టూకీగా
ప్రస్తుత కాలంలో బాగా నడిచే అవకాశం ఉన్న వ్యాపారం?
ప్రస్తుత కాలంలో బాగా నడిచే అవకాశం ఉన్న వ్యాపారం?
Posted by chava at 12:23 AM 0 comments
"నాకొక నికార్సయిన రాజకీయ నాయకుడు తెలుసు " - ప్రస్తుత కాలం లో ఇదేదో వినకూడని మాటేదో విన్నట్టు ఉంది కదా? కాని నేను అలాంటి నాయకున్ని పలుసార్లు కలవడం, జీవితానికి సరిపోయే విషయాలు తెలుసుకోవడం 15 రోజుల క్రితం వరకు జరిగింది. ఆయనే చేకూరి కాశయ్య గారు.
ఆయనతో మాట్లాడితే అన్నీ పనికొచ్చె విషయాలే. మన సమయం విలువ మనకంటే బాగా ఆయనకే తెలుసేమో అనిపిస్తుంది. మనకి వినాలని ఉన్నా, "రైట్- ఇక బయలు దేరండి "అని వినేవాడి సమయం వృదా చేయకూడదని పంపేసే మనిషిని, నేనైతే, తననే చూడడం.
"చేకూరి కాశయ్య గారికే మన ఓటు " - నాకు గుర్తు ఉండి సత్తుపల్లిలో గోడలమీద ఆయన పేరు పరిచయం. మణుగూరు లో ఆయన కుటుంబం సభ్యులతో దగ్గర పరిచయం ఉన్నప్పటికీ ఆయనని కలవడం మాత్రం అక్క పెళ్లి లో మాత్రమే. నాన్న రిటైర్మెంట్ రోజు ఆయనతో ఒక గంట గడిపే అవకాశం వచ్చింది. మొదటి సారి ఆయన ఎలా ఆలోచిస్తారో కాస్త అనుభవం అయింది ఆరోజే. ఎక్కువ సమయం ఆయనతో గడపడం మాత్రం నేను అమెరికా నుండి వెనక్కు వచ్చినప్పటి నుండే. చెప్పడానికి బాధగా ఉన్నా, ఆయన అనారోగ్యం ఆ అవకాశాన్ని నాకు కల్పించింది. చికిత్స కోసం హైదరాబాదు వచ్చినప్పుడల్లా కలవడానికి ప్రయత్నించేవాళ్ళం. "దీప వచ్చింది " అనగానే "శరత్ కూడా వచ్చాడా " అన్నప్పుడల్లా కొంత గర్వం నాలో .
కలిసినప్పుడల్లా , కలిసిన వారినందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించడం ఆయనకే సాధ్యం. కొన్ని లక్షల మనుషులను గుర్తుపెట్టుకొని, వారి ప్రస్తావన వచ్చినప్పుడు వారిలో ఉన్న మంచిని మాత్రమే ప్రస్తావించడం ఆయనకీ మాత్రమే సాధ్యమైన మరో గొప్ప లక్షణం . చిన్న పిల్లలనుండి , ప్రధానమంత్రులుగా పనిచేసిన వారి వరకు , ఎవరి గురించి అయినా ఆయన ధోరణి అలానే ఉండేది.
ఆయనకి నచ్చక పోవడం అనే లక్షణం లేదు. ధన, వస్తు , సౌఖ్యాల మీద మోజు లేదు. గాంధేయ వాదం అనొచ్చో లేదో కానీ - అటు ఇటుగా గాంధీ గారి లాగే ఉండేవారు. తినే తిండి, కట్టే బట్ట , మనుషులమీద ప్రేమ - పుస్తకాలలో గాంధీ గారి గురించి చదివాము కానీ , కాశయ్య గారిలో చూసాం. "గాంధి " - ఆ మాట వినగానే ఆయన మోహంలో అదొక రకమైన వెలుగు. అంతటి సౌమ్యుడికి కోపం తెప్పించగలిగిన ఘనుడిని అవ్వగలిగా అనుకొంటా :( "గాంధీ" - చివర "గారు" చేర్చలేదని - క్షణకాలం ఆయన మోహంలో కొంత అలజడి -" "గారు" అంటే మనకి వచ్చే నష్టము ఏమి లేదు కదా శ రత్ " - అని సంభాషణ ఆపేసారు.
