాయి ..నాకు నచ్చేవి జీవిత చరిత్రలు ..వాటిల్లో బాగా నచ్చింది ...గాంధీ ది ...గాంధీ ఒక నాయకుడి లా నచ్చక పోయినా ఒక మనిషిగా నచ్చుతాడు ..ఈ మధ్య కాలం లో చదివిన వాటిల్లో న చ్చింది ...మళ్లీ ఇదో కష్టమయిన ప్రశ్న :( ..ఝుంపా లహిరి రాసిన "The Namesake" ఏక బిగిన చదివేసా..అంత బాగా రాసింది ..
ఇప్పుడు ఓ అయిదుగురుని tag చేయమన్నాడు ...ఈ బ్లాగు చదివేది అయిదుగురే (అయిదుగురు లో కిరణ్ పోను నలుగురు :D)అని నా గట్టి నమ్మకం :) అంచేత ఓ నలుగురు పాఠకుల్లారా మీ మీ బ్లాగుల్లో మీకు నచ్చిన మెచ్చిన తెచ్చిన పుస్తకాల గురించి రాయండి ...
Posted by chava at 8:56 AM 1 comments
పదకొండు కోట్ల కుంభకోణానికి కాబోయే ఖర్చు 100 కోట్లు ...
అవెక్కడ మాయమయ్యాయో తెలియడానికి పట్టే సమయం దాదాపు 11 ఏళ్లు ...
Posted by chava at 6:58 PM 0 comments
"మీరు ఇంత సాధించారు జీవితంలో ..ఆ ఆనందం పంచుకోడానికి ఎవరూ లేరు "అని ఎప్పుడూ అనిపించలేదా?
"నేను సాధించిన దాన్ని గురించి గొప్పగా గానీ , ఆనందం గా గానీ నేనెప్పుడు feel అవలేదు ..మొన్నా మధ్య నాకు బెంగాల్ లో ---- (అవార్డు ) ఇచ్చారు ..అది మొత్తం దక్షిణ భారత దేశం లో "ముగ్గురికే "( ఒత్తి పలుకుతూ) ఇచ్చారు ...కానీ నేను అదేదో గొప్పగా భావించడం లేదు "
--- ఒక గొప్ప రచయిత్రి
Posted by chava at 10:14 PM 0 comments
"పోరి కత్తి ఉంది మామా" - ఒంటరిగాడు
" ఆ అమ్మాయి చాలా బావుంటుంది " - సంసారిగా మారాక
Posted by chava at 3:54 PM 0 comments
మాటలతో సమయమే తెలిసేది కాదు వాళ్లిద్దరికీ ఒకప్పుడు
ఒకరి పుట్టిన రోజు ఒకరికి ఏ యాహూ క్యాలెండరో గుర్తు చేయాల్సి వస్తుందిప్పుడు
Posted by chava at 2:52 PM 0 comments
బయట వాళ్లు ఆయన్ని చేతగాని వాడు అన్నప్పుడు వాళ్ల మీద అరుస్తుంది ఆవిడ ..
ఇంట్లో వివరం సవరం లేని పనులు చేస్తాడు అని ఆయన్ని అరిచేదీ ఆవిడే...
Posted by chava at 6:19 PM 0 comments
"నేనంటే నీకు ఎంత ఇష్టం"
"చాలా"
"చాలా అంటే ఎంత? "
"ఇంంంంత"
తెల్లారింది...అరుచుకోడాలు ,చిరాకులు , ఏడుపులు , కోపాలు ...మామూలే
Posted by chava at 8:42 PM 1 comments
రాష్ట్ర జనభాలో సరిగా తినడానికి తిండి లేని జనం - సుమారు ఒక కోటీ పన్నెండు లక్షల మంది ..
తెలుగుదనాన్ని లోకానికి చాటడానికి(పేద వాడి గుడిసె ని పోలిన వేదిక పై నుండి) నాలుగు రోజులకి ఖర్చు దాదాపు పన్నెండు కోట్లు ...
Posted by chava at 9:29 PM 1 comments
"ఈ రెండు నెలలు అమ్మా నాన్నలతో వీలయినంత ఎక్కువ సమయం గడుపు "
"ఏం ? అలా అంటున్నావ్?"
"మళ్లీ ఎప్పుడు వెనక్కి వెడతావో..వెళ్లినా హడావిడిగా ఉంటుంది.."
"నేను సరిగ్గా 8 ఏళ్లలో వెనక్కి వచ్చేస్తా ఎట్టి పరిస్థితుల్లో"
మనసులో ..."ఆ మాట విమానం ఎక్కిన రెండో గంట నుండి ప్రతి గంటకోసారి అనుకోబట్టి ఇప్పటికి ఆరేళ్లు అయింది "
Posted by chava at 10:27 AM 1 comments
సాగ్నిక్ రాసిన కొత్త post చదివాక నాకు మా కాలేజ్ లో సిద్ధడు ( సిదానంద్) చేసిన పని గుర్తొచ్చింది .. మొదటి రెండు సంవత్సరాలు కలిపి ౩ పేపర్లు డ్రాయింగ్ ఉండేది .. చదువయిపోయాక ఆ డ్రాయింగ్ అవసరం ఉద్యోగంలో రాదని చదివే మాకూ, చెప్పే పంతులు కీ తెలుసు..అయినా తప్పక చెప్పేవారు ..తప్పక మేము నేర్చుకొనేవాళ్లం ...అందులో సిద్ధడు రేపు పరీక్ష అనగా ఇవాళ రాత్రికి ఆ ప్రొఫెసర్ నే రేపు రాబోయే ప్రశ్నలకి సమాధానాలు అడిగే రకం ..పరీక్ష మొదలయింది ...సిద్ధడికి ..సుడి అంటారే అది ఎక్కువ ..వాడి ముందు వాళ్ల క్లాసు topper కూచొనేవాడు ..వాడి దాంట్లో రాసింది , గీసింది యధాతదంగా ఎక్కించి గట్టెక్కేవాడు ప్రతిసారీ ..ఆ సారి కూడా అదేపనిలో ఉన్నాడు ..పరీక్ష అయిపోయింది ...అయిపోయాక సిద్ధడికి ఒక అనుమానం వచ్చింది .." మామా ..మనం ఎప్పుడూ షీట్ కి అడ్డంగా ఇంటూ(X) గీతలు కొట్టిన గుర్తులేదు ..నువ్వేంది మరి పరీక్ష లో అలా కొట్టావ్? " అని అడిగాడు ...విషయం ఏంటో అర్ధం అయ్యి అందరం పడీ పడీ నవ్వుకొన్నాం...ఆ ముందు వాడు ఆ బొమ్మ తప్పు గీసి కొట్టేసాడు ..వెనక ఉన్న మనవాడు అది కూడా బొమ్మలో భాగం అనుకొని ఎక్కించేసాడు :D
update:
సిద్ధడు ప్రస్తుతం ఓ పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఎడిషనల్ మానేజర్ గా పని చేస్తున్నాడు
Posted by chava at 4:33 PM 0 comments
ఇచ్చిన గడువు ముగుస్తోంది ..గుండెళ్లో రైల్లు పరిగెత్తుతున్నాయ్ ఒక్కోడికి అన్నాడు కాకా ఇందాక ..అబ్బో మన నాయకులకి భయం అనేది ఒకటి ఉందే ఇంకా అనిపించింది ..రాములమ్మ కొత్త పార్టీ ..ఎమ్మెస్ కి కొత్త పదవి ...కొత్త ఆ పదంలోనే తప్ప మరెందులో కనపడటం లేదు ...కొత్త అంటే శేషన్ పెట్టబోయే కొత్త రాజకీయ బడిలా ఉండాలి .... నేను చదివే రోజుల్లో ఎందుకు పెట్టలేదా అని చింతిస్తున్నా..అప్పుడే అలాంటి బడి ఉండి ఉంటే ఈ పాటికి ఏ రాబోయే రాయలసీమ రాష్ట్రానికో ముఖ్యమంత్రి ని అయి ఉందును గందా ...
ఉచిత విద్యుత్ విధానం మీద ఉతికి ఆరేసాక, నీళ్ల ప్రాజెక్టుల మీద ఎండగట్టారు కొన్నాళ్లు..రాజకీయ హత్యలని విపరీతంగా ఖండించాక ఉపఎన్నికతో ఆ విషయాన్ని పాతేసారు..దేవుడి భూములపై రాద్దంతం శాఖా మార్పుతో కొండెక్కించ్చారు ..ప్రస్తుతం మున్సిపోల్స్ కై జనం పల్స్ పట్టడానికి కొత్త నాటకం స్క్రిప్టు తయారీలో అందరూ పూర్తి సమయం నిమగ్నమై ఉన్నారు ...తెర తీసాక మొదలవుతుంది..కానీ తెరవెనుక జరిగే తతంగం అసలు నాటకాన్ని తలదన్నేలా ఉంది ..డిల్లీ అయితే ఏం, హైదరాబాద్ గల్లీ అయితేనేం...రాములమ్మ రామన్న గూడెం అయితేనేం ...
Posted by chava at 9:23 PM 0 comments
ఒకోసారి మనం మనకి తెలిసింది , మనకి సరి అనిపించింది మాత్రమే నిజం అనుకొంటాము ..ఒకోసారి ఏంటి ఎప్పుడూ ..అప్పుడెప్పుడో ఫారూఖీ , గ్రాఫిక్స్ లో చెప్పినట్టు మనకి కనపడేదే నిజం అని ..వెంటనే నేను అడిగిన ప్రశ్న ఆ నిజమనేది మాత్రం మనకెలా తెలుస్తుంది అని ..ఇంతకీ చెప్పొచ్చేదేమంటే ఎవడేమి అనుకొంటే మనకేంటి అన్నట్లు ఉండమని :D పక్క వాడికి ఇబ్బంది కలగనంత వరకు ..వాడికి ఆ ఇబ్బంది మనవలన కలగక పోయినా మనవలనే అని వాడు అనుకొంటే మనకొచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ఏమీ లేదు ...అంచేత ...
Posted by chava at 5:25 PM 0 comments
ఒకప్పుడు సినిమాలో నాయక -కీ లు గోరు ముద్దలు తినిపించుకొనేవారు ..కొన్నాళ్లకి ఒకే కొబ్బరి బోడం లో straw వేసుకొని తాగే వారు ..ఇంకొన్నాళ్లకి కూల్ డ్రింకు పంచుకొనేవారు ..ఇప్పుడు ఒకటే సిగిరెట్టు పంచుకొంటున్నారు :D
Posted by chava at 9:36 PM 0 comments
అలాస్కా లో అట్టూ స్టేషన్ అనే ఊర్లో జనాభా 13 :( పదముగ్గురిలో ఒకరు డాక్టరు , ఒకరు పోస్ట్ మాన్ , ఒకరు కిరాణా కొట్టు వాడు అయి ఉండాలి . మిగిలిన పది మంది ఎవరు అయి ఉండొచ్చు?
Posted by chava at 8:48 AM 2 comments
పాఠక్ నిన్న అంటున్నాడు " అన్నా , మనం మొదట తిండి కోసం అని పైసలు సంపాయించడం మొదలెడతాం ..పైసలు ఎక్కువ సంపాయిస్తున్న కొద్దీ తిండి తినడం తగ్గిపోతుంది ..దాని గురించి పట్టించుకొనే సమయం కూడా ఉండదు ఒకోసారి " అని ..ఎంత నిజం :) వాడిది రోజుకి 24 గంటలూ పని చేయాల్సిన ఉద్యోగం మరి ..ఇంకో నిజం ..బరువు తగ్గడానికి తక్కువ కాలేరీలు ,తక్కువ కార్బోహైడ్రేట్ లు ఉండే వస్తువుల ధర ఎక్కువ :D
Posted by chava at 9:44 AM 1 comments
అందరికీ ఒకేసారి గాంధీ గుర్తొచ్చాడు ...కాకపోతే గాంధీ చెప్పిన విషయాలు గుర్తు రావాల్సిన సమయంలో మాత్రం రావు ...ఒకరిని ఒకరు తిట్టుకోడానికి గాంధి సాక్ష్యం కావాల్సి వచ్చింది ...ఒకరేమో నిజం చెప్పించు అని , మరొకరేమో హింస ఆపించు అని మాటలు రాని చేతలుడిగిన గాంధి బొమ్మకి మొరపెట్టుకొన్నారు ..అది కూడా పక్కనోడు మారాలని ..తప్పితే మనం మారుదాం గాంధి చెప్పిన బాట లోకి అని అనుకోలేదు ..కనీసం వారికి బాగా అలవాటయిన జనాన్ని నమ్మించడం అనే కళ లో కనీసం ఆ దిశ లో ప్రయత్నం కూడా చేయలేదు ..
అయినా జనానికి బుద్ది లేదు ...దేనికి పడితే దానికి ఎగేసుకొని బయలు దేరడం దేనికో? నామినేషన్ కి , విజయోత్సవ సభలకి అంతలేసి మంది పోకపోతే వచ్చిన నష్టం ఏమిటో? నామినేషన్ వేసిన వాడు ఓట్లు అడుక్కొంటూ రేపెలాగూ మన ఇంటికి వస్తాడు కదా ..అప్పుడు రద్దీ లేకుండా తీరిగ్గా చూసుకోవచ్చు కదా? విజయోత్సవ సభ ఎలాగూ పేపర్లలో , TV లలో చూసి తరించొచ్చు కదా? ఏం జనమో ఏమో ...
Posted by chava at 2:50 PM 1 comments
ఇది పరీక్షా ఫలితాల సమయం...నేను పేపర్ లో ఆత్మహత్యల వార్తల కోసం వెతుకుతున్నా :( ...అనుకొన్నట్టుగానే ఇవాళ కనపడింది ...ఆరుగురు ప్రయత్నించారని :( ఆ తరువాత పైన రాంకులు వచ్చిన వాళ్ల వివరాలు , మార్కులు చూసా ..కళ్లు చెదిరే అద్భుత ప్రతిభ ? ఎలా వస్తున్నాయి నూటికి నూరు ? అది కూడా ఇంగ్లీషు , తెలుగు ( పేరుకు సంస్కృతం అయినా రాసేది తెలుగేగా) లలో? మా అప్పుడు మాకు పాఠాలు చెప్పింది కూడా అదే పంతుళ్లు కదా? అవే పాఠాలు కదా? మాకు అర్ధం కానివి ఇప్పటి పిల్లలకి అర్ధం అవుతున్నాయా? లేక పరీక్ష ఎలా రాయాలో మాకన్నా బాగా తెలుసుకొన్నారా?
Posted by chava at 9:33 AM 1 comments
గత కొన్ని రోజులుగా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తున్నా ...ఆ పని ఇక్కడ ఒక post రాయడం ...ఆ పోస్ట్ ఎలా ఉండాలంటే ...నాకే పరిమితం కావాలి ...అది వేరెవ్వరికి సంబంధించింది కాకూడదు ...ప్రత్యక్షం గా కానీ పరోక్షం గా కానీ ...నేను నాతో మాత్రమే ఉన్నప్పుడు జరిగింది ..ఎక్కడైనా చూసింది , విన్నది కాకూడదు ...చదివిన విషయం కూడా కాకూడదు ...నా స్వంతం అయినది అయి ఉండాలి ..అది రాసేప్పుడు నా బుర్రలో ఎవరి గురించి ఆలోచనలు రాకూడనిది అయి ఉండాలి ...అది కష్టం అని తెలిసింది ...దానర్ధం "నేను" అనేదే లేదు అనా? అయి ఉండొచ్చు ...కానీ ఉందని తెలుస్తూనే ఉంది ...ఎంచేతంటే నేను లేక పోతే మిగతావి లేవు ...ఉన్నది నేను ఒక్కటే...దాని చుట్టు అల్లుకొన్నవే మిగతావన్ని ...
ఇంతకీ ఈ పోస్ట్ పైన చెప్పిన లక్షణాలన్ని కలిగి ఉన్నట్టుంది :D
Posted by chava at 10:58 AM 8 comments
మెళుకువ వచ్చింది ...అప్పుడే ఆరయిందా అనుకొంటూ టైము చూస్తే 3.40 అవుతుంది ..మెళుకువ ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నా ...ఇది రైలు వెళ్ళే టైము కూడా కాదు ..నాకు కలలు రావు అని గట్టి నమ్మకం ..మరెందుకు లేచా ఎటూ కాని టైములో ...సన్నగా వినబడుతుంది ...గత అయిదారేళ్లుగా వినబడని శబ్దం ...చిన్న పాప ఏడుపు ...ఆ శబ్దం ఏంటో అర్ధమయ్యాక బిగ్గరగా వినబడుతోంది ...పక్క అపార్ట్ మెంటు లో నుండి ..చాలా కష్టం గా ఉంది వినడం ...బహుశా ఏడుపు అంత బాధతో కూడుకొన్నది విని చాలా కాలం అయి ఉండటం వల్ల కావొచ్చు ...పాపం ఆ పాపకి ఏమి బాధో ...అంతలా ఏడుస్తుంది ...అమ్మ భుజం మీద వేసుకొని ఊరుకో అని ఊరడిస్తూ ఉండి ఉంటుందా? ఒక్క ఏడుపు మాత్రమే వినబడుతుంది అంత నిశ్శబ్దంలో ...ఇక ఆపుతుంది , ఇప్పుడు ఆపుతుంది అని అనుకోబట్టి దాదాపు 45 నిముషాలు అయిందని మళ్లోసారి టైము చూస్తే అర్ధం అయింది ...దాదాపు గంట నుండి పాప ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకొన్నట్లు లేరే? కారు స్టార్టు అయిన శబ్దం...అమ్మయ్య హాస్పిటలు కి బయలు దేరారేమో ...కారు వెళ్లి పోయింది ..పక్క ఇంట్లో పాప ఏడుపు ని వదిలేసి ..వెళ్లి తలుపు కొట్టి ఏమన్నా హెల్ప్ కావాలేమో అడిగితే? ఇంత రాత్రి ఎవడో ముక్కు మొహం తెలీని వాడు వెళ్లి తలుపు తడితే తీసి మాట్లాడే రకాలు కాదీ ఈ జనం..పైగా పోలీసు ని పిలిచినా పిలుస్తారు.పాప ఏడుపు ఏ మాత్రం తగ్గకుండా అలానే ఉంది ..ఏమయితే అదవుతుందని లేచి బయలు దేరా..ఈ అవతారం లో చూస్తే ఖచ్చితంగా భయపడతారని తల దువ్వుకొని , బట్టలు సరి చేసుకొని బయటకి వచ్చా...చలి వణికిస్తుంది ...ఏడుపు వినిపిస్తున్న ఇంటి వైపు నడిచా ..అంతలా ఏడుస్తున్నా ఆ ఇంట్లో లైటు వెలగడం లేదు ..అంటే అందరూ ఏడుపు వినిపించనంత గాఢ నిద్రలో ఉండి ఉంటారా? మెట్లదాకా వెళ్ళాక వాళ్లు నన్ను చూసి భయపడతారేమో అని నాకు భయం వేసింది ..వెనక్కొచ్చి ఫాన్ ఆన్ చేసి పడుకొన్నా ... పరిచయమయిన శబ్దం కాబట్టి నిద్ర పట్టింది ...పొద్దున్నే మళ్లీ లేవగానే పాప ఏడుపు గుర్తొచ్చింది ..ఇంకా ఏడుస్తుందా అని విన్నా ...ఆపేసింది :) ...కానీ వీలయితే ఆ పాప ఎవరో చూడాలి ఓ సారి...