ఆయన అవసరాలు మితం - మిత్రులు అపరిమితం. flavored yogurt, ఆవకాయ, దబ్బకాయ పచ్చడులు, టమాటో సూప్ మాకు తెలిసి ఆయన ఇష్టంగా తినేవి. రెండు చపాతి , దాల్ తడకా చాలు ఆయన భోజనానికి . రెండు జతల ఖద్దరు బట్టలు , భుజాన కండువా , కాళ్ళకి చెప్పులు , కంటికి జోడు ఉంటే చాలు ఆయన ఎక్కడకంటే అక్కడకి వెళ్ళడానికి . పిలిస్తే పలకడానికి ఉన్న లక్షల మంది ఆయన సంపాదించిన ఆస్తి. ఇంట్లో వాళ్లకి సహాయం చేస్తే, అందరి నాయకులకి తనకి తేడా ఏమిటి అనుకొనేరకం ఆయన.
"ఉన్నదంతా మనిషి బుర్రలోనే , బయట ఉన్నది మన మెదడు సృష్టే " అని నమ్మేవారు కనుకనే అంత నిస్వార్ధం గా, నిరాడంబరంగా ఉండగలిగారు. కండ్లు కనపడక పోయినా అదే చిరునవ్వుతో ఎలా ఉండగలిగారో అనుకునేలోపు - " నా Positivity నే నా Secret శరత్ " అని చె ప్పే శారు. తనని కలిసిన సమయంలో ఎదుటి వ్యక్తిలోని మనిషి ని బయటకు తీయించగలగడం ఆయన ప్రత్యేకత. స్నేహం ఆయన అమితం గా కోరుకొనేది. ఆయనతో ఒకసారి మాట్లాడితే మర్చిపోవడం కష్టం. అలాంటిది కొన్ని రోజులు దగ్గరగా ఉండగలగడం ఒక అరుదైన అవకాశం. కొల్లాయి కట్టిన గాంధీ నుండి , గులాబీ కప్పిన కేసీఆర్ వరకు - ఊర్లో కుమ్మరి నుండి , work from home చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ వరకు - అనేక విషయాలు- ఆయన తో మాట్లాడినవి . అవన్నీ రాయడం అయ్యేపని కాదు.
వారి అబ్బాయితో అన్నట్టు - మనిషి మాత్రమే పోయారు, నేర్పిన విలువలు, జ్ఞాపకాలు కాదు.
_^_
Posted by chava at 11:49 PM 1 comments
Posted by chava at 6:33 AM 0 comments
Posted by chava at 7:56 AM 0 comments
Posted by chava at 2:03 AM 2 comments
అయిదేళ్లకో కొత్త ఎపిసోడ్ తో నడిచే కామెడీ సీరియల్ ప్రస్తుత ఎపిసోడ్ చివరి అంకం లో ఉన్నట్టుంది . ఒక్క ఎర్ర చొక్కాలు తప్ప అందరూ ఎగబడి వరాలు ఇచ్చేస్తున్నారు . అవి నిజం గా వరాలా? శాపాలా? పేదవాడికి అన్నీ ఉచితం గా ఇస్తాం అంటున్నారు . ఎలా ఇస్తారు? మధ్యతరగతి వాడి దగ్గర లాక్కొని పేద వాడికి పంచా? తినడానికి కిలో 2 కి బియ్యం ఇచ్చి, ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి , కాళ్లు బార్లా చాపుకొని చూడటానికి కలర్ టీవి ఇచ్చి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచుతున్నారా? లేక అన్నిటికి మీమీద ఆధారపడేటట్టు చేసి ,తన బతుకు తను బతికే హక్కుని లాక్కొంటున్నారా? ప్రతి ఒక్కడూ అదిస్తాం ఇదిస్తాం అనేవాడే తప్ప ఎలా ఇస్తారో, ఒక్క జె.