Posted by chava at 9:46 AM 1 comments
మొన్న నాలుగో తారీఖున ప్రియతమ ప్రధాని "రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన"అనబడే ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తూ 2009 కల్లా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తాం అన్నారు . 2009 న మళ్లీ ఈ బ్లాగు చూడాలి ఓ సారి గుర్తు పెట్టుకొని ...నాకో ఆలోచన వచ్చింది మన నాయకులు చేసే వాగ్దానాలన్నిటిని ఎక్కడన్నా బ్లాగు లో ఉంచితే బాగు :)
ఆలోచన అంటే ఇంకో ఆలోచన కూడా వచ్చింది ..ప్రస్తుతం చర్చల సీజన్ నడుస్తుంది ..అన్నలతో చర్చలు , మందుల షాపుల వాళ్లతో చర్చలు , వర్తక సంఘాలతో చర్చలు ..చర్చలు జరిపే ఒక consulting లేదా outsourcing కంపెనీ పెడితే మంచి గిరాకీ ఉండేలా ఉంది ..
TV పెడితే చాలు పోప్ గురించే ఏదో ఒకటి ..మనుషులంతా ఒక్కటే..కానీ దేవుళ్లే వేరు..పోప్ జీవితం నుండి నాకు అర్ధం అయింది అది .
Posted by chava at 11:48 AM 0 comments
విజయవాడ - అలంకార్ రెస్టారెంటు
కడుపు నిండుగా తినేసి చేయి కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గరకి నడిచా ...చేయి కడుగుతూ ఉండగా వచ్చాడు వాడు ..పది పన్నెండు మధ్య ఉంటుంది వయసు ..పక్క వాష్ బేసిన్ కడుగుతున్నాడు ..చుట్టూ విషయాలేమీ పట్టనట్టు పాట పాడుకొంటూ వాడి పని వాడు చేసుకొంటున్నాడు ..." నీ పేరేంట్రా?" అడిగా .."రాము సార్ " .."ఏ ఊరు ?".."పొన్నూరు " ..."నీకు ఎన్నేళ్లు రా?" "పద్దెనిమిది సార్ " నవ్వుతున్నాడు ..కాదని నాకు తెలుసని వాడికీ తెలుసు అనేది ఆ నవ్వులో కనపడింది ..."చదువుకొన్నావా?" "మూడు దాకా చదివా సార్" ..ఆ విషయం మాట్లాడటం వాడికి ఇష్టం లేనట్టుగా మొహం లో భావాలు మార్చేసాడు ..చదవలేక పోయా అన్న బాధేమో అనుకొన్నా .."చదువు చెప్పిస్తా చదువుకొంటావా?" అడ్డంగా తల తిప్పాడు ."ఏం?" "చదువు నాకు ఇష్టంలేదు సార్ ...నాకు పనే ఇష్టం..ఇది కాకపోతే ఇంకోపని , నాకు ఇష్టం అయింది చేస్తా ..బడికి పోను..నాకు నచ్చలేదు బడి " ....వాడి పని అయిపోయింది ...వెళ్లి పోయాడు లోపలకి ...
చదువు ని పిల్లలకి ఇష్టమయ్యేలా ఎప్పటికి చెప్తారో ??? చదువంటే 8 గంటలు పిల్లలకి జైలు ,పెద్దలకి స్వేచ్చ లా అయింది ..చెప్పిందే చెప్పడం ..రాసిందే రాయడం ..ఇరుకు ..ఉక్క ..నిశ్శబ్దం ..బెత్తం దెబ్బలు ...పరీక్షలు ...రాంకులు ...గొప్పలు ..తిట్లు ...చావులు ...ఇదీ పరిస్థితి....
Posted by chava at 1:49 PM 5 comments
రైలు మరి కాసేపట్లో వస్తుందని వినబడి అమ్మయ్యా అనుకొన్నా ..వినబడినప్పుడు నేను కాకుండా ఇంకో యాభయి మంది ఉన్నారు ప్లాట్ ఫారం మీద ..కనబడే సమయానికి దాదాపు అయిదు వందలమంది అయారు ! ముందుగానే చెప్పారు ఈ రైలుకి చాలా మంది ఉంటారు అని ..రైలు భారీగా నిట్టూరుస్తూ ఆగింది ..అరుపులు కేకలు పరుగుల మధ్య నేను కూడా ఎక్కా...ఇదే మొదటి స్టాపు కావడంతో సీట్లు ఖాళీ గానే ఉన్నాయి ..నేనెక్కిన పెట్టె లో అందరూ ఇరవై ఏళ్ళకి మించని వాళ్లే ...నేను ఆలోచిస్తున్నా ..ఇక్కడ ఏ కాలేజి ఉందా అని ..."పొట్టోడా ,నత్తోడా రా?" అని నా పక్కనున్న కుర్రాడు తలుపు దగ్గరున్న వాళ్లని అడిగాడు..వాళ్లు ఇతనిని పట్టించుకోకుండా వాళ్ల కబుర్లలో ఉన్నారు." అబే ,నీయబ్బ రవిగా ఎవడొచ్చాడు అంటే చెప్పవేంది బే " -- "నీ మామ వచ్చాడు " అందరూ గట్టిగా నవ్వారు . "వాడైతే వాకే ..సట్టోడు అయితే అయిదు రూపాయలు బొక్క " అని నా పక్కనే కూచొన్నాడు ..చేతిలో పుస్తకాలు లేవు ..కానీ అన్నం కారియర్లు ఉన్నాయి అందరి దగ్గరా ..కాళ్లకి స్లిప్పర్లు ..దాదాపు అందరి చేతుల్లో రుమాళ్లు ..జేబులో దువ్వెన ... వీళ్లు చదువుకోడానికి రాలేదని అర్ధం అయింది ..." ఏ ఊరు " అని అడిగా ..."బోనకల్ సారు " అన్నాడు .. "మీదే ఊరు సారు ?" చెప్పా.."ఏం చేస్తారు మీరంతా " .."క్వారీ పనికి పోతాం సారు" .."చదువుకొన్నావా? " "పది పాసయి ఆపేసిన " "ఏం?" " పొలం పండలే ..అప్పులు చేసినం ..అక్క పెళ్లి చేసినం..తమ్ముడు చదువుతున్నాడు .. మా నాన్న ఒక్కడితో ఇళ్లు నడుస్తలేదు ..అందుకే ఈ పనికి పోతున్నా" .."ఎంతిస్తారు రోజుకి?" " ఇస్తారు ఎనభై దాకా ..ఎక్కువ బళ్లు నింపితే ఎక్కువొస్తది ..కానీ కష్టం అయితది " "పనిలో బూట్లు ఇవ్వరా?" " బూట్లా? " తల అడ్డంగా తిప్పాడు ..ఎప్పుడో చదివిన లెజిస్లేషన్ గుర్తొచ్చింది ..కాని అది వాడికి అర్ధం కాదని నాకర్ధం అయింది .."మరి ఇంకా చదివితే వేరే మంచి పని చేసుకోవచ్చు గా?" "అప్పటికి ఆ ఉన్న నాలుగెకరాలు కూడా అమ్మాలి సారు ..అప్పుడు అంత చదివి ఏ ఉద్యోగం రాక పోతే చేసుకోడానికి ఆ పొలం కూడా ఉండదు " నవ్వుతూ చిన్న విషయం లా తేల్చేసాడు ."ఒరేయ్ ..సట్టోడు కూడా ఉన్నాడు" తలుపు దగ్గర నుండి కేక ...మొహంలో మార్పు ..."థూ దీనవ్వ ..ఇప్పుడు వీడికి 10 బొక్క " గొణిగాడు ..."టికెట్ కొనలేదా?" " లేదు సార్ ..వచ్చే ఎనభై లో రాను పోను 10 పెట్టి టికెట్ కొంటే ఎట్ల సారు ...నెలకి మూడు వందలైతే తమ్ముడి స్కూలు కి ఫీజు కైనా ఉంటయి " "మరి పట్టుకొంటే?" " పట్టుకొంటే తలకి పది వసూలు చేస్తడు సార్ " అదేదో మామూలు విషయం అయినట్లు చెప్పాడు ..." వస్తుండారా? ఏ పెట్టి లో ఉన్నడు? " " రాలేదు లే బే ..ఊరికినే అన్నం.." "&****& &***& " బూతులు తిడుతూ తలుపు దగ్గరకి పోయి వాళ్లతో కలిసాడు ...బోనకల్ రాబోయే ముందు వచ్చి కారియర్ తీసుకొన్నాడు ..500 తీసి ఇవ్వబోయా ...అర్ధం కానట్లు చూసాడు ..."తీసుకో మీ తమ్ముడికి ఫీజు కట్టు " " వద్దు సార్ ..అట్ల తీసుకొనేటోడి నైతే ఇదే రైళ్ల అడుక్కొంటూ బతికేటోడిని గద ..పోతున్న సారు " అని తలుపు వైపు నడిచాడు ...
Posted by chava at 11:49 AM 2 comments
నరేంద్ర మోడీ కి అమెరికా వీసా ఇవ్వలేదని పెద్ద లొల్లి ...సంతోషించిన వాళ్లు చాలామంది ...రానీయకుండా చేసాం అని తలెగరేసుకు తిరిగే వాళ్లు కూడా చాలామంది ...బావుంది ... మోడీ రెచ్చి పోయి గాంధీ తో తనని తాను పోల్చుకోడం ఇంకా బావుంది ...గాంధీ కి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఏం చేసేవాడు? మరో నిరాహార దీక్ష?మనమెప్పుడూ మనకి మనం శిక్ష వేసుకోడం , మనవాడిని మనం వెనక్కి లాగి సంతోష పడటం ...ఇరాకు లో వేలమందిని చంపి, చంపుతున్న అమేరికా వాళ్లని ఎన్ని దేశాలు రాకుండా అడ్డుకొంటున్నాయి? అంతమాత్రాన మోడీ ది తప్పులేదని కాదు.కాకపోతే చెప్పేవాడు తను చేసేపనే ఇంకొకడు చేయడం తప్పు అని చెప్పడం ఎంత వరకు సమంజసం?
ఇప్పుడు కాసేపు ఛాతీ ఉప్పొంగే విషయాల కోసం:India Rising 1995-05
Posted by chava at 10:02 PM 2 comments
పని పని పని ...వారం రోజులుగా ఒకటే పని :)
పని మధ్యలో బయటకి వెళ్ళా...ఇవాళ మరీ ఎండగా లేదు ...కానీ ఇవాళ గాలి బలంగా వీస్తుంది అని నిన్న TV లో చెప్పారు ..ఈ ఊర్లో గాలి ౩౦ mi/hr ఉంటుంది ఒకోసారి ... బయట Al పని చేస్తున్నాడు రోజూ చేసే పనే ... వాతావరణం బావుంది కదూ అని అడిగా ...ఆ ప్రస్తుతానికి బానే ఉంది ..గాలి వస్తే ఇప్పటి వరకూ నేను శుభ్రం చేసిందంతా పోయి , గత వారంగా నేను అసలు పని చేయనట్టు కనపడుతుంది అని వాపోయాడు ...ఓ సారి హైదరాబాద్ దూరదర్శన్ "వాతావరణ వివరాలు" గుర్తొచ్చాయి ...అన్ని ఉపగ్రహాలు పైకి ఎగరేస్తున్నారు .. అయినా రైతు కి వాన ఎప్పుడు పడుతుందో ఖచ్చితం గా వివరం ఇవ్వలేరు ..ఎంచేత?
Posted by chava at 5:47 PM 2 comments
తాతయ్యా,
వారం రోజులుగా చేయాలి చేయాలి అనుకొంటూ ఇవాళ ఫోన్ చేసా నీకు ...నాకు తెలుసు నువ్వు మాట్లాడవని...నాకు తెలుసు నీకు నాతో మాట్లాడాలంటే ఇష్టం ఉండదని ...కానీ నువ్వు చెప్పిందే కదా మనకి కష్టంగా ఉన్నా కొన్ని పనులు చేయక తప్పదని ...నువ్వు మాట్లాడనప్పుడు అక్కడ నేను మాట్లాడటానికి ఎవరూ ఉండరని, ఉన్నా వాళ్లతో మాట్లాడటానికి ఏమీ ఉండదని నాకూ తెలుసు ...నీకూ తెలుసు ...నీకు కోపం ఉండటంలో న్యాయం ఉంది.. నీకు నా మీద కన్నా నీమీదే ఎక్కువ కోపం అని నాకు తెలుసు.. నీకంటూ ఎవరూ లేకుండా అయిపొయారని నీకు బాధ .. నీ రెక్కల కష్టంతో పైకొచ్చిన అందరికీ రెక్కలొచ్చి ఎగిరిపోయారని నీకు చాలా బాధ...నీకు తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి నీ చేత్తో నువ్వు పెట్టాల్సి రావడం భరించలేని బాధ ..కానీ బాధని ఎప్పుడూ ఎదుటి వారికి చూపించొద్దు అని చెప్పే నువ్వు అది మాకు చూపించకుండా ఉంటానికి ఎంచుకొన్న మార్గం మాతో మాటాడక పోడం...నువ్వు మాటాడక పోయినా నీ బాధ నాకు తెలుస్తుంది తాతా ..అది నువ్వు నాకు నేర్పిన అనేకానేకాల్లో ఒకటి ..నేను నిన్ను మరచిపోయా , పట్టించు కోడంలేదు అనుకొంటున్నావా తాతా? నీకు మిగిలిన కొడుకుతో పాటు నన్ను కూడా వాళ్ళతో జమకట్టేసావా? అయినా పర్లేదు ..ఎదుటి వాళ్ళు మనని ఎలా అయినా అర్ధం చేసుకొనే స్వేచ్చ వాళ్లకి ఉంది అని నువ్వేగా నాకు చెప్పేవాడివి ..ఆ స్వేచ్చ నీకు కూడా ఉందిలే ... నాకు అన్ని గుర్తే ఉన్నాయి తాతా...నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టిందని నన్ను దత్తత తీసుకోడానికి నువ్వు చేసిన గొడవ ...ఇంట్లో అందరు ఎవరి పనుల్లో వాళ్ళుండి నన్ను పట్టించుకోక పోతే , పొలం నుండి వచ్చిన నువ్వు , ఏ మాత్రం విసుక్కోకుండా నా ముడ్డి కడగడం...నాకు ఇష్టమని భూక్యా గాడిని పనులన్ని మానిపించి వాడి నెత్తిన నన్ను మోసే పని వాడికి అప్పజెప్పడం ...నాకు నత్తి పోడానికి తేనె కోసం అడవంతా తిరిగి తేనెపట్లు తెప్పించడం...పొద్దు పొద్దున్నే మూడున్నరకి నువ్వు లేచి , అందరు పని వాళ్లు ఉన్నా , పొలికట్టె పట్టుకొని ఊడవటం ... ఒక్కొక్క ఆవుకు ఒక్కో పేరు పెట్టి మా చేత వాటిని పిలిపించడం ... ఆవు దూడకి , నాకూ "బుజ్జిగాడు" అనే పేరే పెడితే నేను గొడవ చేయడం ...
ఎలా మర్చిపోతా అనుకొన్నావ్ అవన్నీ?నన్ను నీ వెంటేసుకొని ఇంటి చుట్టూ తిరిగి మనం నాటిన తాటి చెట్లని చూడు ఓ సారి ...అవి పెరిగే దెప్పుడు , ఆ కల్లు మనిద్దరం కలిసి తాగేదెప్పుడు అని అడిగే నేను కనపడటం లేదూ? ఒకసారి తల పైకెత్తి ,ఎర్రటి ఎండలో మామతో కలిసి , పైకెక్కి నేను కొట్టిన రీపరు ని చూడు ..బొబ్బలెక్కిన చేతులకి నీతో నూనె రాయించుకొనే పండు గాడు కనపడటం లా? ఎండాకాలం లో ఒక్కసారి ఇంటి వెనుక ఉన్న చింత చెట్ల వైపు వెళ్లు ...నేను తగలేసిన గడ్డి వాము ఆనవాళ్ళు లేవూ అక్కడ? ఇంక నేను నిన్ను నువ్వు నన్ను మరచిపోడం ఏంటి?
ఇప్పుడే కాదు తాతా ఎప్పటికీ అది సాధ్యం కాదు .. నువ్వు నీ ఆఖరు దశలో ఉన్నావన్న విషయం రాత్రి నాకు అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి అర్ధం అయింది ...నువ్వు ఇంకొన్నాళ్ళే ఉంటావన్న నిజం నీకూ తెలుసు ...నాకూ తెలుసు ..అయినా నాకు బాధ అనిపించడం లేదు ...ఎందుకో తెలుసా? నీకూ నాకూ చావులు బాధ లు కలిగించడం మానేసాయి ..నీకు నీ పెద్దకొడుకు , నాకేమో నీ చిన్న కొడుకు ..వాళ్లిద్దరూ మనని వదిలేసి వెళ్లి పోయి .. ఒక మనిషి మనతో లేక పోయినా మనం మాములుగానే బతకగలం అని చూపించారు ...మన ఇంట్లో ప్రస్తుతం ఎందరికి వాళ్లు ఏ రోజు పోయారో గుర్తుంది? అందుకే నాకు నువ్వు పోతావ్ అన్నా బాధ కలగడం లేదు...అయినా నువ్వ్ పోవచ్చు కాని నీ గురించిన ఆ ఙాపకాలు ఎక్కడికి పోతాయి?
Posted by chava at 1:18 PM 2 comments
Martha lost 40 lbs in the prison .. thats the news every where today .. but at what cost? 10 months prison?? 30000$ fine ?? that shd be ok .. she made 45K out of that deal anyway :)
Posted by chava at 6:43 PM 1 comments
"Life" in four words or two sentences etc etc:
"Create Problem : Solve it"
Posted by chava at 7:36 PM 0 comments
I was on this flight last night and was sitting in the Exit row. I never paid any attention to what those women say or do during the take off, but as i was next to the exit i had to. I was reading the safety instructions booklet . some where it goes like"If you are sitting in an exit row , u must identify ur self with the flight attendant if u cannot read, understand, speak english":(
Posted by chava at 8:18 AM 0 comments
కొందరు "గొప్పవారు" చెప్పినవి - నాకు అర్ధ మైనట్లుగా :
బుద్ధుడు - "ఆత్మ అనేదే లేదు .దేన్నని నువ్వు ఉంది అనుకొంటున్నావో అది "నీ" కల్పన.ఆ కల్పన అన్ని బాధలకి మూలం"
వివేకానంద - "నువ్వు ఉన్నావు .నీకు కొన్ని కోరికలు ఉంటాయి.వాటిని అనుభవించడంలో తప్పులేదు. కానీ ఆ అనుభవాన్ని అక్కడితో వదిలేయి.నీతో పాటు మోసుకు తిరగకు"
రమణ - " నువ్వు అనేది ఏంటో తెలుసుకో . తెలుసుకొన్నాక ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదు"
UG- "దేన్నైతే ఉందని నువ్వు అనుకొంటున్నావో ఆ ఉందనే జ్ఞానం నీకు ఎవరో చెపితే వచ్చింది తప్ప నీదంటూ ఏదీ లేదు"
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే -- చెప్పడానికీ , వినడానికీ ఏమీ లేదు :D
Posted by chava at 11:34 AM 1 comments
Page 3 చూసా...ఎందుకో రామనాధం గుర్తొచ్చాడు...రామనాధం కి మొహమాటాలు , నటించడాలు ఏమీ తెలియవు ..వాడి పని వాడు చేసుకుపోయేవాడు ... చేసినంతసేపు చేసి వాడికి చిరాకేసినప్పుడు ఎవరిదో ఒకరి రూమ్ తలుపు కొట్టేవాడు ..."ఓ పది రూపాయలివ్వు సార్" అని తలగోక్కుంటూ అడిగేవాడు ...దేనికిరా అంటే "మందు కొట్టాలి సార్ " అనేవాడు ...ఒకొకప్పుడు "సామ్రాజ్యం దగ్గర పోవాలి సార్ " అనేవాడు ... అవే పనులు కొంచెం సమాజంలో ఒక గౌరవమైన (??) స్థాయిలో ఉన్న వాడు కూడా చేస్తాడు ..కాని అంత మొహమాటం లేకుండా చెప్పగలడా? ఎందుకీ తేడా? నాకు గుర్తుండి రామనాధాన్ని ఇష్టపడని వాడు ఎవడూ లేడు మరి ..