పి తప్ప , చెప్పిన పాపాన పోలేదు . చెప్పేదేముంది సబ్సిడీ ఇస్తాం అంటారు . అంతేనా? సబ్సిడీ వలన కలిగే లోటు ని ఎలా పూడుస్తారు? ప్రభుత్వ ఆస్తులు అమ్మనయినా అమ్మాలి . లేదా అప్పులు తేవాలి. ఆస్తులు ఏదో ఒకరోజుకి తరగక తప్పవు . అప్పులు తీర్చకా తప్పదు . అప్పు ఎలా తీరుస్తారు? మళ్లీ కథ మొదటికే . పన్నులు వేయడం . పన్ను కట్టేది ఎవడు ? కొనుక్కొన్న వాడు, సంపాయించిన వాడు ...ఉరఫ్ మధ్యతరగతి వాడు . పేదవాడికి పని చూపించ గలిగితే కదా వాడి సంపాదన మీద పన్ను వేయగలిగేది . లేదా వాడు కొనుక్కొగలిగితే కదా వాడి కొనుగోళ్ల మీద పన్ను వేయ గలిగేది . రెడ్డి గారు పెద్ద ఎత్తున జలయజ్ఞం మొదలెడితే ఇన్నాళ్లకి ఒక మంచిపని చేసారు అనుకొన్నా . ప్రాజెక్టులు ప్రత్యక్షం గా పరోక్షంగా చాలా మందికి పని చూపిస్తాయన్న నమ్మకం తో . కాని ప్రాజెక్టుల వ్యయం లో సగానికి పైన లెక్కలకి మాత్రమే పరిమితం అయినట్లున్నాయి. మిగతా మొత్తం ఎవరో కొందరు పెద్ద మనుషుల జేబుల్లోకి చేరాయి .
ప్రియతమ మాజీ , నేను అర్ధ శాస్త్రం లో పట్టభద్రుడిని , నాకు తెలుసు ఎలా బడ్జెట్ వేయాలో అన్నారు . గత ఎన్నికల ముందు వరకు మీరు మీ ఆర్ధికశాస్త్ర ప్రతిభ ఉపయోగించినట్టున్నారు . ప్రస్తుతం పక్కా రాజకీయ ప్రతిభని చూపిస్తున్నారు .
ఒకరు 7 అంటే , ఒకరు 9 , మరొకరు 12... ఇది కూరగాయల మార్కెట్టు లా ఉంది తప్పితే పెజస్వామ్యం లా లేదు . ఎంతసేపు అధికారం లోకి ఎలా రావాలో అన్న ధ్యాస తప్ప ప్రజల బాగోగులు పట్టించుకొనే వాడెవడు ? మేమున్నాం అంటూ ఎర్ర జండా అక్కడక్కడ పైకి లేస్తుంది కానీ ఆ జండా కూడా ఆ తానులో ముక్కే . "ప్రతి సమస్య కి అమెరికా యే కారణం " అది వారి నినాదం . పొరుగున ఉన్న కమ్యూనిస్టు చైనా అమెరికా తో చేసే వ్యాపారం ఎంతో వాళ్లకీ తెలుసు . చైనా ఎంతగనం విదేశీ పెట్టుబడులని ప్రోత్సహిస్తుందో కూడా తెలుసు . ఓ జ్యోతిబసు, ఓ బుద్ధదేవ్ లాంటి వౄద్ద నేతలు మాత్రమే ఆ నిజాన్ని ఎందుకు ఒప్పుకోగలిగారు ? బంద్ చేయొద్దు అన్నందుకు న్యాయ వ్యవస్థ మీద నిప్పులు చెరగడం మాత్రమే యువతరపు ఎర్ర చొక్కాలకి తెలుసు అనుకోవాలా?
ఆలొచిద్దాం .. ఆలొచింప చేద్దాం .. ఈ సారి వోటేసేముందో సారి ...
Posted by chava at 6:53 AM 7 comments