Posted by chava at 9:48 PM 1 comments
quick break from work coz i need to post this :D
boss was here discussing a design issue ... he was explaining something on the whiteboard ...he stopped and turned to us asking how many alphabets do we have in our language. we said 56 .. he goes " aha .. that explains it .. we have only 26 and they sound different every time :) . why cant i spell phonetic as fonetik? some times it sucks big time to remember all the spellings :D "
dad r u listening???? :D
guess which word hes trying to spell now --- "receipt" :D
Posted by chava at 3:11 PM 0 comments
"What is necessary for man is to free himself from the entire past of mankind, not only his individual past. That is to say, you have to free yourself from what every man before you has thought, felt and experienced -- then only is it possible for you to be yourself. The whole purpose of my talking to people is to point out the uniqueness of every individual. Culture or civilization or whatever you might call it has always tried to fit us into a framework. Man is not man at all; I call him a 'unique animal' -- and man will remain a unique animal as long as he's burdened by the culture"
now i know why they dont like ppl like u UG..but do u ? :)
Posted by chava at 10:20 PM 0 comments
ఎందుకు మనిషి బాధ ని బయటకి చెప్పుకోవాలని తపన పడతాడు? సానుభూతి కోసం? పక్క వాడు సాధారణంగా "take is easy... thats called life ... life goes on blah blaah " అంటాడు నూటికి తొంభై శాతం .. అలా అంటే బాధ లో ఉన్నవాడికి , ఓ నేనొక్కడినే కాదు ..నాతో పాటు చాలా మంది ఉన్నారు అన్న భరోసా? ఎవరు చెప్పారో , ఎందుకు చెప్పారో , ఎప్పుడు చెప్పారో ... చెప్పుకొంటే తగ్గుతుంది అని ...ఈ బాధ పడేవాళ్లు రకరకాలు ... కొందరికి కొన్ని గంటలు , రోజుల్లో పోతుంది ..కొందరు అదే పనిగా తలచుకొని , తవ్వుకొని , తెగ పడుతూ ఉంటారు బాధ. పక్క వాళ్లేమో , సర్లే అని ఊరుకోరు ..మర్చిపో ...త్వరగా మామూలుగా అవ్వు ..అలా కాకుండా ఇలా చేయి .. నేనున్నా నీతో ...నేను కూడా అలాంటి పరిస్థితి లు ఎదుర్కొన్నా ...blah blah blaah ...ఇది నడుస్తూనే ఉంటుంది ..ఈ తరహా వాళ్లతో ...ఇంతకీ నాకు దేనికి ఈ బాధ???
Posted by chava at 9:18 PM 1 comments
ఇవాళ ఒక సినిమా చూసా ...పేరు అనవసరం...ఎంచేతంటే ఈ మధ్య ఏది చూసినా ఒకేలా ఉంటున్నాయి కాబట్టి :) సినిమా మొత్తం వీరోయిన్ మోడ్రెన్ డ్రెస్సులు వేస్తుంది ..ఒక్క సీన్లో మాత్రం , గుడికి వెళ్లినప్పుడు, లంగా ఓణీ లో కనపడుతుంది...ఒక్క క్షణం ఆలోచించా...నిజంగానే గుడికి అమ్మాయిలు మోడ్రెన్ డ్రెస్సుల్లో రావడం ఎప్పుడూ చూడలేదు ..ఎంచేత? గుడికి అనగానే ఇంట్లో పెద్దలు సాంప్రదాయబద్ధంగా తయారవమంటారా? అవునేమో...లేదా గుడికి కూడా మోడ్రెన్ డ్రెస్సుల్లో వస్తారా?
Posted by chava at 9:56 PM 0 comments
ఒకప్పుడు నన్ను అందరూ ...ఎందుకు ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచిస్తావ్..రాస్తావ్ ...అనేవారు ...ఇప్పుడు రాయడం మానేసా కాబట్టి అనడం లేదేమో :) ...విషయం ఏంటంటే ...
ఇక్కడ copy , ఇక్కడ అసలు
అదీ నాదేశం ప్రపంచానికి అందించిన హిందూ మతం గొప్పతనం...వింటున్నారా ఓ వెంకయ్యా? అద్వానీ? వాజపేయీ???
అప్పుడెప్పుడో ముషారఫ్ మనవాళ్ల కన్నా చాలా better అంటే నన్ను దాదాపు తన్నినంత పనిచేసిన మిత్రులారా...ముఖ్యంగా టెలికాం లో మార్పులు చదివాక మండిపడుతున్న pinkos :)
పోయిన నెల దావోస్ లో షౌకత్ చెప్పింది విన్నారా? 90 శాతం బ్యాంకులు ప్రైవేటు పరం చేస్తే, NPA లు సున్నాకీ , వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అప్పు నాలుగురెట్లు పెరిగాయట. అదే పనికి మీరు ఎందుకు ఒప్పుకోరు? అక్కడ ఉన్న ఒకేఒక విమాన యాన సంస్థని అమ్మేస్తున్నారు .. చమురు పరిశ్రమ దారిలోనే ...ఫలితం? తగ్గుముఖం పట్టిన నష్టాలు మరియు పెరిగిన వినియోగదారులు ..ఇక్కడ మీరు సదరు పనులకు ఎందుకు ఒప్పుకోరో ఆ విషయం ఒప్పుకొనే ధైర్యం లేదు ...సదరు సంస్థల్లో మీకున్న వోట్లు గల్లంతవుతాయనీ, రాజకీయాలు లేనిదే మీ ముఖాలు ఎవడూ చూడడని ... ఎప్పటికి తెలుసుకొంటారో నా దేశ పెజలు :(
Posted by chava at 11:02 PM 0 comments
చిట్టెమ్మ గురించి విన్నా ఇవాళ ...ఆవిడంటే అందరికీ అదోరకమయిన చులకన...తనకి అవసరం అయింది ఏది అయినా అడిగి మరీ సాధించుకోవడం చిట్టెమ్మకి అలవాటు... పెళ్లికి వచ్చిందనుకొందాం ...పెళ్లి అయ్యి ఇంకా హడావిడి తగ్గక ముందే, "అమ్మాయ్ ! స్వీట్లు అయిపోయాయా?" అని అడుగుతుంది. అమెరికా నుండి మనవరాలు వస్తే, తనే పట్టుపట్టి బజారుకు తీసుకెళ్లి , టివి,ac వగైరా కొనిపించుకొస్తుంది ...అందరూ ఆవిడ గురించి తక్కువ చేసి మాట్లాడుతారు ...అవన్నీ ఆవిడకి తెలుసు అని నా అనుమానం.. అయినా పెళ్లి లో స్వీటు నచ్చినా , అడిగి ఇంకొకటి పెట్టించుకోడానికి మొహమాట పడి, ఇంకో స్వీటు తినాలి అనే కోరికని బలవంతంగా అణుచుకొనే వారికంటే చిట్టెమ్మ పద్దతి చాలా మంచిది అనిపించింది నాకు :)
Posted by chava at 9:59 PM 1 comments

this is the screen shot when tried to open Ben Goodger's,FireFox lead engg blog in IE :D ... sense of humour? :P 
Posted by chava at 9:36 PM 0 comments
గతం, ముఖ్యంగా బాల్యం మళ్లీ వస్తే ఎంత బావుండు ! అని చాలామంది , నాతో సహా అనుకొంటారు. ఎందుకని? బాల్యంలో మనకి కష్టాలు తెలియవు . బాల్యం తరువాత బడి కి పోతాం. అక్కడ మనపని చదువుకోడం.అదొక్కటే మనం చేసేది .మిగతా కష్టాలు అన్ని పెద్దలకి వదిలేస్తాం.చదువు ,ఆటలు , స్నేహితులు , భవిష్యత్తు గురించి భయం అనేది లేకుండా గడిపేస్తాం..పెరుగుతున్నా కొద్ది మనకి సమస్యలు(?) ..రేపు ఎలా ఉంటుందో తెలియదు.మనకి తెలియకుండానే మనలో background process run అవుతూ ఉంటుందేమో..ఏమవుతుందో అని .దానికి తోడు మనమీద మన పెద్దవాళ్ల ఆశలు . మనకి ఏది ఇష్టమో , మనం ఏం చేయాలో అన్నిటికి వాళ్ల ఇష్టాయిష్టాలు తోడవుతాయి. ప్రతి పనికి ఆలోచన . ఏది మంచో ఏది కాదో అన్న ఆలోచన. తప్పు చేస్తామేమో అన్న భయం.. అన్నిటికన్న ముఖ్యంగా రేపు ఏమవుతుందో అని తెలియని సందేహాలు ..గతంలో కూడా సమస్య లు వచ్చి ఉంటాయి ..కాని వాటిని మనం తెలివిగా సాధించి ఉంటాం..తెలిసిన సమస్య కి తెలిసిన పరిష్కారం ఉంటుంది..మరి తెలియని ,రాబోయే సమస్యకి? ఈ ప్రశ్న ఎప్పుడూ మనకి తెలియకుండా మనలో ఉంటుందేమో..అందుకే ఎప్పుడూ గడిచిన కాలం మనకి ఇష్టం అయి ఉంటుందేమో?
పై విషయానికి సంబంధం లేనిది... ఎక్కడో ఇవాళ చదివా ..ఎవరిదో ఒక బ్లాగు design ఎవరో copy చేసారని పెద్ద రగడ. చేస్తే వచ్చిన నష్టం? తనకి రావాల్సిన పేరు పక్క వాడు కొట్టేసాడనా? అసలు ఏది original అని? అన్నిటికి మూలం ఎక్కడో వేరే చోట ఉంటుంది కదా? ఆ మూలాన్ని copy చేయంది ఎవరు? ఏమో ..మనుషులు పెరిగినంతగా మన ఆలోచనా పరిధి పెరగడం లేదా?
Posted by chava at 8:56 AM 0 comments
ఒకోసారి మనకి తెలుసు ఖచ్చితంగా అనుకొన్నవి తప్పులు అయి ఉండవచ్చు . పరిటాల గురించి నాకు చాల తక్కువ అభిప్రాయం ఉండేది .కాని గత ఎన్నికల ముందు పరిటాల ముఖాముఖి చూసా.అందులో అతను చెప్పినవి విన్నప్పుడు , అతనున్న పరిస్థితిలో ఎవరైనా అలానే స్పందిస్తారు అనిపించింది. కాకపోతే చాలా మంది ఆ స్పందనని తన మనసులో దాచుకొంటారు . అతను మనసులో అనుకొన్నది చేతల్లో చేసాడు. అది తప్పు అని అతనికీ తెలుసు .తప్పు అని తెలిసీ చేయక తప్పలేదు అని చెప్పాడు. చేసేది తప్పు అని తెలిసినా ఒప్పుకొనే ధైర్యం ఎందరికి ఉంటుంది? అది పరిటాల లో ఉంది . ఆ కారణం చేత మెచ్చు కోవచ్చు అతనిని అనిపించింది . అయితే మాత్రం చంపుతాడా ఎదుటి వాడిని అంటారు . మొన్న ధనుంజయ్ కి ఉరిశిక్ష విషయం లో అతనిని ఉరి తీయాల్సిందే అని గొంతు చించుకొని అరిచిన వాళ్ళే పరిటాల అదే తప్పు చేసిన వాడిన వాడికి , అదే శిక్ష వేసినప్పుడు , తప్పు అని అరవడం ఎంతవరకు సమంజసం? అయినా ఏది సత్యం అనేది ఎవడు చెప్పాడు? నేను చెప్పేది నీకు నచ్చితే , నీకు ఉపయోగకరం అయితే , అది సత్యం అని నీ నమ్మకం. నచ్చలేదూ అది నీవు నమ్మలేదూ ... నీ వరకు అది అసత్యం...కాబట్టి సత్యాసత్యాలని పక్కన పెట్టు కాసేపు ... ఇవాళ పరిటాల అంతం అయాడు అనగానే కొందరు ... అమ్మయ్యా పీడా పోయింది అంటున్నారు ... కాని పరిటాలని మించిన వాడు ఇంకొకడు ఖచ్చితంగా వస్తాడు. చరిత్ర తవ్వడం మనకి పుట్టుకతో వచ్చించే కదా .. అనుమానం ఉంటే తవ్వి చూసుకో ...అతని అంతం కొందరికి ఇవాళ సంతోషం కావొచ్చు .. కాని అది కొందరికి జీవితాంతం బాధ , ఇంకొందరికి పగ .. అసలు పరిటాల తయారీ కి కారణాలు పరిశీలించి , అవి తిరిగి ఇంకా కొందరు పరిటాలలని తయారు చేయకుండా జాగ్రత్త పడితే అది సంతోషించాల్సిన విషయం. అది జరగాలంటే మరో పోరాటం అవసరమేమో అనిపిస్తుంది. ఎంచేతంటే ....
అరుణ్ గావ్లీ పోటీ చేసిన నియోజక వర్గం లో ఒక సాధారుణ పౌరుడిని కదిలిస్తే అతని స్పందన " అరుణ్ ఇలా MLA పదవి కి పోటీ చేయడం నాకేమీ నచ్చలేదు ..అతని స్థాయికి అతను డిల్లీ లో పార్లమెంటు లో ఉండాల్సిన వ్యక్తి " . అయిదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఒక రౌడీ గా పేరుమోసిన వ్యక్తి మీద , ప్రభుత్వం , అధికారుల మీద కన్న నమ్మకం ఎక్కువ ఉంది ఈ రోజు ప్రజలకి ."చాల్ ప్రజలు అతన్నిరోజూ అనేక సమస్యలతో కలుస్తారు .అతను తన మనుషులతో చెప్పి ఇక్కడి వారి సమస్యలు తీరుస్తాడు. అమ్మాయిల పెళ్లి కి పైసలు సహాయం చేస్తాడు . ఉచిత ఆంబులెన్సు సదుపాయం కల్పించాడు. నీళ్ల సరఫరా ఏర్పాటు చేసాడు . ఏ నాయకుడు చేసాడు మాకు ఈ మాత్రం సహాయం?" సాధారణ ప్రజలు మాత్రమే కాదు .." చనిపోయిన పోలీసు కుటుంబానికి క్రమం తప్పకుండా డబ్బు పంపే మొదటి వ్యక్తి అరుణ్ . మా క్వార్టరు రిపేరు ఉంటే , మా అధికారులు కాయితాలు అటు ఇటూ తిప్పుతూ కాలం గడుపుతారు.అరుణ్ ఆ కాయితాల పని అయ్యేలోపు రిపేరు చేయిచ్చేస్తాడు " - ఇది ఒక పోలీస్ అధికారి చెప్పిన విషయం..
అయ్యా అదీ సంగతి . తప్పు పరిటాలదా? పరిటాల లాంటి అవసరం కల్పిస్తున్న చుట్టూ ఉన్న మనలాంటి సమాజానిదా?
Posted by chava at 10:04 PM 2 comments
ప్రపంచంలో ఉన్నది ప్రేమా? భయమా? ప్రేమించాలి అని అనుకొనేవాడికి ప్రేమించబడాలి అనే కోరిక ఉంటుందా? ఉండదా? ఉంటుంది చాలా శాతం...ఆ కోరిక లేని వాడికి ప్రేమని పొందలేదు అనే బాధ ఉండదు . అలాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కడ చదివినా relationhip failure అని ఒకటే బాధ జనాలలో.. కారణం ? ఎంతసేపు అవతలి వాడిదే తప్పు అని ఒకటే సొద. అసలు ఈ conditional ప్రేమ concept ఏందో? నీకు నచ్చినట్టు ఎదుటి వాడు ఉండాలను కోవడం ప్రేమ ఎలా అవుతుంది? స్వార్ధం అవుతుంది. అంటే ప్రేమ, స్వార్ధం రెండూ ఒకటేనా? ఈ స్వార్ధం ఉందే ఇది ఆనందం తో కూడా కలిసి ఉండటం చాల చిత్రంగా ఉంటుంది.. దేవుడా నా ఈ ఆనందాన్ని ఇలానే ఉంచు అని కోరుకోడం స్వార్ధం తో కూడుకొన్నదే కదా? ఇంకో రకమయిన బాధ నేను ఫలానా పని చేయలేక పోయానే అని ... ఒక పని చేయాలి అని అనుకొన్నావా చేసేయి ... చేయాలని ఉన్నా చేయలేవని తెలిస్తే ఇక ఆ విషయం మర్చిపో .. అలా కాకుండా అయ్యో నేను చేయాలి , చేయలేదు , చేయలేక పోతున్నా అని ఊరికే ఎందుకు సొద? and this one is for pinkos aka whiners ..dont always blame govt for not helping u ... learn something from guys like Ramachandra Rao .. if possible let u r followers practice it ...
Posted by chava at 9:45 PM 1 comments
ఒక సమస్య సాధించడానికి ఎన్ని ఆలోచనలు చేయాలి? అదీ నాయకులుగా ఉన్నప్పుడు? ఒక వ్యక్తి కి సంబంధించిన విషయం అయితే పర్యవసానం పరిమితం గా ఉండొచ్చు ...కాని సమస్య రాష్ట్రం మొత్తానిది అయినప్పుడు , కొందరి నిర్ణయాలు అందరికీ ఇబ్బంది. హడావిడిగా చర్చలు అని మొదలెడితివి ...ఎవడేం మాట్లాడుతున్నాడో పక్కనోడి కి అర్ధం కాకుండా అందరూ మాట్లాడితిరి.అసలు సమస్య పక్కన పెట్టి ఆయుధాలు వదలాలని ఒకరు, వదలం అని ఒకరు బిగదీసుకొంటిరి.సందట్లో సడెమియా లా అన్నలు బలం పెంచుకొంటిరి. అధికారంలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగిన సుకుమారుడు దిగగానే వాళ్ళు మరీ అంత చెడ్డవాళ్ళు కాదు అని ప్రశంసాపత్రం అడకకుండానే ఇస్తిడి . ఇప్పుడు గద్దెనెక్కిన స్వరణ్జీతుడేమో వచ్చీ రాగానే గుండు పేల్చుకొంటూ వచ్చె ...అసలు ఏం చేయాలో , ఎలా చేయాలో ఎవరికీ తెలిసినట్టు లేదు . మీకే కాదు ... మీ ప్రత్యర్ధి కి కూడా... బస్సులేం అన్యాయం చేసాయో ...కోపం వచ్చిన ప్రతొక్కడు అవి తగలేస్తాడు. మాలో చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన మేధావులు ఉన్నారు అని గొప్పలైతే చెప్పారు అన్నలు . ఆ పెద్దలిచ్చిన సలహాయేనా ఈ తగలేయడాలు? బందులు? తిప్పి కొడితే 900 మంది లేరట .. నిజంగా అంత కష్టమైన పనా వాళ్లని అడ్డు తొలగించికోవడం? అయ్యి ఉండదు ... వేరే చాలా కారణాలు ఉండి ఉండాలి ..అవేమిటో అర్ధం అయీ కాకుండా ఉన్నాయి మరి ...ఈ గొడవ ఆగక ముందే మానవ హక్కుల వాళ్ళు తయారవుతారు .అరుపులు కేకలతో ... పోలీసులు , అమాయక జనం పోయినప్పుడు ఎక్కడ దాక్కుంటారో వీళ్లు? వోటు విలువ తెలుసుకొనే వరకు ఇంతే ....
Posted by chava at 6:35 PM 1 comments
విషయాన్ని టివి కథల లాగా సాగదీయకుండా త్వరగానే ముగించారు . సంతోషం ...ఇంతకీ మొదటి సారి చర్చల్లో ఏం అంశాలు చర్చించారు? నాకు గుర్తులేదు మరి ... అసలంటూ విషయం ఏమన్నా ఉంటే కదా గుర్తుండటానికి ... అయినా అన్నలూ .. మీ కోపం అవినీతి అధికారుల మీదో , నాయకుల మీదో చూపించితే అందరికీ మంచిది . IPS ల మీదో, కానిస్టేబుళ్ళ మీదో చూపితే ఏమొస్తుంది? అన్ని నొప్పులకీ ఒకటే మందు - జిందా తిలిస్మాత్ లాగ - అన్నిటినీ చివరకు -ISI తో ముడి పెట్టడం... ISI అంటే ప్రతి పక్షం వాడు నోరెత్తడు కదా మరి ... పెజాస్వామ్యం లో పెజల గొడవ ఎవడికి పట్టింది? నాయకులకీ కాదు .. అన్నలకీ కాదు ... మరెవరికి? ముక్కోటి దేవతలకి :D
Posted by chava at 10:30 PM 2 comments
నేను మంచిగా ఉండాలి.... అందరూ నన్ను మంచి వాడు అనుకోవాలి ... ఫలానా పని చేస్తే నన్ను చెడ్డవాడిగా చూస్తారు ...ఈ ఆలోచన రాకుండా ఉండేది ఎవరికి? ఎందుకు మంచిగా ఉండాలి అన్న ఆలోచన రావాలి? మనలా ఉంటే మనకేం గుర్తింపు రాదనా? అన్ని సుగుణాలే ఉండాలి "నా" లో అనే కోరిక ఎక్కడ నుండి పుడుతుంది? ఎందుకు పుట్టాలి? దానికి కారణం మన చుట్టూ ఉన్న వాళ్ళా? చిన్నప్పటి నుండి ఇలాగే ఉండు , లేక పోతే చెడ్డవాడు అంటారు అని ఎవరో పదే పదే చెప్పడమా? పక్క వాడికి నొప్పి కలిగించకుండా మన పనేదో మనం చూసుకొంటే అది మంచిగా ఉండటం అవుతుందా? పక్క వాడి బాధ లో మనం పాలు పంచుకొంటే ఇంకాస్త మంచి వాళ్ళం అవుతామా? మనం మంచి అనిపించుకోడానికి ఎన్ని సార్లు కొన్ని మంచి పనులు చేయలేదు? చేసే ఉంటాం .
ఇంతకీ ఇప్పుడు నేను ఇదంతా మంచోడు అనిపించుకోడానికే రాస్తున్నానా? ఏమో...అవునేమో హి హి హి :D
Posted by chava at 8:32 PM 2 comments
" We get caught. How? Not by what we give, but by what we expect. We get misery in return for our love; not from the fact that we love, but from the fact that we want love in return. There is no misery where there is no want. Desire, want, is the father of all misery. Desires are bound by the laws of success and failure. Desires must bring misery. "
" We are all the time, from our childhood, trying to lay the blame upon something outside ourselves. We are always standing up to set right other people, and not ourselves. If we are miserable, we say, "Oh, the world is a devil's world." We curse others and say, "What infatuated fools!" But why should we be in such a world, if we really are so good? If this is a devil's world, we must be devils also; why else should we be here? "Oh, the people of the world are so selfish!" True enough; but why should we be found in that company, if we be better? Just think of that. "
-- Vivekananda
Vivek used to be my handle online :) now lets see how many of u know me by that name :D
Posted by chava at 9:59 PM 2 comments
ఎందుకు మనుషులంతా ఒకేలా ఆలోచించరు? పోని అందరు ఆలోచించడం మానేయరు? ప్రప్ంచం లో ఇన్ని బాధలు..ఆలోచిస్తే (???) అన్నిటికి ఒకటే కారణం...ఒకరి ఆలోచనలకి మరొకరి ఆలోచనలకి తేడా..నేను చెప్పే బాధ శారీరకం కాదు. నేను ఆ పని చేయలేకపోయానే అని ఒకరి బాధ. చేయగలను అనుకొంటే చేసేయాలి .చేయలేము అని తెలిసినప్పుడు ఇక ఆలోచించడం మానేయాలి . ఇంకొందరికి నచ్చిన వాళ్ళు మాట అన్నారనో,వదిలేసారనో బాధ .మాట అన్నవాడు ఆ మాట ఎందుకు అన్నాడో..వాడున్న పరిస్థితి లో అలా అనడం ఒప్పేమో.
ముందు "నా" "నన్ను" "నాది" (అప్పుడప్పుడు english అయితే సులభం అనిపిస్తుంది:)) అవి పోతే ఇవన్ని చాలా వరకు పోతాయేమో. కానీ ఇక్కడో చిక్కు ఉంది :D .అవి పోవాలంటే ఎవరిలో ఎక్కడ పోవాలి ? "నా" లో :) మరి నా అనేది పోతే ఇక అవి ఎక్కడ పోవాలి? పోని ఎక్కడైతే పోవాలనుకొంటున్నావో , అది తెలియాలంటే , "నా " అనేది ఉండాలి ..మరి పోయేదెట్టా? ఎప్పటికి? :D ఇట్టా ఉంటుంది అడ్డ దిడ్డంగా అర్ధం అయీ కాకుండా :)
Posted by chava at 1:52 PM 3 comments
furl లో account open చేసా .. ఎప్పుడో చేయాల్సింది ...పనికొచ్చే పని చేయరా అని తాత చెప్పింది ఎప్పుడు విన్నాం గనుక :) పెద్ద స్వామిని వదిలిరి ..చిన్న స్వామిని పడితిరి ...ఇదేదో కత్తి పోయె పిల్ల వచ్చె డాం డాం డాం లా భలెగుంది :) .. డాక్టరు గారు పల్లెల్ని పట్టణాలు చేయడం అయిపోయి , పట్టణాలని నగరాల వైపు పరుగులు తీయించే పనిలో పడ్డారు .. చర్చలు సంతకెళ్ళాయి....త్వరలోనే శుభం కార్డు పడేలా ఉంది కథకి .
ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ !
అయ్యా అది సంగతి :)
Posted by chava at 9:38 PM 3 comments
"ఏది యెటులున్నను బ్రదుకవలయునను పామరత్వము తక్క మీకేమియు లేదు.బ్రదుకవలయును.బ్రదుకవలయును. ఎల్లకాలము బ్రదుకవలయును. ఎవరు చచ్చినను సరే నీవు మాత్రము బ్రదుకవలయును. ఎంతసేపు - నీ సుఖమే - నీ మేలు - నీ లాభము, కాని నీకు వేరొక్క చింతయే లేదు. నీవు చత్తువని యెరుఁగుదువు. కానీ యా మాట మఱచిపోవుదువు. వార్దకదేవత నీ వెన్నుపామువిరుఁగఁగొట్టి - నిన్నుఁదిర్యగ్గమనుని చేసినను,మృ తి సమీపించుచున్నది కదాయను మాటనైన మన్సునఁజేరనీయక - కర్ర చేతఁబుచ్చుకొని - యెంగిలి మెదుకులు దినుచున్న పిల్లిని గొట్టఁబోవుదువు. వార్దక దేవత నీ యెదుటఁబది మూఁతిమీఁదన్ని పండ్లు రాలఁగొట్టినను మరణ సన్నద్దుఁడవైయున్డక, యవసానమున మాటనైన నంతరగమునఁజేరనీయక, మఱులఁబండ్లు కట్టించుకొని - యిదివఱకు బ్రతికిన సిగ్గుమాలిన - పనికి మాలిన - మొండి మోటబ్రదకు - తిరిగి బ్రదుక దలఁచుకొందువు"
హి హి హి :)
Posted by chava at 1:12 AM 2 comments
మళ్లీ పని ...మధ్యలో మీటింగ్ . and that was refreshing :) had good laughs .. బయటికి వచ్చే సరికి మంచు దూది లా పడుతుంది ...మంచు రాత్రి పూట పడుతుంటే పగలు లా ఉంటుంది ..వచ్చి వేడి గా చాయ్ తాగి ...కాసేపు వార్తలు చదివి ...తినేసి ముసుగెట్టేసాం:)
Posted by chava at 10:16 PM 0 comments
పని పని పని.... రోజంతా పని ....మళ్లి బయట snow. దేశంలో అది లేకపోవడం మంచిదయింది .ఇళ్లు లేని వాళ్లు ఏమయేవాళ్లు? ఏమో ...
Posted by chava at 9:48 PM 0 comments
పొద్దున్నే నెత్తిన పిడుగు :) వారంలో fix చేస్తే చేయి లేక పోతే వెనక్కి తీసుకో అని ...గురువు గారు అటూ ఇటూ పరుగులు తీసి ,చివరికో పనికి మాలిన design నా నెత్తిన రుద్ది , నీ ఇష్టం వచ్చినట్టు చేయి , అది పని చేయాలి అని చెప్పి పోయాడు .మనం కూడా చెప్పాల్సింది చెప్పి , చిలక్కి చెప్పినట్టు :), వినడని తెలిసి కూడా, తేడావస్తే నాదే బాధ్యత అని గురువు గారి మాట తీసుకొని పని దాదాపుగా పూర్తి చేసా. రేపొద్దున K కి అర్ధం గాక జుత్తు పీక్కుంటాడేమో :(
గూండా కాసేపు చూసి , చూసిన దాంట్లో సగం పైగా ముందే ఊహించి , ఇంకా ఊహించి కోదండరామున్ని చిన్నబుచ్చలేక ఆపేసా. నిన్నటి raincoat కి మూలం "The Gift of Magi" అని తీరిగ్గా ఇవాళ గుర్తొచ్చింది . లాభం లేదు... మళ్లోపాలి ఎన్రీ కతలు సదవాల్సిందే ..ఈ ఈకెండు గ్రంతాలయానికెళ్లాల్సిందే...
Posted by chava at 10:39 PM 4 comments
గొర్రెలా బతికితే సరిపోయే :) ఇప్పుడు మాత్రం బతుకుతుంది గొర్రెలా కాక ఎలా?? ప్రతి విషయంలో ఎవడో ఏదో చెప్తాడు . ఆ పలానా పని ఆ పద్దతిలో మాత్రమే చేయాలి అని . మనిషి అయినందుకు ఆలోచించాలి అనే విషయం తో సహా :) . ఆ లెక్కన చూస్తే గొర్రె చాలా నయం అనిపిస్తుంది. ఎంచేతంటే అది ఆ విషయంలో కూడా ఎవరి మాటా విననక్కర్లేదు కాబట్టి. వస్తా వస్తా అంటున్న V నిన్న దిగాడు. కాసేపు కష్టపడి ఏదో వాగించాడు :) చివరికి తేల్చింది అంతా ఉత్త మాటలేనని .కాసేపు bestbuy వాడి కష్టాలు చూసి , నవ్వుకొని , తిట్టుకొని , అటు ఇటు తిరిగి వాడికి కావలిసింది తెచ్చుకొని మళ్లీ దారి పట్టాడు,ఈ సారి నేను అటు వస్తానని నాదగ్గర మాట తీసుకొని. నిన్న ఆడిటింగ్ పనిలో అలసట .రోజు మధ్యాహ్నం ఆడెట్టిన గడ్డి తిని , ఆ పని చేస్తే gym కే పోనక్కర్లేదు అన్నాడు E :) .
Posted by chava at 8:44 PM 4 comments
రాను రాను నాకు మనుషులతో మాట్లాడాలంటే కష్టం గా ఉంటుంది. ఎదుటి వాడు ఏం మాట్లాడినా ఆసక్తి లేకుండా పోతుంది. ముఖ్యం గా తెలిసిన విషయం అయితే . అవతలి వాడు వాడికి తెలుసు అన్నది మనతో చెప్పాలి అనుకోవడం స్పష్టం గా అర్ధమయితే ఇంకా చిరాకు . ప్రపంచం లో ఇద్దరి మధ్య సంభాషణ ఒకరి నొకరు ఒక విషయం లో ఒప్పించడానికి జరిగే వాదన . ఇది నిజమేమో చాలా సందర్భాలలో...
గొప్ప తెలుగు మనిషి ఎవరో ఓటు వేయాలట :) నాకు చాలామంది గొప్ప వాళ్లు తెలుసు . వాళ్లు నా వరకు నాకు గొప్ప . కాని ఆ గొప్పదనం మీ అందరికి గొప్ప కాక పోవచ్చు । అంతమాత్రానికి వాళ్ళు గొప్ప కాకుండా పోతారా? ఏంటో ఇట్టాంటి ఆలోచనలకి మూలం ఏంటో? పైన చెప్పిన "పక్క వాడికి " తెలియ జెప్పడం అయి ఉండాలి . ప్రతి విషయం లో వాదన. వాదించి గెలిచాం అన్న త్రుప్తి? ఇదేనా అందరు చెప్పే "నా" ? ఏమో అయినా అందరూ చెప్పేదాని గురించి ఆలోచన అనవసరం అనుకొన్నా కదా? :) ఇప్పటి వరకు ఎవడూ ఏమీ చెప్పలేదు. ఇక ముందు కూడా ఎవడు చెప్పడు. ఎంచేతంటే చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి:)
Posted by chava at 10:51 PM 1 comments
మరొక రోజు... కొత్త సంవత్సరం లోకి తెచ్చిన రోజు. పోయినేడాది "నాకేమీ తేడా లేదు.. ఏమీ చేయలేదు ఎప్పటిలా అదే time కి పడుకొన్నా అంటే ", ఎవరితో చెప్పకు... నవ్వుతారు అన్నాడొకడు... నవ్వడానికి ఏమ్ంది అందులో అని ఈసారి ౧౨ వరకు మేలుకొని చూసా... ఏమో నాకేమి తేడా లేదు.. ఆన్ంద్ సినెమా మళ్లోసారి చూసాం . ఈ సారి E తో కలిసి . ఇంక నిద్ర వస్తుంది. రేపు మిగతాది।
Posted by chava at 1:21 AM 1 comments
oh boy ... been to so many blogs today ... oflate i have been stopped thinking altogether .. donno why .. but since then i find my self so calm ..so much peace ... and once agian they all came back to me ...or do i feel so ? why did i read UG? or VC or anybody else .why cant i just stop reading altogether . well my guess is it all started with me reading MEWT by MKG :( never again read him . well i dont have to .. i feel like i almost remember that whole book :(
while comming back from gym, out of blue i remembered what Kashi once told Ani :
" there is nothing to like or to dislike . if u dont like that i like it . if i dont like something u may like it though thats the same thing that appears differently" . that kid , ani , 7 yrs old got it right . nobody told me the same thing when i was that old :( it took me almost 25 yrs to realise the same thing . still cannot comprehend it . i wonder , me or ppl of my age ever get it???
Posted by chava at 10:48 PM 0 comments
ALOCHANA
ఇన్ని ఆలోచనలు ఉంటే అంతే మరి :) అందుకే no thoughts no worries :D
Posted by chava at 2:32 PM 1 comments
సునామి సంభవించిన ముందు రోజు... చలం రాసిన 1962 లో జల ప్రళయం గురించి చదివి నవ్వుకొన్నా... ఆ మనిషి నాకు అర్ధం కాడు..కాసేపు దేవుడు , దయ్యం అంతా trash అన్నాడు .. ఒకానొక సమయం లో ఈశ్వ రానుగ్రహం అంటాడు. ఏమయ్యా చలం , ఇంతటి చలించే మనస్సు ఏంటి నీకు?
సునామి ని జాతీయ విపత్తు గా పరిగణించాలని , సహాయం అలా చేయాలి , ఇలా చేయాలి అని ఒకటే రొద. మేము అలా చేసాం .మీరు ఇలా చేసి తగలడుతున్నారు .. పాత్రలు అవే .స్ంభాషణలు అవే... ప్రేక్క్షకులు వారే... మరి మారింది ? శూన్యం ...
Posted by chava at 11:01 AM 0 comments
yudit మరియు పోతన ఫాంట్ ఉపయోగించి తెలుగు లో net పై ప్రచురించడము :
1)www.yudit.org కి వెళ్ళండి
2) yudit డౌన్ లోడ్ చేసుకోండి ,"binary packages- including windows version"
3)save చేసుకోండి . save చేసిన ఫైలు double click చేసి install చేయండి(admin అయిఉండాలి మీరు)
4) default settings అన్ని ok చేయండి5) పోతన ఫాంట్ pothana2000.ttf ను www.kavya-nandanam.com/dload.html నుండి డౌన్ లోడ్ చేసుకోండి ।read only version సరిపోతుంది.unzip చేసిన తరువాత pothana2000.ttf దర్శనం ఇస్తుంది :)
6) MyComputer->C->ProgramFiles->Yudit->fonts కు వెళ్ళండి.pothana2000.ttf ఫైలు ను అక్కడ copy చేయండి.
7) MyComputer->C->ProgramFiles->Yudit->Conf కు వెళ్లండి. yudit.conf ఫైలు ను wordpad లో open చేయండి.
8) "yuidt.font.truetype= arial.ttf,...." లైను కోసం వెతకండి. ఆ లైను చివర ఒక కామా ఉంచి pothana2000.ttf అని రాయండి
।9) ఆ ఫైలు సేవ్ చేయండి.
10) yudit ను run చేయండి
11) కుడి నుండి మూడవ tab , A అనే అక్క్షరం తో ఉన్న దానిని click చేయండి।దానిని default కు మారు వరకు నొక్కండి.
12)కుడి నుండి రెండవ tab ,blue arrow ఉన్నది, నొక్కండి
13)ఎడమ వైపు "Available k-maps" లో "Telugu" select చేసుకోండి.
14)పక్కన ఉన్న blue arrow ni నొక్కండి. OK నొక్కండి
15) తెలుగు లో రాయడం ప్రారంభించండి :)
16) అక్కడ రాసింది cut చేసి మీ html editor లో paste చేయండి .
17) ghostscript మరియు ghostview,(ఉచితం) లు ఉంటే pdf కు మార్చుట కూడ సులభం. అవి లేనిచో www.cs.wisc.edu/~ghost కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి. print tab ఉపయోగించి pdf file గా మార్చడం చాలా సులభం :)
సందేహాలు , సలహాలకు శరత్ చావా @జి మైల్.కాం .
Posted by chava at 5:00 PM 0 comments